ETV Bharat / lifestyle

హోలీ ఆడేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి! - colors festival holi

రంగుల పండగ హోలీ అంటే... చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికీ ఎంతో ఇష్టం. ప్రస్తుత పరిస్థితుల్లో రంగులాటకు సిద్ధమయ్యే ముందు కొన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. అవేమిటంటే...

holi, colors festival
హోలీ, రంగులాట, జాగ్రత్తలు
author img

By

Published : Mar 27, 2021, 11:38 AM IST

హోలీ పండుగ ఇష్టపడని వారుండరు. చిన్నాపెద్దా అంతా కలిసి రంగులతో కేరింతలు కొడుతుంటారు. ఐతే.. రంగులతో ఆడుతున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటంటే..

  • జుట్టుకు బాగా నూనె రాసి హోలీ ఆడండి. ఆ తర్వాత తలస్నానం చేసేస్తే రంగులు త్వరగా వదిలిపోతాయి. నూనె రాయకపోతే మాడుకు అంటుకున్న రంగుల వల్ల జుట్టు పొడిబారుతుంది.
  • ముఖం, మెడ, చేతులకు సన్‌స్క్రీన్‌ క్రీమ్‌ రాసుకోవడం మర్చిపోవద్దు. లేకపోతే ఎండలో ఎక్కువసేపు ఆడటం వల్ల చర్మం కందిపోతుంది.
  • బయటకు వెళ్లే ముందు కనుబొమలు, పెదవులు, గోళ్లకు పెట్రోలియం జెల్లీ రాయండి. ఇలాచేస్తే రంగులను కడుక్కోవడం తేలికవుతుంది.
  • ఐస్‌క్యూబ్‌తో ముఖం మీద సున్నితంగా రాయడం వల్ల చర్మ రంధ్రాలు మూసుకుంటాయి. దీంతో రంగులు లోపలికి చొచ్చుకువెళ్లే అవకాశం ఉండదు.
  • గోళ్లు పెద్దగా ఉంటే వాటిని కత్తిరించుకుని నెయిల్‌ పాలిష్‌ వేయడం మర్చిపోకండి.
  • చేతులు, కాళ్లకు చక్కగా మాయిశ్చరైజర్‌ రాయండి. దీంతో చర్మం తేమగా ఉండటంతోపాటు రంగులను వదిలించుకోవడానికి ఎక్కువ శ్రమపడాల్సిన పనీ ఉండదు.
  • హోలీ రోజున సింథటిక్‌వి కాకుండా కాటన్‌ దుస్తులు వేసుకుంటే అవి రంగులను తేలిగ్గా పీల్చుకుంటాయి. దురదలూ రావు.

ఇదీ చదవండి : పత్తి మందారం.. పూటకో వర్ణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.