ETV Bharat / lifestyle

ప్రమాదకర విన్యాసాలు చేసి... స్టంట్ ఉమెన్​గా మారి - గీతా టాండన్ వార్తలు

సినిమా..! అందమైన ఊహల ప్రపంచంలోకి తీసుకెళ్లి... వినోదం పంచే సాధనం. నిజ జీవితంలో నిత్యం పలకరించే సమస్యలు, బాధల్ని 2 గంటల పాటు దూరం చేసే మాయా ప్రపంచం. అందుకే తెర మీద కనిపించే నటులు, వారి పోరాట సన్నివేశాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతుంటారు. ఆరాధ్యదైవంగా కొలుస్తుంటారు. అయితే తెర మీద కనిపించే నటుల కంటే అసలైన కష్టం తెర వెనుకున్న స్టంట్‌ మ్యాన్‌లదే. పురుషులు మాత్రమే కనిపించే ఈ రంగంలో.. తన ప్రత్యేకత చాటుకుంటోంది గీతా టాండన్‌.

geetha tandon successful story
ప్రమాదకర విన్యాసాలు చేసి... స్టంట్ ఉమెన్​గా మారి
author img

By

Published : Mar 14, 2021, 1:48 PM IST

ప్రమాదకర విన్యాసాలు చేసి... స్టంట్ ఉమెన్​గా మారి

గీతా టాండన్‌....! హిందీ సినీ పరిశ్రమకు పరిచయం అవసరం లేని పేరు. బాలీవుడ్‌ స్టంట్‌ ఉమన్‌గా గీతా టాండన్‌ వందలాది చిత్రాలకు పని చేశారు. ఐశ్వర్యరాయ్‌, దీపికా పదుకునే, కత్రినా కైఫ్‌, పరిణితి చోప్రా, బిపాసా బసు లాంటి ఎందరో నటీమణులకు డూప్‌గా చేసింది. ప్రమాదకర స్టంట్ విన్యాసాలు అవలీలగా చేస్తూ... ప్రముఖ స్టంట్ ఉమెన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

భారం దించేసుకున్నారు..

దాదాపు దశాబ్దకాలంగా సినిమా రంగంలో ఉన్న గీతా జీవితం సైతం సినిమా తరహాలోనే అనేక మలుపుతో సాగింది. పంజాబ్‌కు చెందిన గీతా టాండన్ కుటుంబం బతుకుదెరువు కోసం ముంబయికి వలస వచ్చింది. ఇక్కడే పుట్టి పెరిగిన గీతా... బాల్యం నుంచే అనేక కష్టాలతో సావాసం చేసింది. 9 ఏళ్ల ప్రాయంలోనే తల్లికి దూరమైంది. సరైన ఆలనా పాలనా లేక అనేక ఇబ్బందులు పడింది. 15 ఏళ్లు వచ్చి రాగానే తన భారం దించుకునేందుకు గీతా తండ్రి.. పెళ్లి చేసి అత్తారింటికి పంపి బాధ్యత వదిలించుకున్నారు.

ఉక్కు మనిషిగా మారి..

మెట్టినింట అడుగుపెట్టిన గీతాకు.. భర్తతో కొత్త చిక్కులు తప్పలేదు. తెలియని వయసులో ఆమెను ఆటవస్తువుగా చూస్తూ... నిత్యం వేధింపులు గురి చేసేవాడు. చూస్తుండగానే ఇద్దరు పిల్లలకు తల్లైంది. బిడ్డల కోసం ఇబ్బందుల్ని భరిస్తూ... సంసారం నెట్టుకొచ్చినా ఆ చిన్నారులకు మంచి భవిష్యత్‌ ఇచ్చేందుకు భర్త నుంచి దూరమైంది. పుట్టినింటా ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఉపాధి కోసం ఎక్కడికి వెళ్లినా.. భర్తను వదిలేసిన మహిళగా పురుషాధిక్య సమాజం నుంచి లైంగిక వేధింపులు పలకరించేవి. అప్పుడే తనకు తాను సమాధానం చెప్పుకుని ఉక్కు మనిషిగా మారింది. కొత్త ప్రయాణం మెుదలుపెట్టింది.

పట్టుదల కలిసి వచ్చింది..

సినిమాల మీద ఉన్న ఆసక్తితో అందరు యువతుల మాదిరిగానే గీతా... డ్యాన్సర్‌గా సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. అయితే చిన్నతనంలో క్రీడలు బాగా ఆడటం వల్ల శరీర దారుఢ్యం సొంతం చేసుకున్న గీతకు అదే వరంగా మారింది. దానికి తోడు బైక్ రైడింగ్‌లో మంచి ప్రావీణ్యం ఉండటం, ఏదైనా చేయగలను అనే మెుండి పట్టుదల కలిసి వచ్చింది. ఇవే ఆమెను స్టంట్‌ ఉమన్‌ అయ్యేందుకు కారణమయ్యాయి.

స్టంట్ ఉమన్​గా..

సినిమాల్లో హీరోయిన్లు చేసే రిస్కీ స్టంట్లకు డూప్‌గా చేసే గీతా... తొలి సినిమాకు 1,200 రూపాయలు అందుకుంది. అప్పుడే నిర్ణయించుకుంది. కుటుంబం, పిల్లల భవిష్యత్తు కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధంగా ఉండాలనుకుంది. నాటి నుంచి నేటి వరకూ వందలాది సినిమాలకు స్టంట్ ఉమన్‌గా చేసింది. బైకులు, కార్లు, బస్సులు, లారీలు ఇలా ఎలాంటి వాహనాలనైనా అవలీలగా నడుపుతూ... ప్రమాదకర సన్నివేశాలకు సై ‌అంటోంది. ప్రముఖ నటీమణులందరికీ డూప్‌గా చేసి తనదైన ప్రతిభ చాటుకుంటోంది.

నిత్యం సవాళ్లు విసిరే స్టంట్‌ ఉమన్‌ బాధ్యతల్ని సమర్ధంగా పోషించే క్రమంలో గీతా అనేకసార్లు గాయాల బారిన పడింది. ఒకసారి ముఖం కాలింది. మరోసారి నడుము విరిగింది. ఇంకోసారి కాలు దెబ్బతిన్నది. కానీ... ఏనాడు ఈ రంగం నుంచి వెళ్లిపోవాలని అనుకోలేదు. ప్రాణాల్ని పణంగా పెట్టి పోరాటాలు చేసేది తనే అయినా... గుర్తింపు , ప్రశంసలు మరొకరి సొంతం అవుతున్నా... నిరాశ చెందలేదు. తన పనికి విరామం ఇవ్వలేదు. అదే ఆమెకు పరిశ్రమలో ఎనలేని గుర్తింపునిచ్చింది. ఉత్తమ స్టంట్ ఉమన్‌గా నిలిపింది.

ఇదీ చూడండి: లైంగికదాడి భయం నుంచి బయటపడలేని పసిమొగ్గలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.