ETV Bharat / lifestyle

పర్యావరణ ప్రేమికులా?.. మీ కెరియర్‌కు 'హరితహారం' - horticulture courses latest news

కొవిడ్‌-19 వైరస్‌ విజృంభణ మూలంగా మానవాళికి ఎన్నో నష్టాలు ఏర్పడ్డాయి. మరో కోణంలో చూస్తే.. ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం స్థాయి తగ్గి; పరిశ్రమల వ్యర్థాలతో నిండిపోతున్న నదులూ శుభ్రపడ్డాయి. పర్యావరణ ప్రేమికులకు ఈ పరిణామం సంతోషం కలిగించింది.

కెరియర్‌కు హరిత హారం!
కెరియర్‌కు హరిత హారం!
author img

By

Published : Jun 26, 2020, 3:05 PM IST

undefined
కెరియర్‌కు హరిత హారం!

సమాజంలో కాలుష్యం, ప్లాస్టిక్‌ వినియోగం, అంతరిస్తున్న జీవులు, చెట్ల నరికివేత, భూతాపం లాంటివి గమనిస్తే ఎంతో వేదన కలుగుతుంది. వీటిపై సోషల్‌ మీడియాలో పోస్టులు, స్టేటస్‌లకే పరిమితం కాకుండా ఆచరణాత్మకంగా ఏదైనా చేయాలన్న తపన ఉందా? ఇలాంటివారు పర్యావరణంపై తమకున్న ప్రేమను కెరియర్‌గా మార్చుకోవచ్చు. అందుకు ఎన్నో కోర్సులున్నాయి!

దేశంలోని దిల్లీ, ముంబయి, బెంగళూరు సహా దాదాపుగా అన్ని నగరాల్లో గాలి కాలుష్యం గత ఏడాదితో పోలిస్తే 50%పైగా తగ్గింది. నర్మదా నదిని ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంది. ప్రత్యేకంగా పథకాన్నీ ప్రవేశపెట్టింది. అయినా అనుకూల ఫలితాలు రాలేదు. కానీ ఇటీవల నదే తనంతట తాను శుభ్రపడింది. దేశంలోని చాలావరకూ నదుల పరిస్థితీ ఇలానే ఉంది.

ఈ రెండు పరిణామాలూ దేశవ్యాప్త లాక్‌డౌన్‌ తరువాతే సంభవించాయి. వీటిపై ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు, ఆందోళన చెందుతున్న పర్యావరణ ప్రేమికులకు ఈ పరిణామాలు ఊరట కలిగించాయి. ఈ సంఘటనలు బలవంతంగా ఏర్పడిన పరిస్థితుల కారణంగా ఏర్పడ్డాయి. కానీ.. కొందరు లాక్‌డౌన్‌తో నిమిత్తం లేకుండానే ఈ పరిస్థితులు ఏర్పడటానికి కృషి చేస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ స్పృహ పెరుగుతోంది. ఎన్నో దేశాలు ఏ రంగ అభివృద్ధిలోనైనా ఈ కోణం విస్మరించటం లేదు. పర్యావరణ అనుమతులు లేకుంటే భారీ ప్రాజెక్టులు ముందుకు సాగని పరిస్థితి. పారిశ్రామిక అభివృద్ధి కారణంగా ఆర్థిక ప్రగతికి వీలు ఏర్పడుతోంది. కానీ ఇది పర్యావరణపరంగా ఎన్నో సమస్యలను తీసుకొస్తోంది. పెరుగుతున్న పరిశ్రమలు, నగరీకరణ పర్యావరణ సమతౌల్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ ప్రభావం వాతావరణ పరిస్థితులపైనా పడుతోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి పర్యావరణ శాస్త్ర నిపుణులు అభివృద్ధికి ఆటంకం కలగకుండానే కొన్ని పద్ధతులను ప్రవేశపెడుతుంటారు. వీటికి స్థానికంగానే కాకుండా దేశ, విదేశాల్లోనూ ఆదరణ ఉంటుంది.

పర్యావరణం, దాని సమస్య పరిష్కారాల గురించి అధ్యయనం చేసే శాస్త్రమే ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌. పర్యావరణ అంశాలపై ఆసక్తి ఉండి, దానిలో కెరియర్‌ నిర్మించుకోవాలనుకునేవారి కోసం ఎన్నో సంస్థలు కోర్సులను అందిస్తున్నాయి.

