- దానిమ్మ గింజల్లో అధికమోతాదులో ఫ్లవనాయిడ్లు, పునిసిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి చర్మాన్ని శుభ్రపరచడంలో కీలకంగా పనిచేసి ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ గింజల నుంచి తీసిన నూనెలో చెంచా తేనె కలిపి రోజూ ఉదయాన్నే రాసుకుని పావుగంటపాటు ఇంకనివ్వాలి. ఆపై కడిగేసుకుంటే చాలు. క్రమంగా మార్పు మీకే కనిపిస్తుంది.
- దుమ్ము, ధూళి, కాలుష్యం లాంటి వాటి ప్రభావంతో చర్మంపై మృతకణాలు పేరుకుపోతాయి. ఇలాంటప్పుడు దానిమ్మ రసంలో చెంచా పంచదార, కాస్త నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుని మృదువుగా రుద్దాలి. ఇలా చేస్తే చర్మం నునుపుగా మారి కాంతిమంతంగా కనిపిస్తుంది.
- దానిమ్మ రసం స్కిన్ టోనర్‌గానూ పనిచేస్తుంది. ముఖం కడుక్కున్న తరువాత ఈ రసంలో కొద్దిగా యాపిల్ సిడార్ వెనిగర్ కలిపి రాసుకోవాలి. ఇది చర్మంలోకి ఇంకి మెరుపుని తెచ్చిపెడుతుంది. ముల్తానీ మట్టిని పావుకప్పు దానిమ్మ రసంతో పేస్ట్‌లా చేసుకుని ప్యాక్ వేసుకుంటే చర్మం తాజాగా కనిపిస్తుంది.
ఇదీ చూడండి: కర్ణాటకలో కరోనా కల్లోలం- ఒక్కరోజే 9 వేల కేసులు