ఉరుకుల పరుగుల జీవితాల్లో కొంతమంది స్నానానికీ ఎక్కువ సమయాన్ని కేటాయించలేరు. అలాంటివారికి బాత్‌సాల్టే చక్కని మార్గం. ఎందుకంటే తక్కువ సమయంలోనే స్నానాన్ని ముగించినా ఆ సుగంధాలు రోజంతా అంటిపెట్టుకునే ఉంటాయి.
- నీళ్లలో కాస్త బాత్‌సాల్ట్ కలిపేస్తే పరిశుభ్రత, పరిమళాల స్నానం పూర్తవుతుంది. అంతేకాదు చర్మం నున్నగా మెరుస్తుంది కూడా.
- ఉప్పు ఒంటి నొప్పులను తగ్గిస్తుంది. లావెండర్ సువాసనలు ఆందోళన, ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఈ బాత్‌సాల్ట్‌ను ఇంట్లోనే తయారుచేసి పెట్టుకుంటే ఎప్పుడు కావలిస్తే అప్పుడు హాయిగా వాడుకోవచ్చు.
ఇదీ చూడండి : సంప్రదాయ మార్గంలో ఒత్తిడిని జయిద్దాం