ETV Bharat / lifestyle

చిన్నప్పుడు ఇలా ఉండేదాన్ని.. ఇప్పటికీ ఇలాగే ఉంటా! - celebrities instagram posts

ప్రపంచ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా పలువురు సినీ తారలు తమ అభిప్రాయాలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. అవేంటో చూద్దాం రండి..!

rakul, anasuya
rakul, anasuya
author img

By

Published : Apr 23, 2021, 4:59 PM IST

బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌ ‘ఎర్త్‌ డే’ సందర్భంగా ఒక ప్లకార్డు పట్టుకున్న ఫొటోని పోస్ట్‌ చేసింది. ఇందులో ‘అన్ని చెట్లను నరికినప్పుడు, జంతువులన్నీ చనిపోయినప్పుడు, నీరంతా విషపూరితమైనప్పుడు, పీల్చే గాలి హానికరమైనప్పుడు.. అప్పుడు మీరు ఒక విషయాన్ని కనుగొంటారు. అదేంటంటే.. డబ్బుని తినలేము’ అని రాసుంది. అంతేకాదు తను ప్రకృతితో మమేకమైన కొన్ని జ్ఞాపకాలను అభిమానులతో పంచుకుంది.

రవీనా టాండన్‌
రవీనా టాండన్‌
instastrip3.png
ఇన్‌స్టాలో సినీతారల పోస్టులు

అందాల తార కత్రినా కైఫ్‌ ‘ప్రపంచ ధరిత్రీ దినోత్సవం’ సందర్భంగా ఓ ఫొటోని తన అభిమానులతో పంచుకుంది.

కత్రినా కైఫ్
కత్రినా కైఫ్

జర్మన్‌ మోడల్‌ ఎవ్లీన్‌ శర్మ మొక్కల మధ్య దిగిన ఫొటోని పోస్ట్‌ చేసింది. ఈ సందర్భంగా ‘మనందరికీ ఉమ్మడిగా ఉన్నది భూమి ఒక్కటే.. కాబట్టి అందరం కలిసికట్టుగా మన భూమిని రక్షించుకుందాం.. ధరిత్రీ దినోత్సవ శుభాకాంక్షలు’ అని రాసుకొచ్చింది.

ఎవ్లీన్‌ శర్మ
ఎవ్లీన్‌ శర్మ

తెలుగు తార అంజలి తన తాజా ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

అంజలి
అంజలి

టాలీవుడ్‌ నటి నమ్రతా శిరోద్కర్‌ ‘ఎర్త్‌ డే’ సందర్భంగా ఓ ఫొటోని పోస్ట్‌ చేసింది. దీనికి ‘ఆరోగ్యకరమైన వాతావరణం అంటే కేవలం పరిశుభ్రమైన నీరు, నేల, గాలి మాత్రమే కాదు.. మెరుగైన జీవితం, పరస్పరం శాంతియుతమైన మనుగడ కూడా. ఇందుకోసం మొక్కలను నాటండి.. నీళ్లను కలుషితం చేయకండి.. చెత్తని తగ్గించండి.. రీసైకిల్‌, రీయూజ్‌లకు ప్రాధాన్యమివ్వండి.. అన్నింటికీ మించి దయ కలిగి ఉండండి.. కొన్నిసార్లు చిన్న చిన్న పనులే పెద్ద మార్పులకు నాంది పలుకుతాయి’ అని రాసుకొచ్చింది.

నమ్రతా పోస్ట్‌ చేసిన ఫొటో
నమ్రతా పోస్ట్‌ చేసిన ఫొటో

తెలుగు తార తేజస్వీ మదివాడ 'అన్ని కళలూ ఏకమైనప్పుడు' అంటూ ముందు పుస్తకాలు, పెయింటింగ్స్ పెట్టుకుని; గిటారు పట్టుకున్న తన ఫొటోని అభిమానులతో పంచుకుంది.

తేజస్వీ మదివాడ
తేజస్వీ మదివాడ

టాలీవుడ్‌ ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పూదోటలో దిగిన అందమైన ఫొటోని పోస్ట్‌ చేసింది. దీనికి ‘ఎవరో వచ్చి కాపాడతార్లే అనే నమ్మకమే మన భూమికి ఎదురవుతున్న అతి పెద్ద ప్రమాదం. అందుకే ‘పరిష్కారంలో పాలుపంచుకుంటాం.. కాలుష్యంలో కాదు’ అని ప్రతిజ్ఞ చేద్దాం’ అంటూ హ్యాపీ ఎర్త్‌ డే హ్యాష్‌ట్యాగ్‌ని జోడించింది.

రకుల్‌ ప్రీత్‌ సింగ్
రకుల్‌ ప్రీత్‌ సింగ్‌

జబర్దస్త్ యాంకర్ అనసూయ స్కూల్ పిల్లలా పొట్టి గౌను, రెండు జడలు వేసుకున్న ఫొటోలను పోస్ట్ చేసింది. 'నా చిన్నప్పుడు ఇలా ఉండేదాన్ని.. ఇప్పటికీ ఇలాగే ఉంటాను' అంటూ 'మీలో ఉన్న చిన్నారిని మర్చిపోవద్దు' అనే హ్యాష్ ట్యాగ్ ని జోడించింది.

అనసూయ
అనసూయ

బాలీవుడ్‌ బ్యూటీ కాజోల్‌ చెట్టు కింద ధ్యానం చేస్తున్నట్టుగా దిగిన ఫొటోని తన అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ‘మీరు నమ్మినా, నమ్మకపోయినా.. మనకి వైఫై కంటే చెట్లే ఎక్కువగా ఇస్తాయి’ అంటూ ఎర్త్‌ డే, క్లైమేట్‌ యాక్షన్‌ హ్యాష్‌ట్యాగ్‌లను జోడించింది.

కాజోల్
కాజోల్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.