కరోనా వల్ల చాలామంది ఇంటినుంచే పని చేస్తున్నారు. ఈ సమయంలో సరిగ్గా కూర్చోకపోవడం వల్ల అనారోగ్య ముప్పుకి కారణమవుతాయంటున్నారు వైద్యులు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే వీటి నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు..
- గంటకోసారి రెండు నిముషాలు కూర్చున్న చోటు నుంచి లేచి నాలుగడుగులు వేయండి. బాల్కనీలో నిలబడి శరీరాన్ని స్ట్రెచ్ చేయండి.
- భుజాలు వంచి కూలబడినట్టు కూర్చోవడం వల్ల శరీరంలోని భారమంతీ వెన్నెముకపై పడుతుంది. అది దీర్ఘకాలంలో తీవ్ర సమస్యలకు దారితీస్తుంది. నిటారుగా కూర్చోవడానికి ప్రతిక్షణం సాధన చేయండి. అదే అలవాటవుతుంది.
- మీ కంప్యూటర్ని మరీ దగ్గరగా, మరీ దూరంగా కాకుండా ఉంచుకుని పనిచేయండి. అంతకన్నా దగ్గరగా.. అదీ ఎనిమిది గంటలపాటు చూస్తూ పనిచేయడం మీ కళ్ల ఆరోగ్యానికి మంచిదికాదు రెండు గంటలకోసారైనా కనీసం రెండు నిముషాలు కళ్లు మూసుకోండి. పనిలో కాస్త విరామం అవసరమని గుర్తుంచుకోండి
- ఇంట్లోంచే పని చేస్తున్నాం కదా! అని ఎప్పుడుపడితో అప్పుడు తినడం మంచిది కాదు. ఆఫీసులోలానే సమయాన్ని పాటించండి. మీరు తాగే కాఫీ, టీలకు బదులు నీళ్లు తాగితే శరీంలోని వ్యర్థాలు బయటపడతాయి.
ఇదీ చదవండిః మీ ఇంటిని ఇలా శుభ్రపరిస్తే అలెర్జీలు దరిచేరవు!