ETV Bharat / lifestyle

CHANDBALI ORNAMENTS: చూడచక్కని చాంద్​బాలీ.. మగువల మనసు దోచుకుంది.!

మొన్న కాసుల పేరు... నిన్న బొట్టు మాల... నేడు చందమామ... వేటి అందం వాటిదే... అవునండీ... కంచి, బెనారస్‌, ఉప్పాడ... ఇలా రకరకాల చీరలు కట్టుకున్నట్లే నగల్లోనూ విభిన్న డిజైన్లు కోరుకుంటుందీ తరం. అందులో భాగంగానే ఆభరణాల పెట్టెలో సరికొత్తగా మెరుస్తున్నవే చాంద్‌బాలీ నగలు.. యువతుల మనసు దోచుకున్న అందాల చందమామలు!

CHANDBALI ORNAMENTS
చాంద్​బాలీ డిజైన్లు
author img

By

Published : Aug 29, 2021, 7:38 PM IST

ఆకాశంలో విరిసిన నిండు జాబిలినీ, చంద్రవంకనీ ఎంతసేపు చూసినా తనివితీరదు. ఆ అందం నగల డిజైనర్లకు మరీ మరీ నచ్చేసినట్లుంది... తల తిప్పినా నవ్వినా మాట్లాడినా ఉయ్యాలజంపాలలూగే జుంకీల్లోకి ఆ చందమామను తెచ్చేశారు. అది మగువల మనసునీ దోచేసుకుంది. ఎందుకంటే సంప్రదాయ చుడీదార్‌, లంగావోణీ, గాగ్రా, చీర... ఇలా దేనిమీదకైనా చెవులకి చాంద్‌బాలీ లోలాకులు పెడితే చాలు, మెడలో నగలు లేకున్నా అమ్మాయి ముఖం చందమామను మించిన అందంతో వెలిగిపోతుంటుంది. దాంట్లో కుందన్లు, వజ్రాలు, అన్‌కట్‌ వజ్రాలు, కెంపులు, పచ్చలు, తెల్ల రాళ్లు, నీలం రాళ్లు.. ఇలా ఒకటేమిటి అన్ని రకాల రత్నాలను చొప్పించి మరీ ఆ చెవి జుంకీలను వేలకొద్దీ డిజైన్లలో రూపొందించేస్తున్నారు నగల డిజైనర్లు.

chandbali ornaments
మెడసొంపుగా

కేవలం ముఖానికేనా ఆ జాబిలి సోయగం... మెడలోకి వస్తే మరెంత అందంగా ఉంటుందో అనిపించిందేమో.. నెక్లెస్సులు, హారాల్లోకి కూడా చంద్రవంకల్ని చొప్పించడం మొదలెట్టారు. దీనికితోడు నిన్నమొన్నటి కాసులపేరు, బొట్టుమాల డిజైన్లు కూడా అమ్మాయిలకు బోరుకొట్టేసినట్లున్నాయి. ఎంచక్కా చాంద్‌బాలీ నగలనే మెడకి, చెవులకి అలంకరించుకుని పెళ్లివేడుకలకు, శ్రావణమాస నోములకి హాజరవుతున్నారు. పైగా ఈ డిజైన్‌ మెడ నిండుగా ఉంటుంది కాబట్టి ఒక్క నగ పెట్టుకున్నా చాలు, అందరి దృష్టి అటే ఉంటుంది. ఇక, అందులో వజ్రాలో, కెంపులో, పచ్చల్లో చొప్పిస్తే ఎవరు మాత్రం కళ్లు తిప్పుకోగలరు చెప్పండి!

chandbali ornaments
చెవులూరించే చాంద్​బాలీ జుంకీలు

ఆనాటి ఫ్యాషనేగానీ...
అలాగని చాంద్‌బాలీ డిజైన్‌ ఈ మధ్య కాలంలో వచ్చిందనుకుంటే పొరబాటే. మొఘలుల కాలం నుంచీ వాడుకలో ఉంది. ఆనాటి ఆభరణాలన్నింటిలోనూ డిజైన్‌లో భాగంగా నెలవంక ఎంతో అందంగా ఇమిడిపోయేది.

