ETV Bharat / lifestyle

SPINACH USES: బచ్చలితో రక్తహీనతకు చెక్ - బచ్చలికూరతో బోలెడు లాభాలు

ఆకుకూరల్లో బచ్చలి కూరకి ప్రత్యేకమమైన స్థానం ఉంది. ఇందులో ఉండే పోషకాల వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే రక్తహీనత సమస్యను కూడా తగ్గిస్తుంది. అంతేకాదండోయ్... ఇంకా చాలా ఉపయోగాలున్నాయి. అవేంటో చూసేద్దామా..!

lots-of-benfits-with-malbar-spinach
రక్తహీనతను తగ్గించే బచ్చలి
author img

By

Published : Jul 17, 2021, 2:56 PM IST

సాధారణంగా మహిళల ప్రధాన సమస్య రక్తహీనత. దీనికి మంచి మందు బచ్చలి. అదే కాదు ఇంకా ప్రయోజనాలున్నాయి... అవేంటో చూడండి!

  • బచ్చలిలో ‘విటమిన్‌-సి’ అధికం. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం లాంటి మినరల్స్‌ అపారం. సెలీనియం, నియాసిన్‌, ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్లూ పుష్కలంగానే దొరుకుతాయి. ఇవి మెదడు, నరాల ఆరోగ్యాన్ని కాపాడతాయి.
  • ఇందులోని ‘విటమిన్‌-ఎ’ కంటి చూపుని మెరుగు పరుస్తుంది. దృష్టి దోషాలు ఉన్నవారు తప్పనిసరిగా బచ్చలి కూర తింటే మేలు. ఈ ఆకు కూరలో ఉండే ల్యూటిన్‌ కంటి చూపునకు దోహదపడి రెటీనాను మెరుగు పరుస్తుంది. అలానే విటమిన్‌కె రక్తం త్వరగా గడ్డకట్టేలా చేస్తుంది.
  • బచ్చలి కూరలో ఐరన్‌ మోతాదూ ఎక్కువే. రక్తహీనతతో బాధపడేవారు క్రమం తప్పక తీసుకుంటే మేలు. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చూస్తుంది కూడా. గర్భిణుల్లో మలబద్ధకం ఏర్పడకుండా చూస్తుంది.

ఇదీ చూడండి: MORINGA: మునగాకుతో ఎన్నో లాభాలో తెలుసా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.