ETV Bharat / lifestyle

చర్మానికి నాచు + జుట్టుకు బీరు = ఐరిష్ బ్యూటీ!

పూర్వకాలం నుంచి తాము పాటిస్తోన్న చిట్కాల వల్లే తమ అందం ద్విగుణీకృతం అవుతోందంటోన్న ఐరిష్ ముద్దుగుమ్మలు.. ఈ సౌందర్య చిట్కాల్ని ఇలాగే కొనసాగిస్తూ భవిష్యత్ తరాల వారికీ వీటిని అలవాటు చేస్తామంటున్నారు. కేవలం ఇవే కాదు.. ఐర్లాండ్ మహిళల అందం వెనుక ఇంకా బోలెడన్ని సహజసిద్ధమైన సౌందర్య రహస్యాలు దాగున్నాయి. మరి, అవేంటో మనమూ తెలుసుకొని ఫాలో అయిపోదామా..!

Ireland women beauty secrets in telugu
చర్మానికి నాచు + జుట్టుకు బీరు = ఐరిష్ బ్యూటీ!
author img

By

Published : Jul 24, 2020, 7:32 PM IST

ముఖంపై మొటిమల్ని తొలగించుకోవాలంటే అందుకు బార్లీ వాటర్ చక్కటి పరిష్కారం.

చర్మం బిగుతుగా మారాలంటే సముద్రపు నాచుతో చర్మాన్ని ర్యాప్ చేస్తే సరి.

జుట్టు పట్టుకుచ్చులా మెరిసిపోవాలంటే బీర్ కండిషనింగ్ తప్పనిసరి.

వినడానికి కాస్త ఆశ్చర్యంగానే అనిపిస్తోన్నా.. ఇవన్నీ తమ విషయంలో మాత్రం నిజమయ్యాయని చెబుతున్నారు ఐర్లాండ్ మగువలు.

'బార్లీ వాటర్'తో మొటిమలకు చెక్!

మొటిమలు, వాటి తాలూకు మచ్చలు.. వయసుతో సంబంధం లేకుండా ప్రస్తుతం చాలామంది ఆడవారు ఎదుర్కొంటోన్న సమస్య ఇది. వాతావరణ కాలుష్యంతో పాటు మనం తీసుకునే జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్.. ఈ సమస్యకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. వీటిని తగ్గించుకోవాలంటే బయట దొరికే ఆహారానికి బదులుగా బార్లీ నీరు తాగమని సూచిస్తున్నారు ఐర్లాండ్ మగువలు.

తమ చర్మం అంత ప్రకాశవంతంగా, మొటిమలు, మచ్చలు లేకుండా ఉందంటే.. అందుకు వారు రోజూ గ్లాసు బార్లీ నీరు తాగడం వల్లేనట! అయితే ఈ నీరు తయారుచేసుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. పావు కప్పు బార్లీ గింజల్ని తీసుకొని రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే నీళ్లు వంపేసి.. ఆ గింజల్ని ఒక గిన్నెలో వేసి కొన్ని నీళ్లు పోసి అరగంట పాటు ఉడికించాలి. గింజలు పూర్తిగా ఉడికాక స్టౌ ఆఫ్ చేసి ఆ నీటిని చల్లారనివ్వాలి. ఆఖర్లో ఈ నీటిని గ్లాసులోకి తీసుకొని నిమ్మరసం, కొద్దిగా ఉప్పు వేసుకొని తీసుకుంటే సరిపోతుంది. బార్లీ నీరు రోజూ తాగడం వల్ల మొటిమల సమస్య తగ్గడమే కాదు.. శరీరానికి చలువ కూడా చేస్తుంది.

బిగుతైన చర్మానికి సీ-వీడ్!

లావుగా ఉన్న వారు నాజూగ్గా మారినా, గర్భం ధరించిన వారు ప్రసవమయ్యాక.. ఇలాంటి సందర్భాల్లో శరీరంలో వచ్చే మార్పుల వల్ల చర్మం వదులుగా మారడం మనకు తెలిసిందే. మరి, ఈ వదులైన చర్మాన్ని బిగుతుగా మార్చుకోవడానికి రకరకాల క్రీములు వాడడం, చికిత్సలు చేయించుకోవడం.. వంటివి చాలామంది చేసే పని. కానీ వీటివల్ల సత్ఫలితాలు వస్తాయో, లేదో తెలియదు కానీ.. దుష్ప్రభావాల బారిన పడే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి.

