ETV Bharat / lifestyle

FASHION DESIGNER: కేన్స్‌లో తెలుగమ్మాయి మెరుపులు - తెలంగాణ వార్తలు

ఒక్క ఛాన్స్‌.. ఒకే ఒక్క ఛాన్స్‌... ప్రతి సెలెబ్రెటీ రెడ్‌ కార్పెట్‌పై నడవాలనుకునే వేదిక... ప్రతి డిజైనర్‌ తన దుస్తులు ప్రపంచమంతా చూడాలనుకునే వేడుక... కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌! ఆ అరుదైన అవకాశం మన తెలుగు డిజైనర్‌ అరుణ గౌడ్‌ చేజిక్కించుకుంది... ఇంతేకాదు తన సృజనాత్మకతతో ఉత్తమ డిజైనర్‌గా అవార్డులందుకుంది... పల్లెటూరిలో పుట్టి ప్రపంచ వేదికలపై జెండా ఎగరేస్తోన్న తనతో ఈతరం మాట కలిపింది.

fashion designer aruna goud
తెలుగమ్మాయి మెరుపులు...
author img

By

Published : Jul 17, 2021, 11:53 AM IST

అరుణ సొంతూరు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు. చిన్నప్పట్నుంచీ అందంగా కనిపించాలనుకోవడం, ఫ్యాషన్స్‌ గురించి తెలుసుకోవడం అంటే ఆసక్తి. బీటెక్‌ తర్వాత ఏడాదిపాటు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పని చేసింది. మనసంతా ఫ్యాషన్‌పైనే ఉండటంతో ఇంక ఇందులో కొనసాగలేననుకుంది. మంచి జీతం వచ్చే ఉద్యోగం మానేసి ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనింగ్‌ సంస్థలో చేరి డిప్లమో పూర్తి చేసింది. డిజైనర్‌గా మారాక తను అనుకున్న వెంటనే సక్సెస్‌ చేతికందలేదు. ముఖ్యంగా ఈ రంగంలోని పరిస్థితులు అవగాహన చేసుకోవడం, మార్కెటింగ్‌.. లాంటి కొన్ని విషయాలు కొరుకుడు పడలేదు. అయినా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా హార్డ్‌వర్క్‌నే నమ్ముకుంది. కొంచెం ఆలస్యమైనా తన డిజైన్స్‌కి గుర్తింపు రావడం మొదలైంది.

గుర్తింపు

  • బిజినెస్‌ మింట్‌ నేషన్‌ వైడ్‌ అవార్డు నుంచి బెస్ట్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌.
  • తెలంగాణ ఛాంబర్‌ ఆఫ్‌ ఈవెంట్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (టీసీఈఐ) నుంచి ఉత్తమ ఫ్యాషన్‌ ఆర్గనైజర్‌.
  • ఎయిర్‌ఇండియా, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ తెలంగాణ హ్యాండ్లూమ్‌, టెక్స్‌టైల్‌ సంస్థలకు డిజైనర్‌గా పని చేస్తోంది.

తనదైన ముద్ర..

