ETV Bharat / lifestyle

వీళ్లది... ఎంత మంచి మనసో! - nature lovers

నేనూ, నాది అనుకునే ఈ రోజుల్లో కొందరు ప్రకృతి, పరుల గురించీ ఆలోచిస్తున్నారు. అందుకోసం తోచిన సాయం చేస్తూ పక్షుల కడుపునింపుతున్నారు ఒకరు. ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించి భూమాతకు మేలు చేస్తున్నారు మరొకరు. గ్రామ ప్రజల ఆరోగ్యం తన బాధ్యత అనుకున్నారు ఇంకొకరు.  వాళ్లెవరంటే...

nature lovers helping birds and planting saplings
ప్రకృతి ప్రేమికులు
author img

By

Published : Sep 13, 2020, 4:15 PM IST

సూపర్‌ దాదీ

ఎనభై నాలుగేళ్లు అంటే ఇతరులపైన ఆధారపడే వయసు. ఆ వయసులోనూ తన గురించి కాకుండా గ్రామ ప్రజల బాగుకోసమే ఆలోచిస్తోంది తమిళనాడులోని తోప్పంపట్టికి చెందిన నంజమ్మాళ్‌. పలుగూ పారా చేతబట్టి...తన గ్రామంలో పెరటితోటల ఏర్పాటు మొదలుపెట్టింది. ఎందుకంటే కరోనా సమయంలో ప్రజలు పోషకాహారం తీసుకుంటే వైరస్‌ని సమర్థంగా ఎదుర్కోవచ్చని టీవీలో విన్నది. అయితే నిత్యం పొలం పనుల్లో మునిగితేలే గ్రామస్థులు తమ ఆరోగ్యం గురించి అంతగా పట్టించుకోరు. కనీసం కూరగాయలూ, పండ్ల్లూ ఇంట్లో పండితేనైనా ప్రజలు వాటిని తీసుకుంటారని భావించింది నంజమ్మాళ్‌. అందుకే తానే స్వయంగా టొమాటో, బెండకాయ, వంకాయ, ములక్కాడలూ, జామ, బొప్పాయి వంటివి నారుపోసింది.

ప్రతి ఇంట్లో గుంతలు తీసి తనే స్వయంగా ఆ నారును నాటింది. దాంతోపాటు ఆకుకూరలు, సొరకాయ, బీరకాయ, పొట్లకాయ, కాకరకాయ వంటివి విత్తి... అవి మొలిచాక వాటిని తీగలుగా పాకించే ఏర్పాట్లూ చేసింది. అలా ఐదు నెలల నుంచి గ్రామంలోని ప్రతి ఇంట్లోని మొక్కల్ని నంజమ్మాళే సంరక్షిస్తోంది. మొక్కల్ని చీడపీడల నుంచి కాపాడటానికి వేప, సీతాఫలం ఆకులతో చేసిన కషాయాలను చల్లుతోంది. ప్రస్తుతం ఆ గ్రామంలోని వారంతా కూరగాయలు కొనకుండా ఇంటి పంటనే వంటకు వాడతున్నారు. అధిక దిగుబడి వచ్చినవారు అమ్ముకుని అదనపు ఆదాయం గడిస్తున్నారు. అలా ఆదాయాన్నీ ఆరోగ్యాన్నీ సొంతం చేసుకుంటున్న గ్రామస్థులంతా ఆ బామ్మని సూపర్‌ దాదీ అంటూ ప్రేమగా పిలుచుకుంటున్నారు.

పిట్ట సాయం

తమిళనాడులోని కోయింబత్తూరు దగ్గర కులత్తు పాళ్యానికి చెందిన అరవై రెండేళ్ల ముత్తుమురుగన్‌ది వ్యవసాయ కుటుంబం. అతనికి చిన్నప్పట్నుంచీ ప్రకృతి అంటే ప్రాణం. పర్యావరణానికి మేలు జరగాలనీ పశుపక్ష్యాదులు బాగుండాలనీ ఎప్పుడూ కోరుకుంటాడు. అందుకే ఏటా తనకున్న నాలుగు ఎకరాల్లో సాగు చేసి... అందులో కొంత పంటను పక్షుల కోసం వదిలేస్తుంటాడు. చుట్టుపక్కల వాళ్లు వాటిని తరిమివేస్తున్నా ముత్తు మాత్రం వాటి కడుపునింపాలనే చూస్తుంటాడు.

