పిస్తా మ్యాంగో ఫ్రూట్ కస్టర్డ్
కావాల్సిన పదార్థాలు
* కస్టర్డ్ పౌడర్ - ఒక టీస్పూన్
* పాలు - అర లీటరు
* కండెన్స్‌డ్ మిల్క్- ఒక టేబుల్ స్పూన్
* మామిడి పండు ముక్కలు - అరకప్పు
* దానిమ్మ గింజలు - టేబుల్ స్పూన్
* పిస్తా పప్పులు - టీస్పూన్
తయారీ...
ముందుగా ఒక టేబుల్ స్పూన్ పాలను కస్టర్డ్ పౌడర్‌లో పోసి ఉండలు లేకుండా కలపాలి. ఈ మిశ్రమాన్ని కొద్ది సేపు పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక గిన్నెలో అర లీటరు పాలు తీసుకుని అందులో కండెన్స్‌డ్ మిల్క్ పోసి స్టౌ మీద పెట్టి మీడియం మంటపై బాగా మరిగించాలి. ఆపై కస్టర్డ్ పౌడర్-పాల మిశ్రమాన్ని దీనికి జతచేయాలి. గిన్నెలోని పాలు చిక్కబడేంత వరకు టీస్పూన్‌తో కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఆ తర్వాత స్టౌ కట్టేసి గిన్నెను కిందకు దించాలి. ఈ పాల మిశ్రమం పూర్తిగా చల్లారాక మామిడి పండు ముక్కలు, పిస్తా పప్పులు, దానిమ్మ గింజలు వేసి కలపాలి. ఆపై ఈ మిశ్రమాన్ని ఒక గ్లాసులోకి తీసుకుని దానిపై అవసరమైతే కొన్ని దానిమ్మ గింజలు, పిస్తా పప్పులతో గార్నిష్ చేసుకుంటే రుచికరమైన పిస్తా మ్యాంగో ఫ్రూట్ కస్టర్డ్ రడీ! చూశారుగా.. ఎంత సులభంగా ఈ సమ్మర్ రెసిపీని తయారుచేసుకోవచ్చో..! మరి మీరు కూడా దీనిని ట్రై చేయండి. వేసవి తాపాన్ని అధిగమించండి.!
ఇదీ చదవండి: పంచాయతీ ఎన్నికల బరిలో 'అందాల రాణి'