ETV Bharat / lifestyle

ధైర్యంగా పోరాడారు.. పులిట్జర్ గెలిచారు - Dornella Frazier

ప్రపంచాన్ని కుదిపేసిన ఫ్లాయిడ్ హత్యను వీడియో తీసి నల్లజాతీయులపై వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమం రేకెత్తేలానూ చేసింది డార్నెల్లా ఫ్రాజియర్‌. ధైర్యంగా వీడియోను తీయడమే కాకుండా వ్యవస్థ పేరిట జరుగుతున్న క్రూర చర్యలను బయట పెట్టడానికి డార్నెల్లా కారణమైంది. మరోవైపు డ్రాగన్ బెదిరింపులకు తొణకకుండా వారి దురాగతాలను బయటపెట్టింది మేఘా రాజగోపాలన్. అన్యాయాన్ని ఎదిరించి ఒంటరిగా పోరాడిన ఆ యువతులిద్దరిని పులిట్జర్ వరించింది. అందరిలో వారిని ప్రత్యేకంగా నిలబెట్టింది.

Pulitzer prize, Pulitzer prize for two girls
పులిట్జర్ ప్రైజ్, ఇద్దరమ్మాయిలకు పులిట్జర్ ప్రైజ్
author img

By

Published : Jun 13, 2021, 9:41 AM IST

పులిట్జర్‌.. జర్నలిజం, సాహిత్యాల్లో విశేష సేవలను అందించినవారికి ఇచ్చే ప్రతిష్ఠాత్మక అవార్డు. ఈ ఏడాది వాటిల్లో ఇద్దరు అమ్మాయిలు ప్రత్యేకంగా నిలిచారు. ఒకరు చైనా బెదిరింపులకు భయపడకుండా వారి దురాగతాలను బయటపెడితే ఇంకొకరు వీడియో ద్వారా నల్లజాతీయులపై చూపుతున్న వివక్షను అందరికీ తెలియజేశారు. వాళ్లే మేఘా రాజగోపాలన్‌, డార్నెల్లా ఫ్రాజియర్‌.

అంతర్జాతీయ విభాగంలో..:

మేఘా రాజగోపాలన్‌

మేఘా భారతీయ మూలాలున్న జర్నలిస్ట్‌. బజ్‌ఫీడ్‌ సంస్థలో పనిచేస్తోంది. చైనాలోని షిన్‌జియాంగ్‌ అనే ప్రాంతంలో వేలకొద్దీ ముస్లింలను అక్కడి ప్రభుత్వం నిర్భంధించింది. ఇందుకోసం పెద్ద సంఖ్యలో జైళ్లనూ, నిర్భందంగా క్యాంప్‌లనూ నిర్మించింది. దీనిపై మేఘా వరుస కథనాలను ప్రచురించింది. 2017లో వీటిని గుర్తించి, అక్కడకు వెళ్లింది. ఆ వివరాలను ప్రస్తావిస్తూ కథనం రాసింది. కానీ చైనా ప్రభుత్వం దాన్ని తోసిపుచ్చింది. ఈమెను భయపెట్టడానికి ప్రయత్నించడమే కాకుండా వీసాను రద్దు చేసి, దేశం నుంచి పంపేసింది. దీంతో మేఘా లండన్‌ వెళ్లింది. అక్కడ్నుంచి దీనిపై పరిశోధన ప్రారంభించింది. ఇందుకు శాటిలైట్‌ ఇమేజెస్‌, ఆర్కిటెక్చర్‌ ఫోరెన్సిక్‌ అనాలిసిస్‌ నిపుణుడు, ప్రోగ్రామర్‌ సాయంతో ఆధారాలతో సహా ఈ అక్రమాలను బయటపెట్టింది.