మొఘల్‌ డిజైన్లను పోలి ఉండే నాటి నిజాం నగల్లోనూ ఇది ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. దాంతో చాంద్‌బాలీ హైదరాబాదీ సంప్రదాయ ఫ్యాషన్‌గానూ మారింది. మిగిలిన నగల్లోకన్నా చెవిలోలాకుల్లో ఈ డిజైన్‌ కొట్టొచ్చినట్లు కనిపించడంతో చాంద్‌బాలీ అన్న పేరు జుంకీలకు మారుపేరుగా స్థిరపడిపోయింది. కాలక్రమంలో చెవులకు పెట్టుకునే నగల్లో ఇదీ ఓ డిజైన్‌గా మాత్రమే అన్నట్లు ఉండేది. అయితే రామ్‌లీలాలో దీపికా పదుకొనే చాంద్‌బాలీలతో ముస్తాబవ్వడంతో దేశవ్యాప్తంగా ఈ ఫ్యాషన్‌ మరోసారి ఊపందుకుంది. అప్పటినుంచి దీనిపట్ల క్రేజ్‌ రోజురోజుకీ పెరిగిందే తప్ప కాస్త కూడా తగ్గలేదు.

chandbali ornaments
బుట్టతో కనువిందు చేస్తూ
chandbali ornaments
నెలవంక మెడపై ఒదిగేలా

విభిన్న డిజైన్లలో

రింగులాంటి ఆకారం వాటికి మధ్యవరకూ అర్ధచంద్రాకృతిలో తెల్లని కుందన్లూ రింగు కింద భాగంలో వేలాడే సౌత్‌ సీ లేదా బస్రా ముత్యాలూ... ఇదీ సంప్రదాయ చాంద్‌బాలీ. అయితే ఇప్పుడు రంగురంగుల కుందన్లు, అన్‌కట్‌ వజ్రాలు, ముత్యాలు, ఇతర విలువైన రత్నాలు పొదుగుతూ మరెన్నో డిజైన్లలో వీటిని రూపొందిస్తున్నారు. ఇలాంటి డిజైనర్‌ చాంద్‌బాలీల్లో రాళ్లను మొత్తంగా పొదిగి కిందభాగంలో ఒకటే ముత్యం గానీ రత్నంగానీ లేదా గుత్తులుగుత్తులుగా ముత్యాలు, రత్నాలను వేలాడదీయడం లేదా అవేమీ లేకుండానూ డిజైన్‌ చేస్తున్నారు. కుందన్‌కారి, మీనాకారి, పోల్కీ, పాచి వర్క్‌నీ చొప్పిస్తూ చాంద్‌బాలీలకు మరిన్ని మెరుగులద్దుతున్నారు. అచ్చంగా వజ్రాలను పొదిగినవి, బంగారంతో చేసినవి కూడా వస్తున్నాయి.

chandbali ornaments
బుట్టలు, కుందన్లతో మనసు దోచుకునేలా
chandbali ornaments
రాళ్లు పొదిగిన ఆభరణాల మాదిరిగా

అందంతో పోటీగా

సంప్రదాయ చాంద్‌బాలీలూ లేదా డిజైనర్‌ చాంద్‌బాలీలకు పైభాగంలో రాళ్లకు బదులుగా లక్ష్మీదేవి, వినాయకుడి బొమ్మల్ని పెట్టి చేసినదే రామ్‌లీలా చాంద్‌బాలీ. దక్షిణాది బుట్ట డిజైన్‌ని చాంద్‌బాలీకి కింది భాగంలో పొదిగి చేసిన మరో డిజైనే... జుంకీబాలీ. వీటిల్లో ఒకటి నుంచి ఐదారు బుట్టలు కూడా పెట్టి వెడల్పుగా చేసేవీ ఉంటున్నాయి. కిందిభాగంలో వేలాడేలా కాకుండా దిద్దుల్లా పెట్టుకునేవాటిల్లోనూ చాంద్‌బాలీ డిజైన్లు వస్తున్నాయి. ఈ జుంకీ డిజైన్లనే ఒకదానిపక్కన ఒకటి పేర్చుకుంటూ నెక్లెస్‌లు, హారాలు తయారుచేసేస్తున్నారు. వేరే డిజైన్లతో ఉన్న పొడవాటి హారాలకి చాంద్‌బాలీ పెండెంట్‌ని అమరుస్తున్నారు. కెంపులు, తెల్లరాళ్లు, ముత్యాలు పొదిగి చేస్తున్న ఈ డిజైన్లు చూసేకొద్దీ చూడాలనిపించేలా ఉంటున్నాయి. మొత్తం మీద అటు ఉత్తరాది కుందన్‌కారీకి ఇటు దక్షిణాది టెంపుల్‌ డిజైన్లనీ జోడించి చేస్తోన్న చాంద్‌బాలీ, చెవి జుంకీగానే కాదు, మెడలో హారంగానూ వెలిగిపోతూ అమ్మాయిల అందంతో పోటీపడుతోంది.

ఇదీ చదవండి: MP Santhosh Kumar: 'సీఎం కేసీఆర్​ సారథ్యంలో తెలుగు భాష మరింత వికసిస్తుంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.