ETV Bharat / lifestyle

నా చర్మం అందుకే మెరుస్తోంది!

అందమంటే మనం వేసుకునే ఫేస్‌ప్యాక్స్‌, వాడే బ్యూటీ ఉత్పత్తుల్లోనే కాదు.. రోజువారీ తీసుకునే ఆహార పదార్థాల్లోనూ ఉందంటోంది బాలీవుడ్‌ ఫ్యాషనిస్టా సోనమ్‌ కపూర్‌. అందం, ఆరోగ్యం, ఫ్యాషన్‌.. తదితర విషయాల్లో తాను పాటించే చిట్కాల్ని సోషల్‌ మీడియా ద్వారా తన ఫ్యాన్స్‌తో ఎప్పటికప్పుడు పంచుకునే ఈ సొగసరి.. ‘వ్యానిటీ విన్యెట్స్‌’ పేరుతో ఓ బ్యూటీ సిరీస్‌ని నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే! ఇందులో భాగంగానే తన సౌందర్య రహస్యాలు, జుట్టు సంరక్షణ కోసం తాను పాటిస్తోన్న చిట్కాలు.. వంటివన్నీ వీడియోల రూపంలో మన ముందుకు తెచ్చింది సోనమ్‌. తాజాగా ఇదే సిరీస్‌ వేదికగా తన మేని మెరుపుకి కారణమైన మూడు చిట్కాలను మరో వీడియో రూపంలో పంచుకుందీ కపూర్‌ బ్యూటీ. మరి, అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

 sonam kapoor
sonam kapoor
author img

By

Published : Apr 23, 2021, 4:03 PM IST

తనదైన ఫ్యాషన్‌ సెన్స్‌తో అభిమానుల్ని ఆకట్టుకునే సోనమ్‌.. అందం, ఆరోగ్యానికి సంబంధించి సోషల్‌ మీడియాలో వరుస పోస్టులు పెడుతూ తన ఫ్యాన్స్‌లో అవగాహన పెంచుతోంది. ఈ క్రమంలోనే గతంలో తన పీసీఓఎస్‌ అనుభవాలను బయటపెడుతూ మహిళలందరిలో స్ఫూర్తి నింపిన ఈ క్యూటీ.. ప్రస్తుతం ‘వ్యానిటీ విన్యెట్స్‌’ పేరుతో ఓ బ్యూటీ సిరీస్‌ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే తన స్కిన్‌ కేర్‌, లిప్‌ కేర్‌, హెయిర్ కేర్‌కు సంబంధించిన పలు చిట్కాలను వీడియోల రూపంలో పంచుకున్న ఈ సొగసరి.. తాజాగా తన మేని మెరుపుకి కారణమైన మూడు పదార్థాల గురించి ఇలా చెప్పుకొచ్చింది.

బిగుతైన చర్మానికి.. నీళ్లు!

చర్మ ఆరోగ్యానికి నీటిని మించిన ఔషధం లేదు. డీహైడ్రేషన్‌ వల్ల చర్మానికి, ఆరోగ్యానికి ఎంతో నష్టం జరుగుతుంది. అలా జరగకూడదంటే నీళ్లు తాగడం ఒక్కటే పరిష్కారం. నీళ్లు తాగడం వల్ల శరీరంలోని మలినాలు, విషపదార్థాలన్నీ బయటికి వెళ్లిపోతాయి. ఇది ఆరోగ్యానికే కాదు.. చర్మానికీ మంచిదే! అలాగే మొటిమలు, దురద.. వంటి చర్మ సమస్యలు రాకుండా ఉండడంతో పాటు చర్మాన్ని బిగుతుగా మార్చడంలోనూ నీరు పరమౌషధం. నేనైతే రోజుకు కనీసం నాలుగు బాటిళ్ల నీళ్లు తాగుతా. దీంతో పాటు నీటి శాతం అధికంగా ఉండే పండ్లు-కాయగూరలు కలిపి తయారుచేసిన సలాడ్‌ని తీసుకుంటా.

sonamkapoorhealthy650-2.jpg
‘ఒమేగా’తో నిత్య యవ్వనంగా!

‘ఒమేగా’తో నిత్య యవ్వనంగా!

చర్మం ఎప్పుడూ యవ్వనంగా ఉండాలంటే ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు తప్పనిసరిగా తీసుకోవాల్సిందే! మాంసాహారులు చేపల ద్వారా; శాకాహారులు నట్స్‌, గింజల ద్వారా ఈ పోషకాన్ని పొందచ్చు. వీటితో పాటు ఆలివ్‌ నూనె, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌.. వంటి వాటిని వంటల్లో వాడినా చక్కటి ఫలితం ఉంటుంది. ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని కొన్ని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. సూర్యరశ్మి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల ప్రభావం వల్ల చర్మంపై ట్యాన్‌ ఏర్పడకుండా ఈ పోషకం అడ్డుకుంటుంది. చర్మానికి తేమ అందించడంతో పాటు చిన్న వయసులో వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా చేస్తుందీ న్యూట్రియంట్.

sonamkapoorhealthy650-1.jpg

మెరుపుకి ‘ఫైబర్’!

మెరుపుకి ‘ఫైబర్’!

చర్మ కణాలకు సరిపడా రక్తం, ఆక్సిజన్‌ అందినప్పుడే అవి ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా చర్మం లోలోపలి నుంచి మెరిసినప్పుడే ఆ మెరుపు బయటికి కనిపిస్తుంది. అందుకు ఫైబర్‌ చక్కగా ఉపయోగపడుతుంది. ఈ క్రమంలో ఫైబర్‌ అధికంగా లభించే కాయగూరలు, పండ్లు (చక్కెర స్థాయులు, గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉండేవి) తీసుకోవాల్సి ఉంటుంది. పియర్స్‌, అవకాడో, స్ట్రాబెర్రీ, యాపిల్స్‌, అవిసె గింజలు, బీన్స్‌, క్యారట్స్‌, బ్రకలీ.. వంటి వాటిలో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల చర్మం నవయవ్వనంగా మారుతుంది.. మెరుపును సంతరించుకుంటుంది.

మేని మెరుపు కోసం సోనమ్‌ పాటిస్తోన్న ఈ సింపుల్‌ టిప్స్‌ గురించి తెలుసుకున్నారుగా! మరి, మీ చర్మ ఆరోగ్యం కోసం మీరు ఎలాంటి చిట్కాలు పాటిస్తున్నారు? ఏయే పదార్థాల్ని మీ మెనూలో చేర్చుకుంటున్నారు? కింది కామెంట్‌ బాక్స్‌ ద్వారా అందరితో పంచుకోండి.. మీరు చెప్పే చిట్కాలు మరికొంతమంది అమ్మాయిలకు ఉపయోగపడచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.