ETV Bharat / lifestyle

ఆరు నిమిషాల్లో అందంగా మారిపోవచ్చిలా...!

పండుగ అంటే కొత్తదుస్తులు, పిండివంటలు మాత్రమే కాదు. ముచ్చటగొలిపే ముస్తాబు కూడా. అలాగని గంటలతరబడి మేకప్‌ అవడానికి సమయం ఉండదు. ఈ చిట్కాలు పాటిస్తే, ఆరు నిమిషాల్లో అందంగా మారిపోవచ్చు.

Tips to turn beautiful in six minutes
ఆరు నిమిషాల్లో అందంగా మారిపోవచ్చిలా...!
author img

By

Published : Oct 25, 2020, 3:03 PM IST

మేకప్‌ వేసుకునే ముందు ముఖాన్ని చన్నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ముందుగా ఇలా చేస్తే మేకప్‌ వేసిన తరువాత ఎక్కువసేపు అది తాజాగా ఉంటుంది. అలాగే కొంచెం మాయిశ్చరైజర్‌ వేసుకుని ముఖానికి మృదువుగా పూయాలి. ఇది పూర్తిగా చర్మంలో ఇంకాక మేకప్‌ మొదలుపెట్టాలి. మొదట ఫౌండేషన్‌ను ఫేస్‌ బ్రష్‌పై వేసి ముఖానికి, మెడ భాగానికి అప్లై చేయాలి.

చెంపలు, ముక్కు, గడ్డం, నుదిటిమీదంతా బ్రష్‌ సాయంతో ఈ ఫౌండేషన్‌ను సమానంగా చేసుకోవాలి. ఆ తరువాత మీకు సరిపోయే ముదురురంగు కన్సీలర్‌ను చిన్నబ్రష్‌పైన తీసుకుని నుదురుపైనా, అలాగే ముక్కుకు ఇరువైపులా సన్ననిగీతల్లా రాయాలి. ఈ గీతలను చిన్న స్పాంజితో అద్దితే కన్సీలర్‌ చర్మంలో పూర్తిగా కలిసిపోతుంది. ఈసారి లేతవర్ణం కన్సీలర్‌ను తీసుకుని చిన్న బ్రష్‌తో రెండు కను రెప్పలమీద, కళ్లకింద వేసి, దాన్ని చిన్నస్పాంజితో ముఖచర్మంలో కలిసిపోయేలా మృదువుగా అద్దాలి. దీనిపై లేతవర్ణం ఫినిషింగ్‌ పౌడర్‌ను బ్రష్‌తో రాస్తే చాలు. కంటి చుట్టూ ఉండే నల్లని వలయాలు మాయమవ్వడమే కాదు, కనులు విశాలంగానూ కనిపిస్తాయి. ఇప్పుడు ఐబ్రో పెన్సిల్‌తో కనుబొమలను తీర్చిదిద్దుకోవాలి. పెన్సిల్‌బ్రష్‌తో కాటుక పెట్టుకుని, మస్కారాతో కనురెప్పలను ఒత్తుగా కనిపించేలా చేసుకుంటే చాలు. అలాగే పెదాలకు ముందుగా లిప్‌బామ్‌ను రాసి, ఆ తరువాతే లిప్‌స్టిక్‌ వేసుకుంటే మేకప్‌ పూర్తయినట్లే.

ఇదీ చదవండిః రోజూ 'గ్రీన్​ టీ' తాగితే బరువు తగ్గుతారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.