ETV Bharat / lifestyle

రోగనిరోధక శక్తికే కాదు.. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అంజీరా

కరోనా కాలంలో శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు డ్రైఫ్రూట్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటిల్లో అంజీరా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఏ,సి, కె విటమిన్, పొటాషియం, మ్యాంగనీస్, జింక్, కాపర్, ఐరన్ వంటి ఖనిజాలు దీనిలో పుష్కలంగా లభిస్తాయి. ఈ పండు తింటే మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

health solutions with anjeera fruit
రోగనిరోధక శక్తికే కాదు.. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అంజీరా
author img

By

Published : Sep 17, 2020, 1:53 PM IST

బరువు తగ్గేందుకు

బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే అంజీర తినండి. దీనిలో పీచు అధికంగా ఉంటుంది. కెలొరీలు తక్కువగా లభిస్తాయి అందుకే రోజూ అల్పాహారం తిన్న తరువాత కనీసం రెండు మూడు అంజీరా పండ్లయినా తిని చూడండి. క్రమేపీ బరువు తగ్గుతారు. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

రక్తపోటు అదుపులో

రక్తహీనతతో బాధపడేవారు. అంజీరాను రోజూ తింటే.. ఈ సమస్యను సులువుగా అధిగమించొచ్చు. దీనిలో ఎక్కువగా ఉండే పొటాషియం వల్ల రక్తపోటు తగ్గడమే కాక సోడియం ద్వారా వచ్చే దుష్ప్రభావాలు తగ్గుతాయి. ఫలితంగా గుండె, మూత్రపిండాల సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

ఎముకలు దృఢంగా

అంజీరా నుంచి క్యాల్షియం అధిక మోతాదులో లభి స్తుంది. అవయవాలన్నీ చురుగ్గా పనిచేయాలంటే క్యాల్షియం ఎంతో కీలకం. దీన్ని ఏ రూపంలో తీసుకున్నా మంచిదే. ఎముకలు దృఢంగా మారతాయి. భవిష్యత్తులో ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

ఇదీ చూడండి: 70వ వసంతంలోకి అడుగుపెట్టిన ప్రధాని మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.