అందుకే ఐర్లాండ్ మగువలు తమ చర్మాన్ని బిగుతుగా మార్చుకోవడానికి కూడా సహజసిద్ధమైన పద్ధతినే అనుసరిస్తుంటారు. అదే.. సీ-వీడ్ బాత్. అక్కడి సముద్రంలో విరివిగా లభించే సముద్రపు నాచుతో స్నానం చేయడం ఐరిష్ మగువలకు అలవాటు. ఈ క్రమంలో రోజూ కొద్దిగా సముద్రపు నాచును వారు స్నానం చేసే నీటిలో వేసుకొని.. కాసేపటి తర్వాత స్నానం చేస్తారు. అదీ కాకపోతే వారికి దగ్గర్లోని పార్లర్స్‌కి, స్పా సెంటర్లకి వెళ్లి. అక్కడ సీ-వీడ్ ర్యాప్ చేయించుకుంటారు. అంటే.. సముద్రపు నాచును శరీరమంతా అప్త్లె చేసుకొని కాసేపు సేదతీరడం అన్నమాట. ఇలా ఈ పద్ధతుల వల్ల సముద్రపు నాచులోని ఖనిజాలు చర్మానికి పోషణను అందించి చర్మం బిగుతుగా మారడంతో పాటు సరికొత్త కాంతిని సంతరించుకునేలా చేస్తుందనేది ఐరిష్ అతివల నమ్మకం.

ఓట్‌మీల్‌తో ఫేషియల్..

వేడుకైనా, పార్టీ అయినా అమ్మాయిలంతా అందంగా మెరిసిపోవాలనుకోవడం, అందుకోసం ఫేషియల్స్ చేయించుకోవడం కామన్. పార్లర్స్‌కి వెళ్లడం కంటే ఇంట్లో సొంతంగా చేసుకోవడానికే ఆసక్తి చూపిస్తున్నారు చాలామంది మహిళలు. ఐరిష్ మగువలు కూడా అంతే! ఫేషియల్స్ కోసం పార్లర్ల చుట్టూ తిరుగుతూ డబ్బులు ఖర్చు చేయడం కంటే ఇంట్లోనే సహజసిద్ధమైన పదార్థాలతో ఫేషియల్ చేసుకుంటూ న్యాచురల్ బ్యూటీస్‌గా మెరిసిపోవడమంటేనే ఈ ముద్దుగుమ్మలకు ఇష్టమట!

మరి, ఈ ఫేషియల్ కోసం వారు ఉపయోగించే పదార్థమేంటంటే.. 'ఓట్‌మీల్ ఫేస్‌ప్యాక్'. రెండు చెంచాల ఓట్స్, చెంచా చొప్పున పాలు, తేనె.. ఈ మూడింటినీ కలిపి పేస్ట్‌లాగా చేసుకొని.. ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్త్లె చేసుకుంటారు. ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేసుకుంటారు. ఈ ప్యాక్ చర్మానికి స్క్రబ్‌గా ఉపయోగపడుతుంది. తద్వారా చర్మంపై ఉండే మొటిమలు తొలగిపోవడంతో పాటు పొడిబారి నిర్జీవమైన చర్మం కొత్త కళను సంతరించుకుంటుంది.

సంపూర్ణ సౌందర్యానికి 'కాంఫ్రే'!

