ETV Bharat / lifestyle

గోడ లోపల ఇల్లు... బుజ్జాయిలకు భలే థ్రిల్లు..! - mouse hole night light

డాల్‌ హౌస్‌లంటే పిల్లలకెంత ఇష్టమో. ఆ బొమ్మ ఇళ్లలో బుల్లి బుల్లి సామానుతో ఆడుకుంటూ ఎన్నెన్నో ఊహలకు రెక్కలు తొడుగుతుంటారు. ఇక, ఆ చిట్టి పొట్టి ఇళ్లు గోడలో భాగమై ఇంటికి కొత్త అందాన్ని కూడా తెచ్చిపెడితే..? ఇంకా బాగుంటుంది కదా... అయితే, ఈ మౌస్‌ హోల్‌ నైట్‌లైట్‌ల మీద ఓ లుక్కేయాల్సిందే.

kids favorite doll house can be kept in house walls
గోడ లోపల ఇల్లు
author img

By

Published : Sep 27, 2020, 6:20 PM IST

చిన్నదో పెద్దదో ఉండడానికి అందరికీ ఇల్లు ఉంటుంది. అందులో రకరకాల సామాన్లు కూడా ఉంటాయి. కానీ బుజ్జి బుజ్జిగా ఉండే మీనియేచర్‌ ఇళ్లనూ వాటిలో ఉండే చిన్న చిన్న వస్తువుల్నీ చూస్తుంటే మాత్రం పిల్లలకీ పెద్దలక్కూడా ముద్దుగా అనిపిస్తుంది. అందుకే, చిన్న చిన్న ఇళ్లను అందంగా గోడలో అమర్చడం ఇపుడో ట్రెండ్‌లా మారుతోంది.

ఇల్లు కట్టేటపుడు బేస్‌బోర్డ్‌ లైట్‌ల కోసం గోడకి కింది భాగంలో ఒకటీ, రెండూ కన్నాలు చేసి ఉంచుతారు. ఆ స్థానంలోనే ఈ మీనియేచర్‌ మౌస్‌హోల్‌ ఇళ్లను అమర్చేస్తున్నారు. వీటికోసం పనిగట్టుకుని కన్నాలు ఏర్పాటు చేసుకునే వాళ్లూ ఉన్నారు. ఈ రంధ్రాల్లో ఇమిడేలా ఫెయిరీటేల్‌ మీనియేచర్‌ హౌస్‌ లేదా మౌస్‌హోల్‌ నైట్‌లైట్‌ల పేరుతో బుల్లి బుల్లి తలుపులూ లోపల పెట్టుకునేందుకు సామగ్రీ అన్నీ ఆన్‌లైన్‌లో దొరుకుతాయి.

చూడచక్కగా...

చిట్టి మెట్లూ, చిన్ని తలుపులూ, ఇంకా చిన్న కిటికీలూ... లోపలికెళ్తే అంగుళం అంత కుర్చీలూ సోఫాలూ గోడకు అరలూ అందులో పుస్తకాలూ కిటికీలకు కర్టెన్లూ... ఇలా ఓ బుల్లి ప్రపంచమే కనిపిస్తుంది ఈ మినీ హౌసుల్లో. ఈ ఇంట్లో ఎలుక ఉంటున్నట్లు పొట్టి పొట్టి ఎలుక బొమ్మల్నీ పెడుతున్నారు. ఇంకేముందీ, ఈ ఇళ్లు పిల్లలకూ చిత్రంగానే అనిపించి చక్కగా ఆడుకుంటారు. పైగా మామూలు డాల్‌ హౌస్‌లకైతే ప్రత్యేకంగా స్థలం కావాలి. పిల్లలకు బోర్‌కొడితే వాటిని పక్కన పడేస్తారు.

కానీ ఈ మౌస్‌హోల్‌ హౌస్‌లు ఎప్పటికీ అలానే ఉండి ఇంటికి అందాన్ని తెస్తాయి. గోడకు అంత చిన్న తలుపులూ కిటికీలూ అందులో లైట్లూ చూడగానే ఏదో వింతలా అనిపించి ఇవి చూపరులను ఇట్టే ఆకర్షించేస్తాయి. రాత్రిపూట బెడ్‌లైట్‌గానూ పనికొస్తాయి. మధ్య రాత్రిలో ఏ మంచినీళ్ల కోసమో లేచి వస్తున్నపుడు వెలిగేలా కొందరు వీటిలో మోషన్‌ సెన్సర్‌ లైట్లనూ పెట్టుకుంటున్నారు. భలే ఉన్నాయి కదూ..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.