ETV Bharat / lifestyle

Ganesha Himal Museum: గణనాథుని మ్యూజియం ఎక్కడుందో తెలుసా..? - వినాయకుని పార్క్

వినాయకుడు, గౌరీసుతుడు, వక్రదంతుడు, గణేషుడు, విఘ్నేశ్వరుడు, లంబోదరుడు, ఏకదంతుడు, గజాననుడు.. ఇలా ఏ పేరుతో ప్రార్థించినా భక్తుల విన్నపాలను మన్నించి, సర్వ విఘ్నాలను బాపే ఆది దేవుడు.. ఆ గణాధిపుడు. అందుకే కార్యం, శుభకార్యం ఏదైనా సరే.. ముందుగా ఆ గజకర్ణుడికే తొలి ప్రార్థన, తొలి పూజ. బ్రహ్మదేవుడు సైతం తన సృష్టిరచనకు ముందుగా గణపతిని పూజించినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఇంతటి విశిష్ట దైవమైన ఆ గణేషుడిని మన దేశంలోనే కాదు.. చాలా దేశాల్లో దైవంగా పూజిస్తారు. థాయ్‌లాండ్‌లో అయితే ఏకంగా ఆ స్వామికి ఓ మ్యూజియం కూడా ఉంది. మరి ఆ వివరాలేమిటో చూద్దామా..!

Ganesha Himal Museum
గణనాథుని మ్యూజియం
author img

By

Published : Sep 10, 2021, 8:15 AM IST

దేశం, భాష, సంస్కృతి ఏదైనా.. భక్తిభావం మాత్రం ఒక్కటే. అందుకే వారి వారి భావాలననుసరించి, సంప్రదాయాలననుసరించి ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. భారతీయులు ఆదిపూజ ఆ వినాయకుడికి సమర్పిస్తారు. అలాగే సంకట హరుడుగా, శుభకరుడుగా గణేషుడిని ఆరాధిస్తారు. కేవలం మనదేశంలోనే కాదు.. కొన్ని ఇతర దేశాల్లో కూడా గణేషుడు పూజలందుకోవడం విశేషం.

థాయ్‌లాండ్‌లో..

థాయ్‌లాండ్‌లో కూడా వినాయకుణ్ణి విఘ్నాలను బాపే దైవంగానే పూజిస్తారు. ఆ దేశమంతటా వినాయకుడి ఆలయాలు ఉన్నాయి. థాయ్‌లాండ్‌వాసులు ఆ గజాననుణ్ణి 'ఫ్రా ఫికనెట్' గా కొలుస్తారు. ఆ దేశ 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్' చిహ్నం కూడా మన గజముఖుడే! అక్కడ వినాయక ఉత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతాయి. భారతీయులు నవరాత్రులుగా ఉత్సవాలు చేసుకుంటే.. వారు మాత్రం పదిహేను రోజుల పాటు ఉత్సవాలు చేస్తారు. ఆఖరున వినాయక నిమజ్జనం కనుల పండువగా జరుగుతుంది.

అంతేకాక ఇక్కడ ప్రత్యేకంగా వినాయక విగ్రహాలతో కూడిన మ్యూజియం ఉంది. ఖున్ పన్డారా తీరకనాన్డ్ అనే వ్యక్తి 'గణేష్ హిమాల్' అనే మ్యూజియాన్ని నిర్వహిస్తున్నాడు. తన చిన్నతనంలో అతని తండ్రి ఓ వినాయకుడి బొమ్మను బహుమతిగా ఇచ్చాడట. అప్పటినుంచీ వినాయకుడంటే అతనికి ఇష్టం ఏర్పడింది. ఆ ఇష్టంతోనే వినాయకుడి బొమ్మలను, పెయింటింగ్‌లను సేకరించి, మ్యూజియం ఏర్పాటు చేశాడు. వెయ్యికి పైగా వినాయకుడి కళాకృతులు ఉన్నాయీ మ్యూజియంలో.

