ETV Bharat / lifestyle

వారసత్వం కాదు.. ధీరసత్వం! - Indian Army major Thanya Shergil

అబ్బాయిపుడితే... ‘నా తర్వాత నువ్వేరా... ’ అంటాడు నాన్న.. ఆస్తికయినా, అస్తిత్వానికైనా మా వారసుడివి నువ్వే అనే అర్థం వచ్చేలా! అబ్బాయిలో... విరాట్‌కోహ్లీ, జుకర్‌బర్గ్‌లు కనబడతారు కానీ అమ్మాయిలో మాత్రం పెళ్లిఖర్చే కనబడుతుంది.... అమ్మాయంటే ఖర్చేనా... మరేం కాదా? ఎందుక్కాదూ.... అమ్మాయంటే నిలువెత్తు ప్రేమ.. సంద్రమంత బంధం... అన్నింటికంటే ముఖ్యంగా సవాళ్లని సైతం వారసత్వంగా అందిపుచ్చుకునే సమర్థత. అవన్నీ తమకున్నాయని నిరూపించారు వీళ్లంతా...

Heiress of Indian celebrities followed their parent's footsteps
వారసత్వం కాదు.. ధీరసత్వం!
author img

By

Published : Sep 27, 2020, 4:33 PM IST

ఈ సంవత్సరం ఖేల్‌రత్న అవార్డుని అందుకుని వార్తల్లో నిలిచిన క్రీడాకారిణి.. వినేశ్‌ ఫొగట్‌. ఫొగట్‌ ఈ పేరువింటే మనకు అమీర్‌ఖాన్‌ నటించిన ‘దంగల్‌’ సినిమా.. అందులోని గీత, బబితలే గుర్తుకొస్తారు. వినేశ్‌ఫొగట్‌ కూడా ఆ కుటుంబంలో పెరిగిన అమ్మాయే. తండ్రిలేని వినేశ్‌ని పెదనాన్నమహవీర్‌ ఫొగటే పెంచిపెద్దచేశాడు. చిన్నప్పుడు స్కూల్లో తనని ఏడిపిస్తున్న అబ్బాయిలకు ఎలా బుద్ధిచెప్పాలో అర్థం కాలేదు వినేశ్‌కి. అప్పుడే అక్కలతోపాటూ పెదనాన్న దగ్గర కుస్తీపట్లు నేర్చుకుంది. అక్కలతో పోటీపడుతూ బరిలోకి దిగింది. పెద్దయ్యాక క్రీడా చరిత్రని తిరగరాసింది.

అవును... ఏషియన్‌గేమ్స్‌లో బంగారు పతకాన్ని సాధించిన తొలి రెజ్లర్‌ వినేశ్‌నే. రేసుగుర్రంలా దూసుకుపోతున్న వినేశ్‌ కెరీర్‌ గాయాల కారణంగా బ్రేక్‌పడింది. గత ఒలింపిక్స్‌లో ప్రత్యర్థుల చేతిలో తీవ్రమైన గాయాలపాలైన వినేశ్‌ ఏడాదిపాటూ చక్రాలకుర్చీకే పరిమితం అయ్యింది. ఆ గాయంతో ఇక ఆమె క్రీడాప్రస్థానం ముగిసిందనే అనుకున్నారంతా. శారీరకంగా, మానసికంగా కోలుకోవడానికి వినీత పెద్ద పోరాటమే చేసింది. ఏడాదిలోపే కోలుకొని తిరిగి ఒలింపిక్స్‌ బరిలోకి రావడానికి సన్నద్ధమయ్యింది. ఆ తెగువకే ఆమెకు ఖేల్‌రత్న వచ్చింది. ‘బలహీనత... బలం రెండూ మనలోనే ఉంటాయి. నేను బలవంతురాలిని అనే ఒక్క ఆలోచన మనలో మొదలయితే తక్కిన వారంతా తప్పనిరిగా ఆ నమ్మకానికి బలం చేకూరుస్తారు’ అంటుంది వినేశ్‌ఫొగట్‌.

అమ్మలా చేయగలదా అన్నవారంతా...

‘గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గర్ల్‌’ ఈ సినిమా ఓటీటీలోనే విడుదలైనా అందరి హృదయాలని కదిలించిన సినిమా. 20 ఏళ్ల క్రితమే యుద్ధం విమానం నడిపి అమ్మాయిల సామర్థ్యంపై ఉన్న అపోహలని చెరిపేసిన కంబాట్‌ పైలట్‌ గుంజన్‌సక్సేనాపై తీసిన చిత్రం ఇది. ఇరవైఏళ్ల నాటి ఆ గాథని మన కళ్లముందు నిలపడానికి జాన్వీకపూర్‌ పడిన శ్రమ తక్కువేం కాదు. తల్లి పెద్దనటి. ఈ అమ్మాయి తల్లి వారసత్వాన్ని నిలబెడుతుందా అనే అనుమానాలు... అపోహలు ఓపక్క. ఆ తల్లే దూరమైన తీవ్రమైన ఒత్తిడి మరోపక్క. దీనికి తగ్గట్టు చేసిన మొదటి సినిమాప్రశంసల కన్నా విమర్శలే ఎక్కువగా వినిపించాయి. ఈ ఒత్తిళ్లను పక్కనపెట్టింది. నటిగా తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఘోస్ట్‌ స్టోరీస్‌లో నటించి తానేంటో నిరూపించుకుంది. తర్వాత చేసిన గుంజన్‌తో ప్రశంసలూ అందుకుంది.

