మిస్ యూనివర్స్ సింగపూర్ -2021 టైటిల్ దక్కించుకున్న బాన్న నందిత స్వస్ధలం శ్రీకాకుళం. తండ్రి బాన్న గోవర్ధనరావు, తల్లి ఫణి మాధురి. వీరు 25 ఏళ్ల క్రితమే సింగపూర్ వెళ్ళి అక్కడే స్ధిరపడ్డారు. తండ్రి గోవర్ధనరావు సింగపూర్‌లోని ఏవియేషన్ సప్లయ్ చెయిన్ సీనియర్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి మాధురి సివిల్ ఇంజినీర్ బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలర్ గా పని చేస్తున్నారు. సోదరుడు హర్ష సౌరవ్... కెనడా వాంకోవర్‌లోని యూనివర్సిటీ అఫ్ బ్రిటిష్ కొలంబియాలో బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అభ్యసిస్తున్నారు.
![telugu girl nanditha won miss universe singapore title 2021](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-vsp-01-18-miss-universe-singapore-telugu-girl-pkg-more-3031531_18092021005131_1809f_1631906491_636.jpg)
వివిధ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనే నందిత... సింగపూర్‌లో ప్రతిష్టాత్మకమైన రాఫెల్ ఇన్స్టిట్యూట్లో పాఠశాల విద్య, మాధ్యమిక విద్యను పూర్తి చేసి, ప్రస్తుతం మేనేజ్మెంట్, కంప్యూటర్స్‌లో డ్యూయెల్ డిగ్రీ చదువుతున్నారు.
![telugu girl nanditha won miss universe singapore title 2021](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-vsp-01-18-miss-universe-singapore-telugu-girl-pkg-more-3031531_18092021005131_1809f_1631906491_898.jpg)
![telugu girl nanditha won miss universe singapore title 2021](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-vsp-01-18-miss-universe-singapore-telugu-girl-pkg-more-3031531_18092021005131_1809f_1631906491_267.jpg)
మిస్ యూనివర్స్ సింగపూర్ -2021 గా కిరీటాన్ని దక్కించుకోవడం ఎంతో అనందంగా ఉందని, డిసెంబర్లో ఇజ్రాయిల్‌లో జరిగే మిస్ యూనివర్స్ పోటీలకూ హాజరవుతానని నందిత తెలిపారు. చదువులో అగ్రస్ధానంలో ఉంటూనే, ఇష్టమైన రంగంలోనూ సాధన చేస్తూ... టైటిల్ గెలవడంపై తల్లిదండ్రులు గోవర్దన్, మాధురిలు అనందం వ్యక్తం చేస్తున్నారు.