ETV Bharat / lifestyle

EGGS: గుడ్డు మంచిదేనా? లేక పాడైపోయిందా అనేది గుర్తుపట్టండిలా...

ఉడకబెట్టి కూర చేసినా.. ఆమ్లెట్ వేసినా.. గుడ్డుని ఇష్టంగా తినేవారు చాలామందే ఉంటారు. ఇది ఆరోగ్యానికి కూడా మంచిదే. అందుకే రోజూ ఒక గుడ్డు అయినా తినమని చెబుతుంటారు వైద్యులు. కానీ ఎంతమంది గుడ్డును తాజాగా తింటున్నారు. పాడైన గుడ్లను తినడం వల్ల ఆరోగ్యంగా ఉండటం మాటేమో గానీ... అనారోగ్యం పాలవ్వాల్సి వస్తుంది. అందుకే ముందుగానే గుడ్డు తాజాగా ఉందా? లేదా? అని ఓసారి పరిశీలించడం మంచిది.

EGGS
గుడ్డు పాడైందా?
author img

By

Published : Jul 19, 2021, 3:47 PM IST

రోజూ ఒక్కో గుడ్డు ఏం కొంటాంలే అని ఒకేసారి ఎక్కువ మొత్తంలో గుడ్లను కొనుగోలు చేస్తారు. ఎలాగూ వాటిని ఫ్రిజ్‌లో భద్రపరచడం సహజం. ఫ్రిజ్​లోనే ఉంది కదా అని ఎన్ని రోజుల గుడ్డు అయినా వండేస్తుంటారు. కానీ అలా చేయడం ఆరోగ్యకరం కాదు అంటున్నారు నిపుణులు. కొన్ని సందర్భాల్లో వాటిని ఉడకబెట్టేప్పుడు పగిలిపోయి తెల్లసొన బయటకు వచ్చేయడం, ఉడికిన తర్వాత పిండి మాదిరిగా అయిపోవడం, గుడ్డుకి ఒకవైపు సొట్ట పడినట్లుగా తయారవడం.. వంటివి కనిపిస్తుంటాయి. ఇవన్నీ గుడ్డు పాడైపోయిందనడానికి సూచనలే. గుడ్డును గది ఉష్ణోగ్రత వద్ద ఉంచితే వారం నుంచి పది రోజుల్లోపు దాన్ని ఉపయోగించాలి.

ఫ్రిజ్​లో భద్రపరిచినా..

అదే ఫ్రిజ్‌లో ఉంచినట్లయితే 30 నుంచి 40 రోజుల మధ్యలో ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే మనం ఇంటికి తెచ్చే ముందు అది ఎన్ని రోజులు సాధారణ వాతావరణ పరిస్థితుల మధ్య ఉందనేది కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం. సాధారణంగా గుడ్లను ఫ్రిజ్ డోర్‌లో ఉన్న ఎగ్ ట్రేలో భద్రపరుస్తాం. అయితే ఫ్రిజ్ మొత్తంలో రిఫ్రిజిరేటర్ డోర్ కాస్త వేడిగా ఉంటుందట. పైగా తరచూ డోర్ తెరుస్తూ ఉండటం వల్ల అక్కడ ఉష్ణోగ్రతలు సైతం మారుతూ ఉంటాయి. కాబట్టి వాటిని అక్కడ కాకుండా లోపల భద్రపరచడం మంచిది. అలాగే గుడ్లను వాటిని తీసుకొచ్చిన కార్టన్‌లోనే భద్రపరచాల్సి ఉంటుంది.

నీటిలో వేసి..

గుడ్డు పాడైందో లేదో తెలుసుకోవడానికి దాన్ని నీటిలో వేస్తే సరిపోతుంది. అది మునిగిన విధానాన్ని బట్టి గుడ్డు తాజాగా ఉందో లేదో ఇట్టే పసిగట్టేయచ్చు. గాజు గిన్నెలో నీరు పోసి అందులో గుడ్డునుంచాలి. అది నీటిలో అడ్డంగా మునిగినట్లైతే తాజాగా ఉందని గుర్తించాలి. నీటిలో పూర్తిగా, కాస్త వంచినట్లుగా మునిగితే కోడి ఆ గుడ్డుని పెట్టి వారం రోజులైందని అర్థం. నీటిలో పూర్తిగా మునిగినప్పటికీ నిటారుగా ఉన్నట్త్లెతే.. అప్పటి గుడ్డు వయసు మూడు నుంచి నాలుగు వారాలున్నట్లు లెక్క. అలా కాకుండా నీటిలో తేలుతున్నట్త్లెతే అది బాగా పాత గుడ్డుగా పరిగణించాలి. ఇలా నీటిపై తేలే గుడ్డుని ఆహారంగా తీసుకోకపోవడమే మంచిది. గుడ్డు పెంకుకి చాలా సన్నని రంధ్రాలుంటాయి. వీటి ద్వారా గుడ్డు లోపలికి గాలి ప్రవేశిస్తుంది. గుడ్డు పెట్టినప్పటి నుంచి రోజులు గడిచేకొద్దీ ఇందులో చేరే గాలి ఎక్కువవుతూ వస్తుంది. కాబట్టి తాజాగా ఉన్న గుడ్డు మునుగుతుంది. పాడైన గుడ్డు తేలుతుంది. అలాగే గుడ్డు పెట్టినప్పటి కంటే రోజులు గడిచే కొద్దీ పెంకు తేలికగా తయారవుతుంది. ఇది కూడా గుడ్డు తేలడానికి ఓ కారణమే.

పగలగొట్టి..

పగలగొట్టి..

సమతలంగా ఉన్న పళ్లెంలో గుడ్డును పగలగొట్టి పోయాలి. అప్పుడు పచ్చ సొన బాగా కనిపిస్తుంటే అది తాజాగా ఉన్నట్టే లెక్క. అయితే గుడ్డు ఇలా లేనట్లయితే తినడానికి పనికిరాదని అర్థం కాదు. దాని నుంచి వచ్చే వాసనను బట్టి అది తాజాదో కాదో తెలిసిపోతుంది. తాజా గుడ్డు నుంచి చాలా తక్కువ స్థాయిలో వాసన వస్తుంది. గుడ్డు పాతబడే కొద్ది.. దాని నుంచి వెలువడే వాసన ఎక్కువవుతుంది.

శబ్దం ఆధారంగా..

గుడ్డును చెవి దగ్గర ఉంచి దాన్ని ఒకసారి షేక్ చేయాలి. ఇలా వూపినప్పుడు శబ్దం కాస్త ఎక్కువగా వస్తే.. దాన్ని ఆహారంగా తీసుకోకూడదు. గుడ్డు పెంకు పోరస్‌లా పనిచేస్తూ ఉంటుంది. దీని ద్వారా గుడ్డులోని తేమ బయటకు వెళ్లిపోతుంది. దాని స్థానంలో గాలి వచ్చి చేరుతుంది. గుడ్డు ఎంత పాతదైతే దానిలో అంత గాలి నిండుతుంది. ఫలితంగా అందులోని తెలుపు, పసుపు సొనలు ఎక్కువగా కదలడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శబ్దం ఎక్కువగా వస్తుంది. ఇలా వచ్చినా లేదా లోపల ఎక్కువగా కదులుతున్నట్లనిపించినా ఆ గుడ్డుని ఆహారంగా తీసుకోకూడదు.

ఇదీ చూడండి: రోజూ ఒక గుడ్డు ఎందుకు తినాలంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.