అభిమానాన్ని వారసత్వంగా...

సచిన్‌తెండూల్కర్‌కున్న ఫాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అభిమాన ధనాన్ని వారసత్వంగా అందిపుచ్చుకుంది సచిన్‌ కూతురు సారానే. ఇన్‌స్టా, ట్విట్టర్‌లో సారాకున్న అభిమానుల సంఖ్య తక్కువేం కాదు. సినిమాల్లోకి వస్తుందేమో ఈ అమ్మాయి అని అనుకున్నారంతా. కానీ చదువుపైనే దృష్టిపెట్టింది. లండన్‌లో మెడిసిన్‌ చదివిన సారాకు నానమ్మ అనాబెల్‌ నుంచి సేవాభావమూ బాగానే అబ్బింది. అప్నాలయా స్వచ్ఛంద సంస్థకోసం విరాళాలు సేకరించడం, సేవాకార్యక్రమాల్లో భాగం అవ్వడం సారాకు ఎంతో ఇష్టం.

చరిత్ర తిరగరాసింది

ఈ ఏడాది జరిగిన గణతంత్ర దినోత్సవాలకు, ఆర్మీడేకి ఓ ప్రత్యేకత ఉంది. అదేంటో తెలుసా? భారత రక్షణదళాలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేసే కవాతుకు నాయకత్వం వహించింది ఓ మహిళ. ఆమె పేరు తానియాషేర్గిల్‌. ఇలా భారతబలగాలను ఓ మగవ ముందుండీ నడిపించడం చరిత్రలో మొదటిసారి. తానియా ముత్తాత రెండో ప్రపంచయుద్ధంలో సిక్కురెజిమెంటు తరఫున పోరాడాడు. తాత, తండ్రిదీ కూడా అదేబాట. కానీ నాలుగోతరానికి వచ్చేటప్పటికి ఆ కుటుంబంలో అబ్బాయిలు లేరు. అమ్మాయే ఉంది.

ఓ అమ్మాయి ఆ శౌర్యాన్ని వారసత్వంగా అందిపుచ్చుకోగలదా అనే సంశయం ఏమాత్రం పెట్టుకోకుండా, తాను చిన్నప్పట్నుంచి ఉగ్గుపాలతో విన్న వీరగాధలని నిజజీవితంలోనూ నిజం చేసింది తానియా. భారతసైన్యాన్ని ముందుండీ నడిపించింది. ‘యూనిఫాం వేసుకుంటే నేను అమ్మాయిననే భావనే నాకు గుర్తురాదు. మా అమ్మ, నాయనమ్మలు కూడా సైన్యంలో చేరాలని అనుకున్నారు. వాళ్ల కలలని నేను నిజం చేశా ’ అంటుంది తానియా.

వ్యాపారపగ్గాలు తీసుకొని...

మనదేశంలోని లీడింగ్‌ ఐటీ కంపెనీల జాబితా తీస్తే అందులో హెచ్‌సీఎల్‌ మూడోది. కానీ ఒక మహిళ నాయకత్వంలో నడుస్తున్న ఐటీ కంపెనీ మాత్రం అదొక్కటే కావడం విశేషం. వేలకోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యం అయిన హెచ్‌సీఎల్‌ పగ్గాలని తండ్రి శివనాడార్‌ నుంచి ఈ ఏడాదే అందుకున్నారు కూతురు రోషిణీనాడార్‌. ఏకైక కూతురు కాబట్టి వచ్చిందిలే అనుకుంటే పొరపాటే.

ఫోర్బ్స్‌, ఫార్చూన్‌ ప్రచురించిన ప్రపంచంలోని శక్తివంతమైన మహిళల జాబితాలో ఒకరిగా గత మూడు సంవత్సరాలుగా స్థానం దక్కించుకుంటున్నారు. సేవారంగంలో తండ్రికంటే ఒక అడుగు ముందుకేసి నాడార్‌ఫౌండేషన్‌ బాధ్యతలూ తీసుకొన్నారు. అరుదైన జీవజాతుల ఉనికి కోసమూ కృషిచేస్తున్నారు. ఇలా తనని తాను నిరూపించుకున్న తర్వాతే తండ్రి శివనాడార్‌ నుంచి హెచ్‌సీఎల్‌ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు తీసుకున్నారు. భవిష్యత్‌ అవసరాలని దృష్టిలో పెట్టుకుని వ్యాపారాన్ని కొత్తబాటలో నడిపించేందుకు సిద్ధమవుతున్నారామె. ఈ జాబితాలో పార్లే ఆగ్రోని సంస్థని నడుపుతున్న నాదియాచౌహాన్‌, జిందాల్‌ కంపెనీ బాధ్యతలు తీసుకున్న స్మినూజిందాల్‌ వంటివారూ ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.