పొడి చర్మతత్వం ఉన్నవారు ముఖానికి రోజూ ఉదయాన్నే తేనె రాసుకోండి. ఆపై ఓ పదినిమిషాలు మృదువుగా మర్దన చేయండి. తగిన తేమ అందుతుంది. తేనెకు కొలాజిన్ ఉత్పత్తిని పెంచే శక్తి ఎక్కువ. దీన్ని సౌందర్య సాధనంగా వినియోగించడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. నిగారింపుతో కనిపిస్తుంది.
- తేనెలోని గ్రాన్యుల్స్ చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. దీన్ని వేడిచేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు చెంచా చొప్పున పాలు, సెనగపిండి కలిపి చర్మానికి రాసుకుని సున్నితంగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై మృతకణాలు తొలగి తాజాగా కనిపిస్తుంది. నునుపుగా మారుతుంది.
- యాంటీఆక్సిడెంట్ గుణాలు తేనెలో ఎక్కువ. ఇది నిర్జీవమైన చర్మాన్ని పునరుత్తేజం చెందేలా చేస్తుంది. ముఖ్యంగా ముఖంపై పడే గీతలు, మచ్చల్ని తొలగిస్తుంది. రెండు చెంచాల తేనెలో చెంచా తులసి పొడి కలిపి రాసుకోవాలి. పావుగంటయ్యాక గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే క్రమంగా మచ్చలు, గీతలూ తొలగిపోతాయి.
ఇదీ చదవండి: ఈ సమావేశాల్లోనే అసెంబ్లీ ముందుకు.. కొత్త రెవెన్యూ చట్టం!