డిజైన్లు సృజనాత్మకం, కళాత్మకం.. సొగసుల రంగం ప్రాథమిక సూత్రం. అరుణ వీటినే నమ్ముకుంది. పెద్ద పెద్ద ఫ్యాషన్‌ షోలలో డిజైన్లు ప్రదర్శించి మెప్పు పొందింది. వేడుకలు, బిజినెస్‌ ఈవెంట్లు, వెహికిల్‌ లాంచింగ్‌ కార్యక్రమాలు.. ఇలాంటివాటిలో ప్రత్యేకంగా ఫ్యాషన్‌ షోలు నిర్వహిస్తోంది. సెలెబ్రెటీలు, వ్యాపారవేత్తలు, బ్యూరోక్రాట్స్‌ చాలామందికి వ్యక్తిగత స్టైలిష్ట్‌గా పని చేస్తోంది. పెద్ద ఫ్యాషన్‌ బ్రాండ్‌లకు దుస్తులు డిజైన్‌ చేసింది. రెండేళ్ల కిందట ఫెమీనా మిస్‌ ఇండియా పోటీదారుకి దుస్తులు డిజైన్‌ చేసింది. పేరున్న ప్రతి డిజైనర్‌కి తనకంటూ ఒక శైలి ఉంటుంది. అరుణ విషయానికొస్తే ‘నేను నా వినియోగదారుల అభిరుచులకనుగుణంగానే డిజైన్‌ చేస్తాను. కొందరికి విలాసంగా ఉండటం ఇష్టం. కొందరు సంప్రదాయం, మరికొందరు వెస్ట్రన్‌ ఇష్టపడతారు. ప్రతి ఒక్కరినీ మెప్పించేలా డిజైన్‌ చేయడమే నాకిష్టం. వ్యక్తిగతంగా నేను దృష్టి పెట్టేది బ్రైడల్‌ కలెక్షన్స్‌’ అంటూ తన విజయ రహస్యం చెబుతుంది. తనకంటూ దేశవ్యాప్తంగా ఒక పేరు వచ్చిన తర్వాత సొంత ఫ్యాషన్‌ లేబుల్‌ ప్రారంభించింది. హైదరాబాద్‌, గోవాల్లో స్టోర్లు తెరిచింది. ఇదేకాదు.. సవాళ్లను ఇష్టపడే అరుణ ‘ఇండియన్‌ గ్లామ్‌ ఫ్యాషన్‌ వీక్‌’ పేరుతో సొంతంగా ఏడాదికోసారి ఫ్యాషన్‌ వీక్‌ నిర్వహిస్తోంది. ఇప్పటికి విజయవంతంగా ఏడు షోలు పూర్తయ్యాయి. ఇందులో దాదాపు 150 మంది విదేశీ, దేశీయ టాప్‌ డిజైనర్లు పాల్గొన్నారు. కొత్తవాళ్లు తమ ప్రతిభ నిరూపించుకున్నారు.

ఏకైక డిజైనర్‌

కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా పండగ. హాలీవుడ్‌తోపాటు ప్రపంచంలోని తారలంతా అక్కడ హాజరవుతారు. రెడ్‌కార్పెట్‌పై నడిచే సెలెబ్రెటీలు తమ డిజైన్లు ధరించాలని ప్రతి డిజైనర్‌ కల. ఈ కార్యక్రమానికి ప్రపంచంలోని టాప్‌ మ్యాగజైన్లు, ఫ్యాషన్‌ బ్రాండ్లు, ఫొటోగ్రాఫర్లు వస్తుంటారు. ఇక్కడ తమ ఔట్‌ఫిట్స్‌ షో అయితే మొత్తం ప్రపంచం దృష్టిలో పడిపోతారు. అందుకే అంత క్రేజ్‌. భారత్‌లో ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఎంతో మంది ఫ్యాషన్‌ డిజైనర్లు ఉన్నా కేన్స్‌ వేదికపై తమ కలెక్షన్లు ప్రదర్శించే అవకాశం ఇప్పటివరకు ఎవరికీ రాలేదు. భారత్‌కి చెందిన సెలెబ్రెటీలు, మోడళ్లు రెడ్‌కార్పెట్‌పై నడిచే అవకాశం దక్కించుకున్నా, మొదటి డిజైనర్‌ మాత్రం మన అరుణే. రెండు నెలలపాటు కష్టపడి డిజైన్‌ చేసిన లావెండర్‌ రంగు డ్రెస్‌ని 21 ఏళ్ల ఫ్రెంచ్‌ మోడల్‌, యాక్టర్‌ నటాషా ధరించి హొయలు పోయింది.

కేన్స్‌లో తెలుగమ్మాయి మెరుపులు...
యాక్టర్‌ నటాషా

ఆకట్టుకునే దుస్తులతో ఎలాంటివాళ్లనైనా అందంగా మార్చేయొచ్చు. డ్రెస్‌ బాగుంటే ఆటోమేటిగ్గా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అందుకే యువత జీవితాల్లో ఫ్యాషన్‌ ఒక భాగం అయిపోతోంది. కష్టపడేతత్వం, సృజనాత్మకత ఉంటే ఎవరైనా ఇందులో రాణించవచ్చు. అన్నింటికీ ఇదే సూత్రం వర్తిస్తుంది.

ఇదీ చూడండి: ఇంటి నుంచి పారిపోయింది.. ప్యారిస్ ఫ్యాషన్​ వీక్​ నుంచి ఆహ్వానం అందుకుంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.