పచ్చిపాలతో...
చెంచా అతిమధురం పొడిలో కాసిన్ని పచ్చిపాలను కలిపి బాగా మిక్స్ చేయాలి. దీన్ని ముఖానికి పూత వేసుకునే ముందు తప్పనిసరిగా చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి. తర్వాత ప్యాక్‌ను పావుగంట ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో కడిగితే చాలు. మోము తాజాగా మెరుస్తుంది. దీన్ని రోజూ వేసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
నిమ్మరసాన్ని చేర్చి...
చెంచా అతి మధురం పొడిలో మూడు చెంచాల నిమ్మరసం, చెంచా తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పది నిమిషాలు ఆరనివ్వాలి. పొడి చర్మం ఉన్నవారు తడిపొడిగా ఉన్నప్పుడే నీటితో శుభ్రం చేసుకుంటే మంచిది. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చేస్తే ఫేస్‌మాస్క్ క్లెన్సింగ్‌లా పనిచేసి, మురికినీ, మృతకణాలను తొలగిస్తుంది. ముఖాన్ని మృదువుగా మారుస్తుంది. ఇందులోని సుగుణాలు యాక్నే, మొటిమలు వాటి తాలూకు మచ్చల్ని తగ్గిస్తాయి.
ముల్తానీ మట్టితో...
మూడు చెంచాల ముల్తానీ మట్టిలో కొద్దిగా అతి మధురం పొడిని వేసి గులాబీ నీటితో పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి లేపనంలా రాసి పావుగంట ఆరనివ్వాలి. ఆపై చన్నీటితో శుభ్రం చేసుకుంటే చాలు. చర్మం కాంతిమంతంగా కనిపిస్తుంది.
కళ్లను రక్షించుకోండిలా...
- నాణ్యమైన సౌందర్య ఉత్పత్తులనే వాడాలి.
- కంటినిండా నిద్రపోవాలి. తగినన్ని నీళ్లు తాగాలి. విటమిన్-కె ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
- కంటికింద నూనెగ్రంథులేవీ ఉండవు. పైగా ఆ ప్రాంతం చాలా సున్నితం కాబట్టి మేకప్ తీసేటప్పుడు అక్కడ గట్టిగా రుద్దకూడదు.
- రోజులో అయిదారు సార్లు కంటికి చిన్నపాటి మసాజ్ చేసుకోవాలి.
తగ్గించుకునేందుకు చిట్కాలు...
- రోజూ రాత్రి నిద్రపోయే ముందు కొబ్బరి/ ఆముదం/ బాదం నూనెతో కంటి కింద మృదువుగా మర్దనా చేసుకోవాలి.
- చర్మ తత్వానికి సరిపోయే నైట్ ఐ క్రీమ్‌ను రాసుకోవాలి.
- అరటిపండు తొక్కతో కంటికింద మృదువుగా రాయడం వల్ల అక్కడి నలుపుదనం తగ్గుతుంది.
- నిద్రపోయే ముందు కొద్దిగా నెయ్యిని కళ్లకింద మృదువుగా రాస్తే సరి.
కళ్లను కాపాడుకునే ఆహారం..
- చిక్కుళ్లు, బీన్స్, ధాన్యాలు ప్రతిరోజు తీసుకోవడం వల్ల రెటీనా ఆరోగ్యంగా ఉంది. ఇందులో ఉండే బయోఫ్లావనాయిడ్స్, జింగ్ మీ రెటీనాను కాపాడతాయి. కంటిశుక్లం అభివృద్ధి చెందే ప్రమాదాన్ని, కంటి కింద వచ్చే నల్ల మచ్చలను తగ్గిస్తాయి.
- బాదం, పిస్తా వంటి వాటిల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్-ఇ ఉంటాయి. పోషకాలతోపాటు విటమిన్-ఇ తీసుకోవడం వల్ల ఏజ్ రిలేటెడ్ మాక్యులర్ డీజనరేషన్ (AMD) సమస్య తగ్గుతుందని పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి.
- పిల్లలకు బాల్యం నుంచే ఆకు కూరలు తినడం అలవాటు చేయాలి. అప్పుడే వారి కళ్లు ఆరోగ్యకరంగా ఉంటాయి. బచ్చలి, కాలే, కొల్లార్డ్ గ్రీన్స్ వంటి ఆకు కూరల్లో విటమిన్-సి, ఇ అధికం. మొక్కల్లాంటి ఆకు కూరల్లో విటమిన్-ఎ శాతం ఎక్కువ. కాబట్టి.. మీరు తీసుకొనే ఆహారంలో ఆకు కూరలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి.
ఇదీ చూడండి: BEAUTY TIPS: చిటపట చినుకుల మధ్య మెరిసే చర్మం..