దేశాధినేతలు, ప్రముఖులెందరో ఆసీనులై ఉండగా, వేదికపై తన కవిత్వంతో అందరినీ ఉద్విగ్నతకులోను చేసిందో యువతి. యువత భావోద్వేగాలకు ప్రతిరూపంగా నిలిచి, ప్రజల ఆకాంక్షలను అక్షరాలుగా మలిచి చెప్పిన కవిత్వానికి అక్కడున్నవారందరూ ముగ్ధులయ్యారు. ఐకమత్యానికి అర్థం చెప్పి, సమైక్యత, సహకారంతో అమెరికా లాంటి దేశం పురోభివృద్ధి దిశగా అడుగులేసి ప్రపంచానికి స్ఫూర్తిగా నిలవాలంటూ పిలుపునిచ్చింది అమందా గోర్మాన్. గతంలో అమెరికా అధ్యక్షుల పదవీ స్వీకార సందర్భాల్లో పాల్గొన్న కవులందరికన్నా అత్యంత పిన్న వయస్కురాలిగా ఈమె చరిత్రలో నిలిచింది.
అయిదు నిమిషాలపాటు అమందా చెప్పిన ‘ది హిల్‌ఉయ్ క్లైంబ్’ కవితలో అమెరికాలో వరుసగా జరిగిన రాజకీయ పరిణామాలను, ప్రస్తుత పరిస్థితులతోపాటు భవిష్యత్తులో ఏ దిశగా అడుగులేస్తే ప్రజలంతా సుభిక్షంగా జీవిస్తారో చెప్పింది. భవిష్యత్తులో అమెరికా దేశాధ్యక్ష పదవిని పొందడమే తన లక్ష్యమంది. బైడెన్, కమలాహ్యారిస్, ఒబామా వంటి ప్రముఖుల ప్రశంసలు అందుకున్న యువ కవయిత్రి అమందాగోర్మాన్‌కు చిన్నతనంలో మాటలు సరిగ్గా వచ్చేవి కాదట. దాన్ని అధిగమించడానికి కవిత్వం చదవడం, కథలు చెప్పడం వంటివి నేర్చుకుంది. తండ్రి లేకపోయినా, తల్లి వద్ద పెరిగిన గోర్మాన్ సొంతంగా ఎన్జీవోని ప్రారంభించి మహిళలు, బాలికల సంక్షేమం కోసం పాటుపడుతోంది.
- ఇదీ చూడండి : బోరిస్, లోపెజ్లతో ఫోన్లో మాట్లాడిన బైడెన్