ETV Bharat / lifestyle

ఎంత తిన్నా బరువు పెరగట్లేదా? ఇందుకేనేమో.. చెక్ చేసుకోండి! - health issues cause weight loss

అధిక బరువుంటే తగ్గేదాకా ప్రయత్నిస్తూనే ఉంటాం.. అదే సన్నగా ఉంటే పెరగాలని ఆరాటపడుతుంటాం. ఇక కొంతమందైతే ఇందుకోసం ఏది పడితే అది విపరీతంగా తినేస్తుంటారు కూడా! కానీ కొంచెం కూడా పెరగకుండా అలాగే సన్నగా ఉంటారు. అయితే ఇలా ఎంత ప్రయత్నించినా బరువు పెరగట్లేదంటే అందుకు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు కారణం కావచ్చంటున్నారు నిపుణులు.

reasons-for-losing-weight-and-tips-to-gain-weight
ఎంత తిన్నా బరువు పెరగట్లేదా?
author img

By

Published : Feb 18, 2021, 4:04 PM IST

వైష్ణవిని చూసిన వాళ్లు ‘సరైన ఆహారం తీసుకోవట్లేదేమో.. అందుకే ఇంత సన్నగా ఉంది..’ అంటుంటారు. కానీ తాను మాత్రం ఎంత తిన్నా, బరువు పెరగాలని శతవిధాలా ప్రయత్నించినా కొంచెం కూడా పెరగలేకపోతోంది.

వైశాలిది కూడా ఇదే సమస్య. అయితే తాను బరువు పెరిగేందుకు న్యూట్రిషనిస్ట్‌ సలహా మేరకు ప్రత్యేకమైన డైట్‌ కూడా పాటిస్తోంది.. అయినా ఫలితం మాత్రం శూన్యం.

బరువు పెరగడానికి ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. అవే మీరు బరువు పెరగడానికి అడ్డుపడవచ్చంటున్నారు. మరి, ఇంతకీ ఏంటా సమస్యలు? బరువు పెరగకుండా అవి మనల్ని ఎలా ఆపుతున్నాయంటే..!

సాధారణంగా కొంతమందిలో జీవక్రియల పనితీరు మరింత చురుగ్గా ఉంటుంది.. తద్వారా వారిలో క్యాలరీలు వెంటవెంటనే కరిగిపోతూ అదే బరువును కొనసాగిస్తుంటారు. అంతేకాదు.. కొంతమంది బరువుపై వారి కుటుంబ చరిత్ర, జన్యువులు.. వంటివి కూడా ప్రభావం చూపుతాయి. అంటే వారి తల్లిదండ్రులు, అంతకుముందు తరం వారు తక్కువ బరువుతో ఉంటే వీళ్లూ అలాగే ఉండే అవకాశాలు ఎక్కువ. ఇక ఈ రెండూ కారణం కాదంటే మన ఒంట్లో ఉండే పలు అనారోగ్యాలు కూడా మనం బరువు పెరగకుండా అడ్డుపడతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

థైరాయిడ్‌ మరీ చురుగ్గా ఉంటే..!

reasons-for-losing-weight-and-tips-to-gain-weight
థైరాయిడ్‌ మరీ చురుగ్గా ఉంటే..!

థైరాయిడ్‌ హార్మోన్‌ మన శరీరంపై రెండు విధాలుగా ప్రభావం చూపుతుంది. మొదటిది - ఆ హార్మోన్‌ తక్కువగా ఉత్పత్తై జీవక్రియలు నెమ్మదించడం వల్ల బరువు పెరుగుతాం. అదే ఆ థైరాయిడ్‌ గ్రంథి మరీ యాక్టివ్‌గా ఉండి ఎక్కువ మొత్తంలో హార్మోన్లను విడుదల చేస్తే జీవక్రియలు వేగవంతమై క్యాలరీలు త్వరత్వరగా కరిగిపోతాయి. ఫలితంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. దీన్నే ‘హైపర్‌ థైరాయిడిజం’ అంటారు. ఇదిలాగే కొనసాగితే మరింత సన్నబడే ప్రమాదం ఉంటుంది. అందుకే దీనికి వైద్యుల సలహా మేరకు మందులు వాడుతూనే వారు సూచించిన ఆహారం తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.

టైప్‌-1 డయాబెటిస్

మధుమేహం కూడా ఎక్కువగా బరువు తగ్గేలా చేసి బరువు పెరగకుండా అడ్డుకుంటుందట! అదెలాగంటే టైప్‌-1 డయాబెటిస్‌తో బాధపడుతోన్న వారి రక్తంలో గ్లూకోజ్‌ స్థాయులు ఒక్కసారిగా పెరిగిపోతాయట. ఇలా అధిక గ్లూకోజ్‌ మూత్రవిసర్జన ద్వారా బయటికి వెళ్లిపోవడం వల్ల ఎక్కువగా బరువు తగ్గడానికి దారి తీస్తుందంటున్నారు నిపుణులు.

