ETV Bharat / lifestyle

మన రేవతి.. ఫ్లెక్స్​ సీఈవోగా అద్భుతాలు చేస్తోంది! - revathi advaithi precaution measures during corona times

30 దేశాల్లో 100 తయారీ యూనిట్లు... లక్షా అరవైవేల మంది ఉద్యోగులు... రెండు లక్షల కోట్ల రూపాయల టర్నోవర్‌... అమెరికాకు చెందిన తయారీరంగ సంస్థ ‘ఫ్లెక్స్‌’ వివరాలివి. ఆర్థిక మాంద్యానికి మించిన కరోనా సంక్షోభకాలంలో ఈ కంపెనీకి చాలా సవాళ్లు ఎదురయ్యాయి. కానీ ఆ సవాళ్లనే అవకాశాలుగా మల్చుకున్నారు సంస్థ సీఈఓ రేవతి అద్వైతి. బిట్స్‌ పిలానీలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేసిన రేవతి... ఫ్లెక్స్‌ సీఈఓగా చేస్తున్న అద్భుతాలేంటంటే...

flex ceo revathi precaution measures during corona times
మన రేవతి.. ఫ్లెక్స్​ సీఈవోగా అద్భుతాలు చేస్తోంది!
author img

By

Published : Sep 17, 2020, 2:30 PM IST

డిసెంబరులో క్రిస్‌మస్‌ సెలవులకి అమెరికా నుంచి ఇండియా వచ్చారు రేవతి. పదిరోజులు కుటుంబంతో గడిపి జనవరి ప్రారంభంలో తిరిగి వెళ్లారు. ఆఫీసులో అడుగుపెట్టగానే కరోనా మహమ్మారి గురించి సమాచారం అందిందామెకు. ఫ్లెక్స్‌ సీఈఓగా రేవతి బాధ్యతలు తీసుకుని అప్పటికి ఏడాదైనా కాలేదు. ఆపిల్‌, ఫోర్డ్‌, జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌, హెచ్‌.పి. జిరాక్స్‌, గూగుల్‌, ఫియట్‌, లాంటి సంస్థలు తమ ఉత్పత్తులూ, విడి భాగాల తయారీని ఫ్లెక్స్‌కు ఔట్‌సోర్సింగ్‌కి ఇస్తాయి. మెమొరీ చిప్స్‌, కనెక్టర్స్‌, ఎల్‌సీడీ ప్యానెల్స్‌, అధునాతన హాస్పిటల్‌ బెడ్స్‌, సర్జికల్‌ పరికరాలూ, డెస్క్‌టాప్‌లూ, 5జీ కమ్యునికేషన్స్‌లో ఉపయోగించే పరికరాలు... ఇలాంటివెన్నో తయారుచేస్తుంది ఫ్లెక్స్‌. ఈ సంస్థకు 30కి పైగా దేశాల్లో 100 తయారీకేంద్రాలు ఉన్నాయి. అతిపెద్ద తయారీ యూనిట్‌ చైనాలో ఉంది. కరోనా మొదలైంది అక్కడే. దాంతో ఫ్యాక్టరీ నడవడం కష్టమేనని జనవరిలోనే చెప్పారు స్థానిక ఎండీ. కరోనా గురించి తెలుసుకున్న వెంటనే చైనాలో ఉన్న 50వేల ఉద్యోగుల రక్షణ కోసం మాస్కులూ, గ్లవ్స్‌, టెంపరేచర్‌ స్కానర్స్‌, శానిటైజర్లని కొనుగోలుచేయమన్నారు రేవతి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగుల కోసం 30 లక్షల మాస్కుల్ని కొనుగోలు చేయించారు. కరోనా నియంత్రణ సామాగ్రి కోసం ఇప్పటివరకూ సుమారు రూ.వెయ్యి కోట్లు ఖర్చుచేసిందా సంస్థ.

కార్ల స్థానంలో వెంటిలేటర్లు...

ఒకవైపు ఉద్యోగుల భద్రత గురించి చర్యలు తీసుకుంటూనే మరోవైపు తమ తయారీ యూనిట్లు పనిచేసేలా వ్యూహరచన చేశారామె. అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం ఉండటంతో వీడియో కాన్ఫ్‌రెన్స్‌లతో సంప్రదింపులు జరిపేవారు. దానికోసం స్వల్ప విరామం మినహా 24 గంటలూ పనిచేసేవారు. కంపెనీకి నిధుల కొరత రాకుండా సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ స్థానంలో ఉన్నవారికి 20 శాతం, తన జీతంలో 50 శాతం కోత విధించారు. కార్ల తయారీ కంపెనీలు అర్ధంతరంగా ఆర్డర్లని క్యాన్సిల్‌ చేశాయి. మరోవైపు వెంటిలేటర్లూ, హాస్పిటల్‌ బెడ్స్‌ పెద్ద సంఖ్యలో తయారుచేసి అర్జెంటుగా పంపాలంటూ కొన్ని సంస్థలు ఆర్డర్లు ఇచ్చాయి. దాంతో రోజుల వ్యవధిలో కార్ల తయారీ యూనిట్‌ని వెంటిలేటర్ల తయారీ యూనిట్‌గా మార్చారు. అదేమంత సులభంగా జరగలేదు. ఏ.ఐ, డిజిటల్‌ పరికరాల్ని ఉపయోగించి అందుకు అవసరమైన సాంకేతిక, భౌతికపరమైన మార్పుల్ని చేయించారు రేవతి.

