మాంసాహారానికి ప్రత్యామ్నాయాల్ని ధాన్యాలనుంచి తయారుచేయడానికి దశాబ్ద కాలంగా పెద్ద ఎత్తున పరిశోధన జరుగుతోంది. తాజాగా అచ్చం పందిమాంసంలాగే ఉండే ఉత్పత్తిని సోయాతో తయారుచేసి సంచలనం సృష్టించింది ఇంపాజిబుల్ ఫుడ్స్. చూడటానికీ, వాసనలోనూ, రుచిలోనూ అచ్చంగా పోర్క్‌లాగే ఉంటుంది వారు తయారుచేసిన ‘ఇంపాజిబుల్ పోర్క్’.
మామూలుగా పోర్క్‌తో ఏయే వంటలు చేసుకుంటారో అవన్నీ దీంతోనూ చేసుకోవచ్చు. ఆరోగ్యపరంగా కూడా దాంట్లో లభించే ప్రొటీన్లు ఇందులోనూ లభిస్తాయి. ఇప్పటికే మామూలు మాంసం స్థానంలో శాకాహార మాంసాన్ని వాడి దాంతో బర్గర్‌లను తయారుచేసి అమ్ముతున్న ఈ సంస్థ ఇప్పుడు పందిమాంసానికీ ప్రత్యామ్నాయాన్ని తయారుచేయడంలో విజయం సాధించింది. ఇది ఎంతగా మాంసాన్ని పోలి ఉంటుందంటే ఆఖరికి సన్నటి ముక్కలుగా తరిగేటప్పుడు లోపలి నుంచి రక్తంలాంటి ద్రవం కూడా వస్తుంది. ప్రధానంగా సోయా గింజలకు, కొబ్బరి, సన్‌ఫ్లవర్ నూనెల్ని జతచేసి దీన్ని తయారుచేస్తున్నారు.
- ఇదీ చూడండి తీరు మారని తబ్లీగీలు- మాంసాహారం కోసం రగడ!