ETV Bharat / lifestyle

Yoga: యాసిడ్ దాడికి గురై.. 53 ఆపరేషన్లయినా యోగా వల్లే కోలుకుంది!

శారీరక, మానసిక సమస్యల్ని నయం చేసే యోగాకు కాలిన గాయాలను మాన్పే శక్తి కూడా ఉందంటోంది బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌. ఆమ్ల దాడికి గురై తీవ్ర గాయాల పాలైన తన అక్క రంగోలీ.. ఆ ప్రమాదం నుంచి బయటపడి తిరిగి మామూలు మనిషిగా మారిందంటే అదంతా యోగా వల్లే అంటోంది. అంతేకాదు.. యోగాను జీవనశైలిలో భాగం చేసుకొని తన తల్లిదండ్రులు కూడా పలు ఆరోగ్య సమస్యల్ని జయించారని చెబుతోంది. ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ సందర్భంగా తన కుటుంబంలోని యోగా స్ఫూర్తిదాయక కథనాల్ని వరుస సోషల్‌ మీడియా పోస్టుల రూపంలో పంచుకుందీ బాలీవుడ్‌ క్వీన్‌. మరి, ఆ విశేషాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

kangana yoga stories
కంగనా యోగా స్టోరీస్​
author img

By

Published : Jun 25, 2021, 2:35 PM IST

కంగనా రనౌత్‌-రంగోలీ చందేల్‌.. వీరిద్దరిదీ అక్కాచెల్లెళ్లకు మించిన అందమైన అనుబంధం. ప్రతి విషయంలోనూ, ప్రతి సందర్భంలోనూ ఒకరికొకరు తోడుగా నిలుస్తూ తమ అభిమానులకు ఆదర్శంగా నిలుస్తుంటారు. కొన్నేళ్ల క్రితం తన అక్క రంగోలీపై యాసిడ్​ దాడి జరిగిన సమయంలోనూ తను అనుక్షణం ఆమె పక్కనే ఉంటూ ధైర్యం నింపిన సంగతి ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే పలు సందర్భాల్లో పంచుకున్న విషయం తెలిసిందే! అయితే రంగోలీ ఆ దాడి నుంచి పూర్తిగా కోలుకోవడానికి యోగా ఎంతగానో సహకరించిందంటూ తాజాగా కంగన ఇన్‌స్టాలో ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టింది. అంతేకాదు.. రంగోలీ యోగా కథ చాలామందికి స్ఫూర్తిదాయకం అంటోంది ఈ బాలీవుడ్​ క్వీన్​.

పెళ్లి రద్దైనా బాధపడలేదు!

ఈ క్రమంలో రంగోలీ యోగాసనాలు వేస్తోన్న ఫొటోలను ఇన్‌స్టాలో పంచుకున్న కంగన.. ‘అప్పుడు మా అక్క రంగోలీకి 21 ఏళ్లుంటాయనుకుంటా.. ఆ సమయంలో ఓ ఆకతాయి ఆమెపై ఆమ్లదాడి చేశాడు. దీంతో ఆమె ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. సగం ముఖం కాలిపోయింది.. ఓ కన్ను చూపు కోల్పోయింది.. చెవి పూర్తిగా కరిగిపోయింది.. ఛాతీ చాలా వరకు డ్యామేజ్‌ అయింది. రెండు మూడేళ్లలోనే దాదాపు 53 సర్జరీలయ్యాయంటే తనపై జరిగిన దాడి తీవ్రతను మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ ప్రమాదంతో తను శారీరకంగానే కాదు.. మానసికంగానూ ఎంతో డిస్టర్బ్‌ అయ్యింది. మాతో మాట్లాడటమే మానేసింది. తన ముందు ఏం జరిగినా అలా చూస్తూ ఉండిపోయేది తప్ప.. మరో మాట మాట్లాడేది కాదు. అప్పటికే ఓ ఐఏఎఫ్‌ అధికారితో అక్క పెళ్లి నిశ్చయమైంది. అయితే ఆమ్లదాడి తర్వాత వాళ్లు వివాహం రద్దు చేసుకున్నా ఆమె ఇసుమంతైనా బాధపడలేదు. ఇలా మానసికంగా చలనం లేని అక్కను చూడలేకపోయా. డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్తే ఆమె షాక్‌లో ఉందని చెప్పారు. మందులిచ్చారు. ఎన్నో థెరపీలు చేశారు. అయినా ఫలితం కనిపించలేదు.

యోగా తనలో మార్పు తెచ్చింది!