ముడిసరకుకి కొరత వస్తే తయారీ యూనిట్లు మూతపడాల్సిందే. వీరికి ముడిసరకు చాలావరకూ చైనా నుంచే వస్తోంది. కానీ చైనాలో రవాణా నిలిచిపోవడంతో తన గత అనుభవంతో ఇతర దేశాల నుంచి వాటిని సేకరించేలా చేశారు. సీఈఓగా బాధ్యతలు తీసుకున్నాక చైనా వెలుపల తయారీ కేంద్రాల్ని ప్రోత్సహించగా చైనాలో నిలిచిపోయిన ఉత్పత్తిని ఇతర దేశాల్లో కొనసాగించారు. ‘నా 30 ఏళ్ల కెరీర్‌లో అత్యంత క్లిష్టమైన సవాలు ఇది’ అని చెబుతారు రేవతి. ఈ కష్టకాలంలో ఆమె పడ్డ శ్రమ వృథా కాలేదు. దాదాపు రూ.2లక్షల కోట్ల టర్నోవర్‌ ఉన్న ఫ్లెక్స్‌... కొవిడ్‌ సమయంలోనూ భారీ లాభాల్ని ఆర్జించింది... మానవవాళి అవసరాల్నీ తీర్చింది!

బిట్స్‌ విద్యార్థి...

రేవతి అద్వైతి తల్లిదండ్రులకు అయిదుగురు సంతానం. అందరూ ఆడపిల్లలే. నాన్న కెమికల్‌ ఇంజినీర్‌ అవ్వడం వల్ల రేవతి అడుగులూ ఇంజినీరింగ్‌ వైపే పడ్డాయి. బిట్స్‌ పిలానీ నుంచి మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేశాక అమెరికాలోని ‘థండర్‌బర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌’లో ఎంబీఏ పట్టా పొందారు. తర్వాత ఓక్లాహామాలోని ‘ఈటన్‌’ సంస్థలో ఫ్లోర్‌ సూపర్‌వైజర్‌గా ఉద్యోగ ప్రయాణం మొదలుపెట్టారు. 2002లో హనీవెల్‌ సంస్థలో చేరి ఆరేళ్లపాటు సరఫరా, ముడి సరకుల సేకరణకు సంబంధించిన బాధ్యతల్ని చూసుకున్నారు. 2008లో ఈటన్‌కు తిరిగొచ్చి ఆ సంస్థ ఎలక్ట్రికల్‌ విభాగానికి సీఈఓ అయ్యారు. సంస్థలో అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రెసిడెంట్‌, సీఓఓ(చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌) హోదాల్లోనూ పనిచేశారు. కంపెనీని ఐరోపా, మధ్య ఆసియా, ఆఫ్రికాలకూ విస్తరించారు. ఇంజినీరింగ్‌, తయారీరంగం, సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో విస్తృతమైన అనుభవం సంపాదించిన రేవతి... నాయకురాలిగానూ ఎన్నో మైలురాళ్లు అందుకున్నారు. ఈమె సామర్థ్యాన్ని గుర్తించి గతేడాది ఫిబ్రవరిలో రేవతిని తమ సంస్థకు సీఈఓగా నియమించింది ఫ్లెక్స్‌. ఈ హోదాలో లక్షా 60వేల మంది ఉద్యోగులకు నాయకత్వం వహిస్తున్నారామె. 2019లో ఫార్చ్యూన్‌ ప్రకటించిన ‘అమెరికాలోని 50 మంది శక్తివంతమైన మహిళలు’ జాబితాలో స్థానాన్ని దక్కించుకున్నారు రేవతి. ‘నా కుటుంబ నేపథ్యం, నేను అనుసరించిన విధానాలు...ఇవేవీ ప్రత్యేకమైనవి కావు. నేనూ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను. నేర్చుకున్న శాస్త్ర, సాంకేతిక నైపుణ్యాలే విజయసాధనాలుగా ఉపయోగపడ్డాయి. అనుభవంలేని విభాగాల్లో పనిచేసే అవకాశం వచ్చినపుడు స్వీకరించాను. బిడియం లేకుండా ప్రపంచమంతా తిరగడానికి సిద్ధమయ్యా. బిట్స్‌లో మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో చేరినప్పుడు మా తరగతి మొత్తానికి నేనొక్కదాన్నే అమ్మాయిని. అమ్మాయిలు స్టెమ్‌(సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథ్‌మెటిక్స్‌) రంగాల్లో రాణించాలి’ అంటారు రేవతి. ఇప్పటికీ తయారవుతోన్న వస్తువుల్ని ఫ్లోర్‌ సూపర్‌వైజర్‌లా గమనించేటపుడు వచ్చే సంతృప్తి మరెందులోనూ రాదంటారు 52 ఏళ్ల రేవతి. కెరీర్‌లో స్థిరపడ్డాక జీవన్‌ ముల్గుంద్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఓ అబ్బాయి, ఓ అమ్మాయి.

ఇదీ చూడండి: 70వ వసంతంలోకి అడుగుపెట్టిన ప్రధాని మోదీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.