అటు చర్మ సౌందర్యాన్ని, ఇటు ఆరోగ్యాన్ని కాపాడే ఔషధ మూలికలు కొన్నుంటాయి. అలాంటి వాటిని వివిధ రకాల ఔషధాల తయారీలో వాడడం, వాటితో ఫేస్‌ప్యాక్, హెయిర్‌మాస్కుల్ని తయారుచేసుకొని ఉపయోగించడం మనకు తెలిసిందే. అలా ఐరిష్ మగువలు తమ అందాన్ని, ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి ఉపయోగించే ఔషధ మూలిక 'కాంఫ్రే' ఆకులు. అక్కడ విరివిగా లభించే ఈ మొక్క ఆకులు, కాండంలో ఎన్నో పోషకాలు దాగున్నాయి. పొడిబారి పొలుసులుగా వూడిపోయే చర్మ సమస్య ను పరిష్కరించడం, జుట్టును పట్టుకుచ్చులా మెరిపించడం.. మొదలైన వాటితో పాటు కీళ్లు, కండరాల నొప్పుల్ని తగ్గించే ఔషధ గుణాలు సైతం ఇందులో పుష్కలంగా ఉంటాయి. అందుకే ఐర్లాండ్ మహిళలు ఈ ఆకుల్ని తాము చర్మ సౌందర్యం కోసం ఉపయోగించే ఫేస్‌ప్యాక్‌ల్లో వాడతారు. అలాగే గాయాలు, కీళ్లు-కండరాల నొప్పుల నుంచి ఉపశమనం కోసం ఆయా భాగాల్లో ఈ ఆకులతో తయారుచేసిన పేస్ట్‌ని అప్త్లె చేస్తారు. ఐర్లాండ్‌లో విరివిగా పెరిగే ఈ కాంఫ్రే మొక్క.. ఇక్కడ కాంఫ్రే ఎక్స్‌ట్రాక్ట్ రూపంలో ఆన్‌లైన్ మార్కెట్లో లభ్యమవుతుంది. అయితే ఈ ఆకులు అందరికీ పడచ్చు.. పడకపోవచ్చు. కాబట్టి వీటిని వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం లేదంటే సౌందర్య, ఆరోగ్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

బీర్‌తో కండిషనింగ్!

జుట్టును సిల్కీగా మార్చుకోవడానికి, కేశ సంపదను రెట్టింపు చేసుకోవడానికి చాలామంది పాటించే చిట్కా.. తలస్నానం చేసిన తర్వాత జుట్టును కండిషన్ చేసుకోవడం. ఇందుకోసం బయట రకరకాల హెయిర్ కండిషనర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఐర్లాండ్ మగువలు తమ జుట్టును కండిషన్ చేసుకోవడానికి ఏం ఉపయోగిస్తారో తెలుసా? బీర్. ఇందుకోసం ముందుగా గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేసి.. ఆఖర్లో బీర్‌ని కుదుళ్ల నుంచి జుట్టు చివర్ల వరకు పడేలా పోస్తారు. ఇందులో అధిక మొత్తంలో ఉండే ప్రొటీన్లు జుట్టుకు పోషణను అందించి కేశాలను మృదువుగా, సిల్కీగా, పట్టుకుచ్చులా మార్చుతాయి.

వీటితో పాటు.. ఎరుపు రంగును ఎక్కువగా ఇష్టపడే ఐర్లాండ్ మగువలు తమ జుట్టుకు రెడ్ కలర్ హెయిర్ కలర్స్‌ని వేసుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు. అలాగే బుగ్గలకు పింక్ బ్లష్, పెదాలకు ఎరుపు రంగు లిప్‌స్టిక్ వాడే అమ్మాయిలు ఈ దేశంలో ఎక్కువ. ఇక హెయిర్‌స్త్టెల్ విషయానికొస్తే.. విభిన్న బ్రెయిడ్ హెయిర్‌స్త్టెల్స్ వేసుకోవడానికే ఇక్కడి అమ్మాయిలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారట.

చూశారుగా.. సంపూర్ణ సౌందర్యానికి సహజమైన పదార్థాలను వాడుతూ, ఆకట్టుకునే తలకట్టుతో మెరిసిపోతూ.. ఇతర దేశాల మగువలకు బ్యూటీ లెసన్స్ చెబుతోన్న ఐరిష్ అతివల అందం వెనకున్న రహస్యాలేంటో తెలుసుకున్నారుగా! మరైతే ఆలస్యమెందుకు.. మీరూ వీటిని ఓసారి ట్రై చేసి చూడకూడదూ!!

ఇదీ చదవండి:కరోనా సోకిందని తలుపులకు స్టీల్​ రేకులతో సీల్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.