ETV Bharat / lifestyle

టీషర్టుకి రాళ్ల మెరుపులు! - crystal t shirt trend

కాంతి పడితే తళుక్కున మెరిసే రాళ్లూ, నగలూ యాక్సెసరీలకు ఎంతో అందాన్ని తెచ్చిపెడతాయి. ఇప్పుడు టీషర్టులకూ అలాంటి రాళ్ల మెరుపులు అద్దుతున్నారు డిజైనర్లు. క్రిస్టల్‌ టీ షర్టులుగా ఇవి జనం ఆదరణను పొందుతున్నాయి.

crystal t shirts are the new fashion trend
టీషర్టుకి రాళ్ల మెరుపులు!
author img

By

Published : Jul 19, 2020, 1:13 PM IST

‘ఏంటో ఈ 2020 సంవత్సరం అంతా రెండు టీ షర్టులూ రెండు నైట్‌ ప్యాంట్లతో గడిచిపోయేట్టు ఉంది’ అంటూ దిగులుగా కూర్చున్న బ్రహ్మానందం ఫొటో ఒకటి నెట్టింట్లో ఆ మధ్య తెగ చక్కర్లు కొట్టింది. లాక్‌డౌన్‌ కొంతమేర సడలించినా చాలా కంపెనీల్లో ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ కొనసాగుతుండటంతో చాలా మంది టీషర్టుల్లోనే రోజులు గడిపేస్తున్నారు.

ఇలా క్యాజువల్‌ లుక్‌కి మారుపేరైన టీ షర్టుకు మిలమిలలాడే రాళ్లను జోడించి గ్రాండ్‌ లుక్‌ తెప్పిస్తే ఎలా ఉంటుందీ అని ఆలోచించారేమో, చిక్కటి చీకటిలా కనిపించే నల్లటి టీషర్టులకు సప్తవర్ణాల కాంతుల్ని విరజిమ్మే స్వరోవ్‌స్కీ క్రిస్టళ్లూ, రాళ్లనూ జోడించారు డ్రెస్‌ డిజైనర్లు. సాధారణంగా చొక్కాల మీద పూలూ, తీగలూ, జంతువులూ, పక్షులూ, కొటేషన్లూ.... ప్రింట్లుగా రావడం మనకు తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో చొక్కాల మీదా రాళ్లతో అలాంటి డిజైన్లను సృష్టిస్తున్నారు.

అబ్బాయిలకు నచ్చేలా, అమ్మాయిలు మెచ్చేలా, ఫ్యాషనబుల్‌గా కనిపించేలా వీటిని ఆవిష్కరిస్తున్నారు. మామూలుగా మనకు కనిపించే సీతాకోక చిలుకలూ, నెమళ్లూ, పువ్వులతోపాటు ఫ్యాషన్‌ ఐకాన్‌లుగా చెప్పే హృదయాకారాలూ, పెదవులతో పాటు పుర్రె బొమ్మలూ వీటి మీద ప్రత్యక్షమవుతున్నాయి. ఇక, పిల్లల కోసం కేకులూ, స్మైలీల్లాంటి డిజైన్లూ రూపొందుతున్నాయి. మన సంస్కృతిని ప్రతిబింబించేలా గణపతి, లక్ష్మిలాంటి దేవతా రూపాలూ దొరుకుతున్నాయి.

మెడకు రాళ్ల నెక్లెస్‌ పెట్టుకున్నట్లు కనిపించేలా రంగు రంగుల రాళ్లతో నెక్‌ డిజైన్లనూ రూపొందిస్తున్నారిందులో. మామూలు టీషర్టుల్లాగే వీటిని కూడా రకరకాల వెబ్‌సైట్ల ద్వారా ఆన్‌లైన్‌లో ఆర్డరిచ్చి కొనుక్కోవచ్చు. కాకపోతే ధర మాత్రం ఎక్కువే. మనం ఎంచుకున్న డిజైన్‌లో వాడే రాళ్ల సంఖ్యా, నాణ్యతలను బట్టి ఆయా చొక్కాల ఖరీదు ఉంటుంది. మామూలు టీ షర్టులా మెత్తగా హాయిగా ఉండటంతోపాటు, గ్రాండ్‌గా సమ్‌థింగ్‌ స్పెషల్‌గా కనిపించాలంటే మాత్రం ఈ క్రిస్టల్‌ టీ షర్టును కొనేయాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.