అయితే ఆ సమయంలో నేను మా యోగా గురువు వద్ద యోగా నేర్చుకుంటున్నా. మానసిక సమస్యలకు, కాలిన గాయాలకు, రెటీనా ట్రాన్స్‌ప్లాంట్‌ రికవరీ అయ్యే క్రమంలో, కంటి చూపు కోల్పోయిన వారికి.. కూడా యోగ సాధన సహాయపడుతుందని తెలుసుకున్న నేను.. అప్పట్నుంచి ఎక్కడికెళ్లినా అక్కను నాతో పాటే తీసుకెళ్లేదాన్ని. యోగా క్లాసులకు కూడా నాతో వెంటబెట్టుకెళ్లేదాన్ని. అలా క్రమంగా తను కూడా యోగాపై దృష్టి పెట్టింది. వివిధ రకాల ఆసనాలు సాధన చేయడం ప్రారంభించింది. ఎన్ని చికిత్సలకైనా లొంగని అక్క మనసు యోగా వల్ల క్రమంగా మారడం మొదలైంది. దాంతో తనలో కలిగే ప్రతి బాధనూ నాతో పంచుకోవడం ప్రారంభించింది. అప్పటిదాకా షాక్‌లో ఉన్న తను నాతో సరదాగా గడపడం మొదలుపెట్టింది. అంతేకాదు యాసిడ్‌ దాడి వల్ల తను కోల్పోయిన కంటి చూపును సైతం తిరిగి పొందిందంటే అది యోగా వల్లే అని చెప్తా. అందుకే నన్నడిగితే.. అన్ని ప్రశ్నలకు యోగానే సమాధానం. అన్ని అనారోగ్యాలకు యోగానే విరుగుడు! మీరు కూడా మీ జీవితంలో యోగాకు ఒక్క ఛాన్స్‌ ఇచ్చి చూడండి!’ అంటూ తన సోదరి స్ఫూర్తిదాయక స్టోరీని పంచుకుందీ బాలీవుడ్‌ క్వీన్.

అమ్మ ఆ సమస్యల నుంచి కోలుకుంది!

తన అక్క రంగోలీనే కాదు.. తన కుటుంబం పూర్తి ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండడానికీ యోగానే కారణం అంటోందీ బాలీవుడ్‌ బ్యూటీ. ఈ వ్యాయామం వల్లే తన తల్లిదండ్రులు సైతం పలు అనారోగ్యాల నుంచి బయటపడ్డారని చెబుతోంది. ఈ క్రమంలో వారిద్దరూ యోగాసనాలు వేస్తోన్న ఫొటోల్ని పంచుకున్న కంగన.. వాళ్ల యోగా స్టోరీస్‌ని సైతం ఓ సుదీర్ఘ పోస్ట్‌ రూపంలో రాసుకొచ్చింది.

‘కొన్నేళ్ల క్రితం మా అమ్మ మధుమేహం, థైరాయిడ్‌, అధిక కొలెస్ట్రాల్‌ (600).. వంటి పలు అనారోగ్యాలతో బాధపడేది. దీంతో గుండెలో బ్లాక్‌ ఉందని, ఆమెకు ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ చేయాలని డాక్టర్లు చెప్పారు. కానీ అమ్మకు అలా చేయడానికి నా మనసు ఒప్పుకోలేదు. అందుకే అమ్మతో రోజూ యోగా సాధన చేయించా. తను కూడా నాపై పూర్తి నమ్మకం ఉంచింది. ఇక సర్జరీ అవసరం లేకుండానే సమస్య తీరిపోయింది. అంతేకాదు.. అప్పట్నుంచి ఇప్పటిదాకా తనకు ఎలాంటి అనారోగ్యం తలెత్తలేదు. ఇప్పుడు మా ఇంట్లో పూర్తి ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉన్నది ఎవరంటే అది అమ్మే!

నాన్నకూ అలవాటు చేశా

ఇక నాన్నకు కూడా వాకింగ్‌ ఎక్కువగా చేయడం వల్ల కీళ్ల సమస్యలొచ్చాయి. దాంతో తన దృష్టినీ యోగా వైపు మళ్లించా. నాన్న కూడా ఎంతో ఉత్సాహంగా యోగాసనాలు వేయడం ప్రారంభించారు. ఇప్పుడు తను ఏ సమస్యా లేకుండా నడవగలరు. జాగింగ్‌ కూడా చేయగలరు. ఇలా నేను నా కుటుంబానికి యోగాను గొప్ప బహుమతిగా ఇచ్చానని గర్వంగా చెప్పగలను. ఇప్పటికీ నేను ఉదయాన్నే వారిని అడిగే తొలి ప్రశ్న ఏంటంటే. ‘ఈ రోజు యోగా చేశారా?’ అని!’ చెబుతూ తన ఫ్యాన్స్‌ని కూడా కుటుంబంతో సహా యోగా చేయమని కోరుతోంది.

కంగన చెప్పిన యోగా స్టోరీస్‌ చదువుతుంటే మీ జీవితంలో యోగా తెచ్చిన మార్పులు, యోగా సాధనతో వివిధ అనారోగ్యాల్ని దూరం చేసుకున్న అనుభవాలు గుర్తొస్తున్నాయా? అయితే ఆలస్యమెందుకు..? వాటిని మాతో పంచుకోండి.. మీ అనుభవాలు, సలహాలు, సూచనలు.. ఇతరుల్లోనూ స్ఫూర్తి నింపచ్చు..!

ఇదీ చదవండి: ఎస్‌బీఐలో నకిలీ బంగారం కలకలం.. రూ. కోటికి పైగా స్వాహా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.