ETV Bharat / lifestyle

డిప్రెషన్‌లో ఉన్నారేమో ఈ లక్షణాలు గమనించండి!

author img

By

Published : Jun 26, 2020, 1:45 PM IST

డిప్రెషన్.. ఎంతటివారినైనా కుంగదీస్తుందనడానికి ఇటీవల బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ ఘటనే ఉదాహరణ. చాలా చలాకీగా ఉండే సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడంటే అసలు నమ్మేలా కనిపించదు. కానీ ఆరు నెలలుగా ఆయన డిప్రెషన్‌లో ఉన్నట్లు ఎవరైనా గుర్తించారా? ప్రేమ, ఆర్థిక పరిస్థితి, కుటుంబ కలహాలు, వృత్తి ఇలా ఏ విషయంలోనైనా కష్టాలు వచ్చినప్పుడు కొంత మంది భరించలేరు. వాటి నుంచి బయటకు రాలేక లోలోపల బాధపడుతూ డిప్రెషన్‌కు గురవుతుంటారు. అలాంటి వారిని గుర్తించడం కష్టమే కానీ.. డిప్రెషన్‌లోకి వెళ్తున్నారనడానికి కొన్ని లక్షణాలు ప్రామాణికంగా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో మీరే చదవండి..

డిప్రెషన్‌లో ఉన్నారేమో ఈ లక్షణాలు గమనించండి!
డిప్రెషన్‌లో ఉన్నారేమో ఈ లక్షణాలు గమనించండి!

ఆకస్మిక మార్పు గమనించారా?

మీ ప్రియమైన వ్యక్తుల గురించి, వారి దినచర్య గురించి మీకు బాగా తెలుసు. ఎప్పుడు వారికి కోపం వస్తుంది? ఎప్పుడెలా ప్రవర్తిస్తారో అన్ని విషయాలు తెలుసు అనుకుందాం. కానీ, వారిలో అకస్మాత్తుగా మార్పులు రావడం.. కాస్త విభిన్నంగా ప్రవర్తించడం.. వారి భావోద్వేగాల్లో మార్పులు గమనిస్తే.. జాగ్రత్త వహించండి. వారిని డిప్రెషన్‌లోకి వెళ్లకుండా చూడండి.

మాట్లాడటం మానేస్తున్నారా?

డిప్రెషన్‌లో ఉన్నవాళ్లు ఎదుటివాళ్లతో మాట్లాడటానికి పెద్దగా ఇష్టపడరు. ఏదైనా ప్రశ్నించినా.. పలకరించినా నామమాత్రంగా సమాధానం చెప్పేసి తప్పించుకుంటారు. అలాంటప్పుడు వారికి ఏదో మూడ్‌ బాగోలేదేమో అని ఊరుకోవద్దు. వారిని ఓ కంట కనిపెట్టండి. కొంత మంది బాగా మాట్లాడుతున్నా.. మనసులో చాలా మథన పడుతుంటారు. వారిని గుర్తించడం మహా కష్టం.

నిద్రపట్టట్లేదని ఫిర్యాదులా?

నిద్ర పట్టకపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు. అయితే.. ఎవరైనా నిద్ర పట్టట్లేదని పదే పదే చెబుతున్నారా? ఎంత నచ్చజెప్పినా, శాంత పర్చినా నిద్రపోవట్లేదా? పడుకున్న వెంటనే నిద్ర లేస్తున్నారా? నిద్రాభంగం ఎక్కువగా ఉంటే డిప్రెషన్‌లో ఉన్నట్టే. అలాంటి వారికి తగిన కౌన్సెలింగ్‌ ఇప్పించి సాధారణ స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి.

సరిగా తినట్లేదా?

అసలు తినకపోయినా.. ఎక్కువగా తినేస్తున్నా.. ఆందోళనలో ఉన్నట్లు అర్థం. అది డిప్రెషన్‌గా మారి తినే అలవాటులో మార్పులు తీసుకొస్తుంది. మీ ప్రియమైన వ్యక్తుల్లో తినే విధానంలో మార్పు గమనిస్తే.. వారిపై శ్రద్ధ వహించండి.

ఎక్కువగా చిరాకు పడుతున్నారా?

మీకు తెలిసిన వారు చేసే చర్యల్లో ఆవేశం ఎక్కువగా కనిపించినా.. ప్రతి చిన్న విషయానికి చిరాకు పడుతున్నా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరముంది. తరుచూ కనిపించే లక్షణమే అయినా.. కొందరు చిన్న చిన్న సమస్యలను సైతం తీవ్రంగా ఆలోచిస్తుంటారు. ఈ క్రమంలో ప్రతి దానికి చిరాకు పడుతుంటారు.

ప్రతికూలంగా ఆలోచిస్తున్నారా?

ఎవరైనా ఎక్కువగా ప్రతికూల ఆలోచనలతో సతమతమవుతుంటే వారు తొందరగా డిప్రెషన్‌లోకి వెళ్లే అవకాశముంది. మీకు ప్రియమైన వ్యక్తులు ప్రతి విషయాన్ని ప్రతికూలంగా ఆలోచిస్తున్నట్లయితే వారి ఏకాగ్రతను మంచి విషయాలపైకి మరల్చండి. అలాంటి ఆలోచనల నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. అదీ కుదరకపోతే.. కౌన్సెలింగ్‌ ఇప్పించి మామూలు స్థితికి తీసుకురావొచ్చు.

ఆత్మవిశ్వాసం కోల్పోయినట్టుగా ఉన్నారా?

డిప్రెషన్‌లో ఉన్నవాళ్లలో వారిపై వారికి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. నమ్మకం కోల్పోతారు. ఆశావాదం ఉండదు. ఆత్మనూన్యతతో బాధపడుతుంటారు. అలాంటి వారికి ధైర్యం చెప్పి ఆత్మవిశ్వాసం కలిగేలా చేయాలి. తద్వారా డిప్రెషన్‌ నుంచి బయట పడే అవకాశముంది.

ఇవీచూడండి: ప్రతిఇంటికీ ఆరు మొక్కలు... వాటికి కుటుంబ సభ్యుల పేర్లు: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.