కాలుష్య నివారణ, పరిశ్రమల పారిశుద్ధ్యం, రేడియేషన్‌ నుంచి సంరక్షణ, ప్రమాదకరమైన వ్యర్థ పదార్థాల నిర్వహణ, విషపూరితమైన వస్తువుల నివారణ, నీటి రవాణా మొదలైనవన్నీ ఈ కోర్సుల్లో భాగంగా ఉంటాయి. ఇదో ఇంటర్‌ డిసిప్లినరీ విభాగం. దీనిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎకాలజీ, జాగ్రఫీ, జువాలజీ, మినరాలజీ, జియాలజీ, సాయిల్‌ సైన్స్, ఫిజికల్‌ సైన్స్‌ మొదలైన అంశాలుంటాయి.

అందిస్తున్న ప్రముఖ కళాశాలలు

undefined
కెరియర్‌కు హరిత హారం!

* గీతం యూనివర్సిటీ, విశాఖపట్నం
* ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు
* యోగి వేమన యూనివర్సిటీ, కడప
* ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం
* ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌
* యూనివర్సిటీ ఆఫ్‌ దిల్లీ
* ఐఐటీ, ఖరగ్‌పూర్‌
* ద నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియన్‌ యూనివర్సిటీ, బెంగళూరు
* ఇందిరా గాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ, దిల్లీ
* జామియా మిలియా ఇస్లామియా, న్యూదిల్లీ
* దిల్లీ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ మొదలైనవి.

ఏమేం కోర్సులు?

undefined
కెరియర్‌కు హరిత హారం!

* డిగ్రీ స్థాయి: బీఎస్‌సీ (ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ అండ్‌ వైల్డ్‌లైఫ్‌ మేనేజ్‌మెంట్‌; ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ అండ్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌; ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌), బీఎస్‌సీ ఆనర్స్‌ (ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌), బ్యాచిలర్‌ (ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ ఎకాలజీ), బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజ్‌మెంట్, ఇంటిగ్రేటెడ్‌ (బీఎస్‌సీ+ ఎంఎస్‌సీ- ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌) బీటెక్‌ (ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌) కోర్సులున్నాయి. కోర్సుల కాలవ్యవధి మూడు నుంచి నాలుగేళ్లు.
* డిప్లొమాలు, సర్టిఫికెట్లు: డిప్లొమా (ఎన్విరాన్‌మెంట్‌ ఎడ్యుకేషన్‌; ఎన్విరాన్‌మెంట్‌ ప్రొటెక్షన్‌; ఎన్విరాన్‌మెంట్‌ లా) అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా, పీజీ డిప్లొమా (ఎన్విరాన్‌మెంట్‌; కోఆపరేషన్‌ అండ్‌ రూరల్‌ స్టడీస్‌; ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌; ఎన్విరాన్‌మెంటల్‌ ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ ఆడిటింగ్‌; ఎన్విరాన్‌మెంటల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ టెక్నాలజీ; ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్, ఎన్విరాన్‌మెంటల్‌ లా), సర్టిఫికెట్‌ (ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్, ఎన్విరాన్‌మెంటల్‌ అవేర్‌నెస్‌) కోర్సులున్నాయి. కాలవ్యవధి ఒకటి నుంచి రెండేళ్లు.
* పీజీ స్థాయి: ఎంబీఏ (ఫారెస్ట్రీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌), ఎంఫిల్‌ (ఎన్విరాన్‌మెంటల్‌ బయాలజీ; ఎన్విరాన్‌మెంటల్‌ సైన్సెస్‌; షుగర్‌ టెక్నాలజీ), ఎంఎస్‌సీ (డిజాస్టర్‌ మిటిగేషన్‌; ఎర్త్‌ సైన్స్‌; ఎన్విరాన్‌మెంటల్‌ అండ్‌ క్లైమేట్‌ చేంజ్‌ మేనేజ్‌మెంట్‌; ఎన్విరాన్‌మెంటల్‌ బయోటెక్నాలజీ; ఎన్విరాన్‌మెంటల్‌ కెమిస్ట్రీ; ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ మొదలైనవి); ఎంటెక్‌ కోర్సులున్నాయి.
* ఎంఫిల్, పీహెచ్‌డీ (ఎర్త్‌ సైన్సెస్, ఎన్విరాన్‌మెంట్‌ స్టడీస్, ఎన్విరాన్‌మెంట్‌ బయాలజీ) కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
అర్హతలు: డిగ్రీ కోర్సుల్లో చాలావరకు ఇంటర్‌లో బైపీసీ చదివినవారు అర్హులు. బీటెక్‌కు మాత్రం ఎంపీసీ వారు అర్హులు. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజ్‌మెంట్, బీఎస్‌సీ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ అండ్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులకు ఎంపీసీ చదివినవారూ అర్హులే. పీజీ కోర్సులకు బీఎస్‌సీ స్థాయిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, జువాలజీ, జాగ్రఫీ, ఎకాలజీ, జియాలజీ కోర్సులు పూర్తిచేసినవారు అర్హులు. ఎంటెక్‌కు డిగ్రీలో బీటెక్‌ చదివుండాలి. ఎంబీఏకు డిగ్రీ ఏ కోర్సు వారైనా అర్హులే.

