- ఏ రకం?: కమ్యూటర్లు, క్రూజర్లు, స్పోర్ట్ బైక్‌లు, టూరర్‌లు, స్ట్రీట్ బైక్‌లంటూ విపణిలో రకరకాలైనవి అందుబాటులో ఉన్నాయి. బండి కొనేముందే వాటి పనితీరు ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఎవరికి ఏవి నప్పుతాయో సమాచారం సేకరించాలి.
- వాడుకునే సమయం: కొందరు రోజులో ఎక్కువదూరం ప్రయాణిస్తారు. ఇంకొందరు వారానికోసారైనా బండి బయటికి తీయరు. ఇలాంటప్పుడు వాడే సమయానికి అనుగుణంగా ఎంపిక ఉండాలి. అత్యధిక దూరం ప్రయాణించేవారు ఎక్కువ మైలేజీ ఇచ్చే బండికి ఓటేయాలి. తక్కువ తిరిగేవారు మంచి ఫీచర్లు, సౌకర్యాలు చూడాలి. నిర్వహణ ఖర్చులూ లెక్కేయాలి.
- ఇంజిన్ ఏది?: 100సీసీ నుంచి 500సీసీ ద్విచక్రవాహనాలు అందుబాటులో ఉన్నాయి. మంచి పికప్ కావాలంటే ఎక్కువ సీసీవి ఎంచుకోవాలి. మైలేజీ ముఖ్యం అనుకుంటే తక్కువ వాటితో వెళ్లిపోవచ్చు.
- శరీరానికి తగ్గట్టు: ఆరడుగుల ఆజానుబాహుడు వంద సీసీ కమ్యూటర్ బైక్ మీద కూర్చుంటే బాగుండదు. బక్కపల్చని కుర్రాడు భారీ టూవీలర్ నడిపితే నప్పదు.
- సౌకర్యవంతంగానూ ఉండవు. బండి కొనేటప్పుడు పర్సనాలిటీకి తగ్గవి ఎంచుకోవడం ముఖ్యం.
- కొత్తదా, పాతదా?: ద్విచక్రవాహనం కొనడం ఎవరికైనా మరపురాని విషయమే. కొత్తది కొనాలా? పాతది తీసుకోవాలా? అనేదే మొదటి సందేహం. బ్రాండ్ న్యూ అయితే రైడింగ్ సాఫీగా సాగిపోతుంది. చాలా ప్లస్‌పాయింట్లు ఉంటాయి. ధర కూడా ఎక్కువే. భరించగలిగే స్తోమత లేకపోతే మంచి కండిషన్‌లో ఉన్న పాతది ఎంపిక చేసుకోవాలి.
- సర్వీస్ సంగతి: కొన్ని బ్రాండ్లు స్టైలిష్‌గా ఉంటాయి. రైడింగ్ బాగుంటుంది. సర్వీసింగ్ సెంటర్లు తక్కువ. విడిభాగాలు మార్కెట్లో అంత తేలిగ్గా దొరకవు. వీటినీ పరిగణనలోకి తీసుకోవాలి.
బైక్ కొంటున్నారా... అయితే ఇవి తెలుసుకోండి! - Tech info
అందరికీ బండి అవసరమే! కానీ కొనేటప్పుడు కొన్ని విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. కమ్యూటర్ బైక్‌తో లాంగ్‌టూర్‌కి వెళ్లాలంటే కుదురుతుందా? ఆఫ్‌రోడ్డు కోసమే తయారైన వాటిని తారురోడ్డుపై చక్కర్లు కొట్టిస్తే లాభమేంటి? అందుకే.. టూవీలర్ కొనేముందే ఇవి గమనించాలి.
బైక్ కొంటున్నారా... అయితే ఇవి తెలుసుకోండి!