‘యుగరస్‌, కజక్స్‌, ఇతర ముస్లిం మైనారిటీలను చైనా ఎక్కడ బంధించింది?’ పేరిట ఈ పరిశోధన సాగించింది. 260కు పైగా అక్రమ నిర్మాణాల్లో పది వేలకు పైగా మందిని బంధించి ఉంచడమే కాకుండా కొందరిని వెట్టిచాకిరీకీ ఉపయోగించారు. ఇదంతా ప్రాణాలకు తెగించి, ప్రపంచం ముందుకు తెచ్చింది. ఇందుకోసం నెలలపాటు వేల కొద్దీ శాటిలైట్‌ ఫొటోలను పరిశీలించి ఆధారాలను కూడగట్టింది. చైనా ముస్లింలు వలసపోయిన దేశాలకు వెళ్లి, వారిని ఒప్పించి సమాచారాన్ని సేకరించింది. ఈ సాహసానికి ఇన్నొవేటివ్‌ ఇన్వెస్టిగేషన్‌ కేటగిరీలో మేఘనకు పులిట్జర్‌ అవార్డు దక్కింది.

ప్రత్యేక ప్రశంస:

డార్నెల్లా ఫ్రాజియర్‌

డార్నెల్లా ఫ్రాజియర్‌ జర్నలిస్టు కాదు. అమెరికాలోని మినియాపొలిస్‌కి చెందిన ఆమె గత ఏడాది తన కుటుంబంతో కలిసి బయటకు వెళ్లింది. అక్కడ పోలీస్‌ ఆఫీసర్‌ నల్లజాతీయుడైన జార్జ్‌ ఫ్లాయిడ్‌ను కిందపడేసి మోకాలితో గొంతును పట్టి ఉంచాడు. అతను ‘ఊపిరాడటంలేదు, వదిలే’ యమంటూ పోలీస్‌ను బతిమాలుతున్నాడు. చుట్టు ఉన్నవారెవరూ వారి దగ్గరికి వెళ్లే సాహసం చేయలేకపోయారు. కొద్దిసేపటికే ఫ్లాయిడ్‌ ఊపిరాడక చనిపోయాడు. డార్నెల్లా ఈ దారుణాన్నంతా వీడియో తీసింది. ఆ తొమ్మిది నిమిషాల వీడియో ప్రపంచాన్ని కుదిపేసింది.

నల్లజాతీయులపై వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమం రేకెత్తేలానూ చేసింది. ఈ వీడియోని ఆధారంగా తీసుకుని ఆ పోలీస్‌ అధికారిని ఉద్యోగం నుంచి తొలగించడమే కాకుండా హత్యానేరం కింద జైలు శిక్షనూ విధించారు. ‘నా తండ్రి, అన్నలు, చుట్టాలు, స్నేహితులు ఎందరో నల్లజాతీయులే. వాళ్లని చూసినప్పుడు ఇదే పరిస్థితి వాళ్లకీ ఎదురైతే?అన్న భయమేసింది. దీనికి అడ్డుకట్ట వేయాలన్న ఆలోచన ముందు భయం అనిపించలేదు’ అంటోంది. ఈమెలోని నిర్భీతే పులిట్జర్‌ కమిటీనీ మెప్పించింది, ప్రత్యేక అవార్డును ఇచ్చేలా చేసింది. ‘ధైర్యంగా వీడియోను తీయడమే కాకుండా వ్యవస్థ పేరిట జరుగుతున్న క్రూర చర్యలను బయట పెట్టడానికి డార్నెల్లా కారణమైంది. వీటిని బయటపెట్టడానికి ఈమెలా సామాన్యులూ బయటకు రావాలన్న ఉద్దేశంతోనే తనని ఎంపిక చేశాం’ అంటున్నారు పులిట్జర్‌ కమిటీ సభ్యులు. ‘ఫ్లాయిడ్‌ హత్యను నేను కళ్లారా చూశాను. కనీసం తన దగ్గరికైనా వెళ్లలేకపోయినందుకు, సాయం చేయలేక పోయినందుకు ఎన్నో సార్లు కన్నీటితో క్షమాపణ చెప్పేదాన్ని. కనీసం నేను తీసిన వీడియో ద్వారా అయినా తన చావుకు కారణమైన వారికి శిక్ష పడేలా చేశా’ అంటోంది 18 ఏళ్ల డార్నెల్లా. ఈమె ధైర్యానికి గుర్తింపుగా పెన్‌ అమెరికా ప్రతిష్ఠాత్మక ‘బెనెసన్‌ కరేజ్‌ అవార్డు’ సహా పలు పురస్కారాలనూ అందుకుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.