ఈ వ్యాధి ఉన్నా..!

పేగుల్లో వచ్చే వాపు, అల్సర్లు.. వంటివి కూడా బరువుపై ప్రతికూల ప్రభావం చూపుతాయంటున్నారు నిపుణులు. ‘ఇన్‌ఫ్లమేటరీ బొవెల్ డిసీజ్‌ (ఐబీడీ)’గా పిలిచే ఈ వ్యాధి కారణంగా బరువు తగ్గే అవకాశం ఉందంటున్నారు.

ఇవి కూడా!

* ఎక్కువ బరువు పెరిగిపోతామేమోనన్న భయంతో తక్కువ ఆహారం తీసుకోవడం (అనొరెక్సియా నెర్వోసా), బులీమియా.. వంటి సమస్యలు బరువు పెరగకుండా చేస్తాయట!

* కీమోథెరపీ వంటి చికిత్సలు తీసుకున్నప్పుడు, యాంటీబయోటిక్స్ వాడినప్పుడు పొట్ట సంబంధిత సమస్యలు తలెత్తి బరువు తగ్గే ప్రమాదం ఉంటుంది.

* మన అనారోగ్యాన్ని బట్టి వాడే కొన్ని మందులు, తీసుకునే చికిత్సల కారణంగా ఒక్కోసారి ఆకలి మందగించడం, వికారం, వాంతులు, విరేచనాలు.. వంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇలాంటి దుష్ప్రభావాలు కూడా మనల్ని బరువు పెరగకుండా/ఉన్న బరువు కంటే మరింత తగ్గేలా చేస్తాయంటున్నారు నిపుణులు.

ఇలా చేసి చూడండి!

వ్యాయామమూ ఓ మార్గమే

ఎంత ప్రయత్నించినా బరువు పెరగకుండా అడ్డుపడుతోన్న ఈ అనారోగ్యాలకు డాక్టర్‌ సలహా మేరకు మందులు వాడడం, చికిత్స తీసుకోవడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. అలాగే బరువు పెరగాలనుకునే వారు కొన్ని నియమాలు పాటిస్తే ఆరోగ్యకరంగా బరువు పెరిగే అవకాశం ఉందంటున్నారు. అవేంటంటే..!

* కొవ్వు పెరగకుండా బరువు పెరగాలంటే కండరాల సామర్థ్యం పెంచుకోవాలంటున్నారు నిపుణులు. ఇందుకోసం కార్డియో, బరువులెత్తడం.. వంటి వ్యాయామాలు చక్కగా పని చేస్తాయట!

* ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోవడం కంటే తక్కువ మొత్తంలో ఎక్కువ సార్లు తీసుకోవడం వల్ల బరువు పెరగచ్చట! ఈ క్రమంలో మూడుగంటలకోసారి ఆహారం తీసుకోవాలంటున్నారు నిపుణులు.

* ఆరోగ్యకరమైన కొవ్వులుండే అవకాడో, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, చేపలు, సోయా పాలు, టోఫు, వాల్‌నట్స్‌.. వంటివి రోజువారీ ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. వీటితో పాటు వెజిటబుల్‌ సలాడ్‌, ప్రొటీన్‌ షేక్స్‌ తీసుకోవడం మరీ మంచిది.

* చాలామంది తక్కువ తినడానికి భోజనానికి ముందు కొన్ని నీళ్లు తాగుతుంటారు. అయితే బరువు పెరగాలనుకునే వారు ఇలా చేయకపోవడమే మంచిది. తద్వారా కడుపు నిండా ఆహారం తీసుకొని బరువు పెరగచ్చు.

* త్వరగా బరువు పెరగాలని కొంతమంది పిజ్జా, బర్గర్‌.. వంటి ఫాస్ట్‌ఫుడ్స్‌ వెంట పరుగు పెడతారు. కానీ అలా పెరిగిన బరువు అనారోగ్యకరమైందని గుర్తుపెట్టుకోండి. తద్వారా అనారోగ్యకరమైన కొవ్వులు శరీరంలోకి చేరి లేనిపోని సమస్యల్ని తెచ్చిపెడతాయి. కాబట్టి ఆరోగ్యకరంగా బరువు పెరగడమే ఉత్తమం.

వీటితో పాటు మరీ అత్యవసరమైతే డాక్టర్‌ సలహా మేరకు సప్లిమెంట్లు కూడా తీసుకోవచ్చు. బరువు పెరగాలనుకునే వారు తీసుకోవాల్సిన పోషకాహారం, అందుకు సంబంధించిన మెనూ కోసం సంబంధిత నిపుణులను సంప్రదించి సలహాలు తీసుకోవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.