మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌తేజ్ రోడ్డు ప్రమాదం రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. శుక్రవారం రోజు ఆయన రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. సాయిధరమ్‌తేజ్.. ఓ స్పోర్ట్స్ బైక్‌పై తీగల వంతెనపై నుంచి వస్తుండగా ప్రమాదం సంభవించింది. మెగా అభిమానులంతా.. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. మరోవైపు చాలా మంది తేజ్ వాడిన ట్రయంఫ్ స్పోర్ట్స్ వాహనం గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఆ బండి వివరాలివే...
సాయిధరమ్ తేజ్ వాడిన హై ఎండ్ స్పోర్ట్స్ బైక్ పేరు ట్రయంఫ్. మోడల్ పేరు స్ట్రీట్ ట్రిపుల్ ఆర్‌ఎస్. ఆరుగేర్లు ఉండే ఈ వాహనం స్టార్ట్ చేసిన నాలుగు సెకన్లలో వంద కిలో మీటర్ల వేగానికి అందుకుంటుంది. ప్రత్యేకంగా రేసింగ్‌ల కోసమే దీన్ని డిజైన్ చేశారు. 45 డిగ్రీల కోణంలో బండిని ఒంపినా కూడా నియంత్రించుకునే సౌకర్యం ఉండటం ఈ బండి ప్రత్యేకత.
- ఈ మోడల్ ధర అన్నీ కలిపి: రూ.12.80 లక్షలు
- కూర్చునే సీటు ఎత్తు: 825 ఎంఎం
- గంటకు అత్యధికంగా ప్రయాణించగల వేగం: 240 కిలోమీటర్లు
- పెట్రోలు లీటరుకు మైలేజీ: 20 కి.మీ
- సామర్థ్యం: 765 సీసీ
- బరువు: 166 కిలోలు
- ఇంధన సామర్థ్యం: 17.4 లీటర్లు
ఆ బైక్ ఎప్పుడు తీసుకున్నాడంటే...
సాయిధరమ్ తేజ్‌కు చిన్నప్పటి నుంచే బైకులంటే ఇష్టం. ఎవరికైనా గిఫ్ట్లివ్వాలన్నా.. బైకులనే ఇవ్వటం తేజ్‌కు అలవాటు. బైకులపై తేజ్కున్న మక్కువను చూసి... గతంలో పవన్‌కల్యాణ్ కూడా అవెంజర్ను బహుమతిగా ఇచ్చారు. తేజ్ వాళ్ల అమ్మ కూడా హై ఎండ్ మోడల్ హార్లీ డేవిడ్ సన్ బైక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. వారాంతాల్లో స్పోర్ట్ బైక్‌లపై.. స్నేహితులతో కలిసి లాంగ్డ్రైవ్స్ వెళ్తుంటారు తేజ్. ఎప్పటి నుంచో తనకు తానుగా.. ఓ మంచి స్పోర్ట్ బైక్ కొనాలనుకున్న సాయి... ఇటీవలే ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్‌ఎస్ బైక్‌ను కొనుకున్నాడు. హైదరాబాద్ ఎల్బీనగర్కు చెందిన అనిల్‌కుమార్ అనే వ్యక్తి దగ్గరి నుంచి ఈ వాహనాన్ని ఐదు నెలల క్రితమే తీసుకున్నాడు.
సంబంధిత కథనాలు...