ETV Bharat / lifestyle

కరోనా భయం.. ఫోన్‌ చేస్తే అభయం - కొవిడ్ ప్రభావంతో మానసిక రుగ్మతలు

కొవిడ్‌ ప్రభావంతో మానసిక రుగ్మతలు తీవ్రమవుతున్నాయి. తమకు కొవిడ్‌ సోకుతుందేమో.. ఆరోగ్యం దెబ్బతింటుందేమోననే భయాందోళనలు వెన్నాడుతున్నాయి. అయినవారు కళ్ల ముందే కన్నుమూస్తుంటే కనీస సాయం చేయలేకపోతున్నామని, కడసారి చూపు కూడా అందకుండా పోతోందనే క్షోభతో నలిగిపోతున్నారు. అలాంటి వారికోసమే టెలీ కౌన్సెలింగ్​ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

corona-effect-on-mental-condition
కరోనా భయం.. ఫోన్‌ చేస్తే అభయం
author img

By

Published : May 19, 2021, 7:57 AM IST

కొవిడ్‌-19 వైరస్‌ మొదటి దశతో పోల్చితే రెండో దశ ప్రతి ఒక్కరిలో తెలియని భయాన్ని మోసుకొచ్చింది. కుటుంబాలకు కుటుంబాలు మహమ్మారి బారిన పడి మృత్యువాత పడుతుండగా.. మరికొన్ని ఘటనలు మనోవేదనకు గురిచేస్తున్నాయి. ఆరోగ్య పరంగానే కాకుండా ఉద్యోగాలు కోల్పోవడం, ఆర్థికంగా ఇబ్బందులు, విద్యాసంస్థలు మూతపడి పిల్లల్లో మానసిక సమస్యలు తలెత్తడం చోటుచేసుకుంటున్నాయి. ఈ తరుణంలోనే ప్రజల మదిలో మెదిలే భయాలు, సందేహాలను నివృత్తి చేయడానికి ఆరు ప్రముఖ సంస్థలు ఉమ్మడిగా కృషి చేస్తున్నాయి.

అసోసియేషన్‌ ఆఫ్‌ హెల్త్‌ సైకాలజిస్టులు, యునిసెఫ్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌-పాఠశాల అభివృద్ధి కార్యక్రమం, యాక్షన్‌ ఎయిడ్‌ అసోసియేషన్‌ ఇండియా, ఏపీటీఎస్‌ సోషల్‌ సర్వీస్‌ ఫోరం, ఆశా ఆసుపత్రి ఆధ్వర్యంలో సోషల్‌ అండ్‌ ఎమోషనల్‌ రిహాబిలిటేషన్‌ ఆఫ్‌ వైరస్‌ విక్టిమ్స్‌ అండ్‌ మెడికల్‌ సర్వీసెస్‌(సెర్వ్‌-మి) పేరుతో టెలీ కౌన్సెలింగ్‌, టెలీ మెడిసిన్‌ సేవలు అందిస్తున్నాయి. దీనికి అసోసియేషన్‌ ఆఫ్‌ హెల్త్‌ సైకాలజిస్టు అధ్యక్షురాలు, హెచ్‌సీయూ ఆచార్యురాలు ప్రొఫెసర్‌ మీనాహరిహరన్‌ నేతృత్వం వహిస్తున్నారు.

ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు 20 మంది సీనియర్‌ సైకాలజిస్టులు అందుబాటులో ఉంటూ ప్రజలకు సలహాలు, సూచనలు అందిస్తున్నారు. స్వల్ప, లక్షణాలు లేని స్థితిలో ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్న బాధితులకు టెలీ మెడిసిన్‌ సేవలు అందించడానికి సెర్వ్‌-మి నలుగురు సీనియర్‌ వైద్యులను అందుబాటులో ఉంచింది.

హెచ్‌సీయూ ఆచార్యురాలు

ఏయే భాషల్లో..

తెలుగు, ఆంగ్లం, హిందీ, తమిళం, ఒరియా, కన్నడ, బెంగాలీ, మిజో

సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్లు

మానసిక సమస్యలపై కౌన్సెలింగ్‌కు: 04048214775

టెలీ మెడిసిన్‌ సేవలకు 04048213272

ఇదీ చూడండి: అమ్మలా ఆదరిస్తున్నారు.. అన్నార్తుల ఆకలి తీరుస్తున్నారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.