ETV Bharat / lifestyle

వ్యాయామం చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి

వ్యాయామాలు చేసేటప్పుడు కొంతమంది తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. దీంతో పలు రకాల ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. అవేమిటంటే...

వ్యాయామం చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి
వ్యాయామం చేసేటప్పుడు ఈ జాగ్రత్తవ్యాయామం చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి పాటించండి
author img

By

Published : Feb 24, 2021, 8:19 AM IST

వామప్‌తో ప్రయోజనాలెన్నో..

శరీరాన్ని ముందుగా వ్యాయామానికి సిద్ధం చేయకుండా నేరుగా కసరత్తులు మొదలుపెట్టకూడదు. వామప్‌ చేయడం వల్ల కసరత్తులు చేయడానికి అనువుగా కండరాలు సిద్ధమవుతాయి. వాటికి ఆక్సిజన్‌ సరఫరా అవుతుంది. రక్తప్రసరణ సాఫీగా సాగి, గుండె కొట్టుకునే వేగం, శరీర ఉష్ణోగ్రత పెరిగి, అనారోగ్యాల బారినపడే అవకాశం తగ్గుతుంది. అందుకే వ్యాయామానికి ముందు కనీసం పావుగంటసేపైనా వామప్‌ చేయాలి.

రోజూ ఒకేలాంటివి వద్దు

కొంతమంది రోజూ ఒకేలాంటి వ్యాయామాలను చేస్తుంటారు. దీనివల్ల ఒకే భాగంలోని కండరాలపై ఒత్తిడి పెరుగుంది. దీంతో అనారోగ్యం బారినపడే ప్రమాదం ఉంది. అంతేకాదు సమయమూ వృథా అవుతుంది.

సరైన భంగిమ

కొన్ని రకాల వ్యాయామాల్లో సరైన భంగిమలో ఉండటం చాలా అవసరం. దాన్ని తప్పుగా చేయడం వల్ల పడాల్సిన భాగాల మీద కాకుండా... ఇతర భాగాలపై మీద ఒత్తిడి పడుతుంది. దాంతో శరీరాకృతిలో మార్పు వచ్చే అవకాశమూ ఉంది.

సూచనలు తీసుకోవాలి

భంగిమ పెట్టడానికి సంబంధించి ఎలాంటి సందేహాలు వచ్చినా నిపుణుల సూచనలు, సలహాలు తీసుకోవాలి లేదా పూర్తి సమాచారాన్ని చదివి అవగాహన ఉంటేనే వేయడం మొదలుపెట్టాలి.

ఎక్కువ నీళ్లు తాగాలి

సాధారణంగా రోజుకు ఆరు నుంచి ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలి. వ్యాయామాలు చేసేవారి శరీరం చెమట రూపంలో నీటిని కోల్పోతుంది. అందువల్ల వీళ్లు అదనంగా నీళ్లు తాగాలి.

ఇవీ చూడండి: రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.