ఈ ఏడాది వ్యవసాయానికి దూరంగా ఉన్న ముత్తు ప్రస్తుతం అర ఎకరంలో పక్షులకోసం సజ్జలూ జొన్నలూ వేశాడు. పిచ్చుకలు, చిలుకలు, వడ్రంగిపిట్టలు, పావురాలు... ఇలా రకరకాల పక్షులు ముత్తు పొలంలో వచ్చి వాలతాయి. వాటికోసం ప్రత్యేకంగా నీళ్ల తొట్టెలు కూడా ఏర్పాటు చేశాడు. వాటి కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆ పొలం వద్దనే ఉంటాడు ముత్తు. అతడు పొలంలోకి వెళ్లినా అవి ఎగిరిపోకుండా ప్రేమగా దగ్గరకు వస్తాయి. వేరే ఎవరైనా వెళితే మాత్రం తుర్రుమంటాయి. ఇక, ముత్తు ఇలా చేయడం వల్ల పిట్టలు ఇతరుల పంటల మీదకు వెళ్లడం లేదు. దాంతో అటు రైతులకూ మేలు జరుగుతోంది... ఇటు పిట్టలకూ ఆహారం అందుతోంది.

వ్యర్థాలే అందమైన కుండీలు

పశ్చిమబంగాలోని మిడ్నాపూర్‌ తాలూకా పిరకాటా ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి పాపన్‌ మొహంతా ఐదేళ్ల క్రితం ఉద్యోగంలో చేరాడు. అతను విధుల్లో చేరిన తొలినాళ్లలో తన పరిధిలోని అటవీ ప్రాంతంలో ప్లాస్టిక్‌ సీసాలు కుప్పలు తెప్పలుగా పడి ఉండటం చూశాడు. వాటివల్ల పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుందని భావించి అలా పడి ఉన్న వేల బాటిళ్లని సేకరించి పూల కుండీలుగా మార్చాడు. ఆ కుండీలతో తన ఆఫీస్‌రూమ్‌ చుట్టుపక్కల అలంకరించి చక్కని ఉద్యానవనాన్ని సృష్టించాడు.

రోడ్ల పక్కన పడి ఉండే పాత ట్లైర్లను కూడా సేకరించి వాటికి రంగులు వేసి ఆకర్షణీయంగా మార్చి... అందమైన, అరుదైన పూల మొక్కలు పెంచుతున్నాడు. అంతేకాదు అటవీ ప్రాంతానికి వచ్చేవారు బాటిళ్లు పడేయకుండా చూస్తున్నాడు. చుట్టుపక్కల వారు బాటిళ్లూ, పాత టైర్లూ ఇస్తే డబ్బులిస్తానని బోర్డు పెట్టాడు. దాంతో వాటిని తెచ్చినవారికి డబ్బులు ఇచ్చి మరీ తీసుకుంటున్నాడు పాపన్‌. పర్యావరణానికి హాని జరగకుండా చూస్తూ పచ్చదనాన్ని కాపాడుతున్నాడు. కాలేజీల లోనూ, స్కూళ్లలోనూ విద్యార్థులచేత వ్యర్థాలతో ఉద్యానవనాలు ఏర్పాటు చేయించాడు. అంతేకాదు, ఆ రాష్ట్ర ప్రభుత్వానికీ పాపన్‌ ఆలోచన నచ్చడంతో ప్రభుత్వ ఆఫీసుల్లోనూ వ్యర్థాలకు అర్థం చెప్పే పనిలో పడ్డారు అధికారులు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.