ఇంట్లో, ఇరుగుపొరుగో, తెలిసిన వాళ్లకో కరోనా సోకిందన్న సమాచారం. ఆసుపత్రుల్లో అందుబాటులో లేని పడకలు, ఆక్సిజన్ అందక ప్రాణాలు విడుస్తున్న బాధితులు.... ఇలా ఎన్నో ఆందోళన కలిగించే వార్తలు. పైగా ఎప్పుడు వైరస్ బారినపడతామో అనే భయంతో చాలా మందిలో మానసిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి వాళ్లకు ధైర్యం కలిగిస్తోంది... సీ-19 టాస్క్‌ఫోర్స్. వైద్యులు, మానసిక నిపుణులు, వివిధ రంగాల నిపుణులతో కూడిన ఈ సేవా సంస్థ... ఔషధాల వినియోగం, కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వచ్చిన తర్వాత అనుసరించాల్సిన విధానాలపై ప్రజలకు... కాల్ సెంటర్ ద్వారా ఉచితంగా సలహాలు, సూచనలు అందిస్తోంది. తమ సలహా ఓ ప్రాణాన్ని నిలబెట్టినా... తమ కష్టాన్ని ఫలితం దక్కినట్టే అంటున్న సీ-19 టాస్క్‌ఫోర్స్ వ్యవస్థాపకుడు... యన్నంశెట్టి అఖిల్‌తో మా ప్రతినిధి రవిచంద్ర ముఖాముఖి.
ఇదీ చూడండి: 'కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా'