- రెండు టేబుల్‌స్పూన్ల తామరపూల పొడిలో టేబుల్‌స్పూన్ పాలు కలపాలి. దీన్ని ముఖం, మెడకు పట్టించి పావుగంట పాటు ఆరనివ్వాలి. తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేయడం వల్ల ముఖం మృదువుగా మారడమే కాకుండా చక్కగా మెరిసిపోతుంది కూడా.
జుట్టు సంరక్షణకు:
- జుట్టు పొడిబారిపోకుండా ఉండటానికి, వెంట్రుకలు పెరగడానికి తామర పూల పొడి ఎంతో ఉపయోగపడుతుంది. దీని కోసం ఏం చేయాలంటే... తామర పూలపొడి, ఉసిరిపొడి, గుంటగలగర ఆకు పొడిని రెండు టేబుల్‌స్పూన్ల చొప్పున తీసుకుని నీళ్లతో కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకూ పట్టించాలి. అరగంట తరువాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. వారానికోసారి ఇలా చేయడం వల్ల చుండ్రు దరిచేరదు. జుట్టు ఊడటమూ తగ్గుతుంది.
ఇదీ చదవండిః 'గోధుమ పిండి'తో అందంగా మారిపోదామిలా