ఐర్లాండ్‌లో..

ఐర్లాండ్‌లోని కౌంటీ విక్లోకు సమీపంలో 'విక్టోరియా వే' పార్కు ఉంది. బెర్లిన్‌కి చెందిన విక్టర్ లాంగ్‌హెల్డ్ అనే పెద్దాయన దీని యజమాని. ఆయన వివిధ భంగిమల్లో ఉన్న వినాయకుడి విగ్రహాలు చెక్కించి, ఆ పార్కులో ప్రతిష్ఠించాడు. వీటిని తమిళనాడుకు చెందిన భారతీయ శిల్పులే చెక్కడం విశేషం. వీటితోపాటుగా ఉపవాసం చేస్తున్న బుద్ధుడు, శివలింగం, పరమేశ్వరుడి రూపాలు కూడా ఈ పార్కులో ఉన్నాయి.

ఇండోనేషియాలో..

ఇండోనేషియా నిజానికి హిందూ దేశం కాదు. ఆ దేశంలో హిందువులు మైనారిటీలు. పూర్వం ఇండోనేషియా ద్వీపసముదాయంలో హిందూ ధర్మం వర్థిల్లిందనే నమ్మకం ఉంది. ఆ మూలాలు కాలంతోపాటు చెరిగిపోకుండా అలా వస్తూనే ఉన్నాయి. ఆ ఆనవాళ్లు అక్కడ మనకు కనిపిస్తూనే ఉంటాయి. ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం ఆంగ్‌కోర్‌వాట్ అక్కడే ఉంది.

ఇక ఆదిపూజ అందుకునే గణనాయకుడికి ఆ దేశంలో ప్రత్యేక స్థానం ఉంది. ఆ దేశ 20,000 కరెన్సీ నోటుపై వినాయకుడిని ముద్రించారు. నోటుకి ముందుభాగంలో ఇండోనేషియా స్వాతంత్య్ర సమరయోధుడు 'కి హజర్ దివంతర' ఫొటో పక్కనే గణేషుడి బొమ్మ ముద్రించి ఉంటుంది. నోటు వెనుక తరగతి గదిలో పిల్లలు చదువుకుంటున్నట్టుగా ఉండే బొమ్మ ముద్రించి ఉంటుంది. సర్వశుభఫలదాయకుడు కనుకనే ఆ స్వామిని కరెన్సీ నోటుపై ముద్రించినట్టుగా కొందరు నమ్ముతారు. కాకపోతే ప్రస్తుతం ఈ నోటు వాడుకలో లేదు.

గణేషుడు జ్ఞానసంపదకు ప్రతీక. సూక్ష్మగ్రాహి, ఏకసంథాగ్రాహి అయిన ఆ స్వామిని విద్యాధిపతిగా కొలుస్తారు కనుకనే.. ఆ స్వామి అక్కడి ప్రతిష్టాత్మక విద్యాసంస్థ 'బాండుంగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ' లోగోలో కొలువుదీరాడు.

బ్యాంకాక్‌లో..

బ్యాంకాక్‌కి చెందిన ల్యూంగ్ పొర్ అనే బౌద్ధ భిక్షువు గణేషుడి కోసం విరాళంగా ఇచ్చిన స్థలంలో అక్కడి ప్రభుత్వం 'వినాయక ఉద్యానవనం' ఏర్పాటు చేసింది. ఈ పార్కులో ఎన్నో అతి పెద్దవైన వినాయక విగ్రహాలు కొలువుదీరి ఉన్నాయి.

ఇలా ఆ గణాధిపతిని వివిధ దేశాల్లో వివిధ రకాలుగా, వారి వారి భావనలను అనుసరించి కొలుస్తున్నారు.

ఇదీ చూడండి: వినాయక చవితికి.. మన బొజ్జ గణపయ్య ఏం వరమిచ్చాడో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.