ETV Bharat / lifestyle

ఆధ్యాత్మిక, మానసిక శక్తినిచ్చే మాసమే మార్గశిరం

శ్రీమన్నారాయణుడి ఆరాధనతోపాటూ పలు పర్వదినాల సమాహారం మార్గశిర మాసం. మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో చేసే లక్ష్మీపూజలూ, ఉండే ఉపవాసాలతో సకల శుభాలు కలుగుతాయని చెబుతున్నాయి శాస్త్రాలు.

special story about   Margashira month specificity  in telugu states
మార్గశిరం.. ఆధ్యాత్మికంగా మానసిక శక్తిని ఇచ్చే ఈ మాసం
author img

By

Published : Dec 16, 2020, 8:00 AM IST

‘మాసానాం మార్గశీర్షాహం’ అంటాడు కృష్ణభగవానుడు. మార్గశీర్షం అంటే మార్గాలలో శ్రేష్ఠమైనదనీ, ఉపయోగకరమైనదనీ అర్థం. కార్తికేయుడు, కాలభైరవుడు, దత్తాత్రేయుడుతోపాటూ భగవద్గీత అవతరించిన మాసం కూడా ఇదే కావడం విశేషం. ఈ జగత్తులోని అన్నింట్లో తాను ప్రకటితమైనప్పటికీ కొన్నింట్లో తన స్వరూపం స్పష్టంగా తెలుస్తుందనీ, అలాంటి కొన్నింట్లో ఈ మాసం కూడా తన స్వరూపమేననీ చెబుతాడు కృష్ణుడు. ఈ నెలలో లక్ష్మీ నారాయణుడిని తులసీదళంతో పూజించడం పుణ్యప్రదమని అంటారు. ఆధ్యాత్మికంగా మానసిక శక్తిని ఇచ్చే ఈ మాసంలో వచ్చే గురువారాల్లో మహాలక్ష్మిని పూజిస్తే ఆయురారోగ్యాలూ, సిరిసంపదలూ వృద్ధి చెందుతాయని చెబుతున్నాయి పురాణాలు. ఈ నెలలో ప్రతిరోజూ శుభ ప్రదమైనదే అయినా మరికొన్ని ప్రత్యేకమైన పర్వదినాలూ ఉన్నాయి. మార్గశిర తదియ నాడు కొన్ని ప్రాంతాల్లో శివపార్వతుల వ్రతం చేసే ఆచారం ఉంది. ఈ మాసంలో వచ్చే షష్ఠిని స్కంద/సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు. శివపార్వతుల కుమారుడైన సుబ్రహ్మణ్యుడు తారకాసుర సంహారం కోసం అవతరించిన దినమే సుబ్రహ్మణ్యషష్ఠి. అలాగే మార్గశిర శుద్ధ అష్టమిని కాలభైరవ అష్టమి అని అంటారు. ఈశ్వరుడు కాలస్వరూపంగా ప్రకటితమైన అవతారం ఇది. కాలభైరవుడు కాశీపట్టణానికి క్షేత్రపాలకుడిగా ఉంటూ అక్కడ మరణించిన భక్తుల పాపపుణ్యాలు స్వయంగా లెక్కిస్తుంటాడని చెబుతారు. శునకం కాలభైరవ స్వరూపం కాబట్టి ఈ రోజున శునకాన్ని పూజించి, గారెల దండను శునకం మెడలో వేస్తే మంచిదని చెబుతారు. ఈ నెలలో వచ్చే త్రయోదశినాడు... ద్రౌపది హనుమంతుడి వ్రతాన్ని చేసిందని చెబుతున్నాయి శాస్త్రాలు. దీన్ని వేదవ్యాసుడు ధర్మరాజుకు చెబితే... ధర్మరాజు ద్రౌపది చేత ఆ వ్రతం చేయించాడట.

ఈ వ్రతాన్ని ఓ సంప్రదాయంగా పాటించి ప్రతి ఏటా, 13 ఏళ్లపాటు చేస్తే ఆయురారోగ్యాలతోపాటూ, సకల శుభాలూ కలుగుతాయని అంటారు. ఈ నెలలో సూర్యుడిని మిత్ర పేరుతో ఆరాధించాలని అంటారు. మార్గశిరంలో వచ్చే శుక్ల సప్తమి రోజున సూర్యారాధన చేస్తే మంచిదని చెబుతారు. అదేవిధంగా మార్గశిర పౌర్ణమిని దత్తజయంతిగా పూజిస్తారు భక్తులు.

ధనుర్మాసం మొదలు..

దక్షిణాయనానికి చివర, ఉత్తరాయనానికి ముందుండే ధనుర్మాసం ఆరంభం అయ్యేది కూడా ఈ మాసంలోనే. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం. సూర్యుడు ధనుస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకూ అంటే... భోగి వరకూ ఈ ధనుర్మాసం కొనసాగుతుంది. ఈ మాసంలో ఆండాళ్‌ పూజ, తిరుప్పావై పఠనం, గోదా కల్యాణం మొదలైనవాటికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఈ కాలంలో తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనం చేస్తారు. ఈ నెలలో సాధారణంగా విష్ణు ఆలయాల్లో స్వామికి అర్చన చేసి ఆ ప్రసాదాన్ని పిల్లలకు ప్రత్యేకంగా పంచుతారు. అలా పంచడాన్ని బాలభోగం అంటారు. కొందరు వైష్ణవులు మార్గశిర పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి నుంచి ధనుర్మాస వ్రతాన్ని చేసుకోవడం ఓ సంప్రదాయమే.

వైకుంఠ ఏకాదశి...

ఏడాదిలో వచ్చే ఇరవైనాలుగు ఏకాదశి తిథుల్లో ప్రతిదీ పవిత్రమైనదైనా.. వీటన్నింటిల్లో వైకుంఠ ఏకాదశి మాత్రం ఉండదు. ఎందుకంటే అన్ని ఏకాదశుల్నీ చంద్రమానం ప్రకారం గణిస్తే... వాటికి భిన్నంగా వైకుంఠ ఏకాదశిని సౌరమానం ప్రకారం గణిస్తారు. సూర్యుడు ఉత్తరాయనానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు. ‘వైకుంఠ ఏకాదశి’, ‘ముక్కోటి ఏకాదశి’, ‘స్వర్గద్వార ఏకాదశి’, ‘మోక్ష ఏకాదశి’ అంటూ పిలిచే ఈ ఏకాదశి రోజునే శ్రీమహావిష్ణువు కొలువై ఉన్న వైకుంఠంలోని వాకిళ్లు తెరుచుకుంటాయని అంటారు.

దక్షిణాయనంలో యోగనిద్రలోకి వెళ్లిన నారాయణుడు కార్తిక శుద్ధ ఏకాదశిరోజున మేల్కొంటాడు. అలా మేల్కొన్న స్వామిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలూ మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశి రోజున వైకుంఠానికి చేరుకుంటారు. అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఈ రోజున ఉత్తర ద్వారంలో శ్రీమన్నారాయణుడిని దర్శించుకుంటే స్వర్గలోకప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. అలాగే... మార్గశిర శుద్ధ ఏకాదశి భగవద్గీత లోకానికి అందిన రోజు కూడా. ఇలా ఎన్నో ప్రత్యేకతలున్న ఈ మాసంలో మహావిష్ణువును భక్తిశ్రద్ధలతో పూజిస్తే... ఆయురారోగ్యాలతోపాటూ సిరిసంపదలూ కలుగుతాయని భక్తుల నమ్మకం.

ఇవీ చూడండి: మహావిష్ణువుకు ప్రీతికరమైన మాసం.. మార్గశిరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.