చాలావరకూ ప్రవేశపరీక్షల ద్వారానే ప్రవేశం లభిస్తుంది. ఎంటెక్‌కు గేట్‌ తప్పనిసరి. డాక్టొరల్‌ కోర్సులకు ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ లేదా సంబంధిత విభాగంలో మాస్టర్స్‌ పూర్తిచేసి ఉండాలి. డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులకు ఎంచుకున్న కోర్సునుబట్టి అర్హతల్లో మార్పులున్నాయి. డిప్లొమాలకు ఇంటర్‌ అర్హతతో ప్రవేశం కల్పిస్తుండగా అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా, పీజీ డిప్లొమాలకు డిగ్రీ అర్హత ఉండాలి.

ఉద్యోగావకాశాలు

undefined
కెరియర్‌కు హరిత హారం!

పర్యావరణ పరిరక్షణ స్పృహ జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో పెరుగుతోంది. అభివృద్ధికి ఆటంకం కలగకుండానే పర్యావరణాన్ని పరిరక్షించడంపై దృష్టిసారిస్తున్నారు. ఈ సమయంలో సంబంధిత నిపుణుల అవసరం ఏర్పడుతోంది. అంతర్జాతీయ ఏజెన్సీలు, ప్రభుత్వాలు, పరిశ్రమలు, బహుళజాతి సంస్థలు మొదలైన వాటిల్లో వారి అవసరముంది.

ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ పరిధి చాలా పెద్దది. పర్యావరణ పరిరక్షణలో వివిధ అంశాలుంటాయి. వాటికి తగ్గట్టుగానే విస్తృత ఉద్యోగావకాశాలూ ఉంటాయి.
* అడవుల నిర్వహణ, అభివృద్ధి, జంతువుల సంరక్షణలోనూ వీరి అవసరం ఉంది.
* వివిధ ఎన్‌జీఓలు పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన కల్పిస్తుంటాయి. సమస్యలను గుర్తించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వాలకీ అవగాహన కల్పిస్తుంటాయి.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డుల్లోనూ కన్సల్టెంట్లుగా అవకాశాలుంటాయి.

దీనిలో స్పెషలైజ్‌డ్‌ లా కోర్సు చేసినవారికి ఈ అవకాశాలుంటాయి.
ఇంకా వీరికి మైన్స్, ఫెర్టిలైజర్‌ ప్లాంట్‌లు, అగ్రికల్చర్, అర్బన్‌ ప్లానింగ్‌ కమిషన్, టెక్స్‌టైల్‌ అండ్‌ డయింగ్, ఫుడ్‌ప్రాసెసింగ్‌ యూనిట్లు మొదలైనవాటిల్లో అవకాశాలుంటాయి. ఎన్విరాన్‌మెంటల్‌ సైంటిస్టులు, ఎన్విరాన్‌మెంటల్‌ బయాలజిస్టులు, ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్లు, ఎన్విరాన్‌మెంటల్‌ మోడలర్స్, ఎన్విరాన్‌మెంటల్‌ జర్నలిస్టులు మొదలైన హోదాల్లో అవకాశాలుంటాయి.

విద్యార్హత, ఎంచుకున్న రంగం/ పరిశ్రమ, ఉద్యోగస్థాయిని బట్టి జీతభత్యాల్లో మార్పులుంటాయి. సాధారణంగా ప్రారంభవేతనం నెలకు రూ.12,000 నుంచి రూ.30,000 వరకూ ఉంటుంది.

ఇండస్ట్రియల్‌ సెక్టార్‌
ఎకలాజికల్‌ బాలెన్స్, బయోడైవర్సిటీ, వేస్ట్‌ల్యాండ్‌ మేనేజ్‌మెంట్, ప్రకృతి సిద్ధమైన వనరులను కాపాడటం వంటివి చేస్తారు. పరిశ్రమల్లో రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగంలో వీరికి అవకాశాలుంటాయి. పర్యావరణంపై సంబంధిత ప్రభావం ఎంతమేరకు ఉందో వీరు పరిశీలిస్తుంటారు. కాలుష్యం తగ్గేలా చూడటం, వ్యర్థాలను తగ్గించడం వంటివి చేస్తారు.

రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌
పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన బాగా పెరుగుతోంది. దీంతోపాటు పరిశోధనకూ ప్రాముఖ్యం పెరుగుతోంది. ఇందుకు తగ్గట్టుగానే వివిధ విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు సంబంధిత నిపుణులను ఎంచుకుంటున్నాయి. వీరు ప్రకృతి వనరులను కాపాడుకోవడానికి అవసరమైన థియరీలు, పద్ధతులను రూపొందిస్తారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.