ETV Bharat / jagte-raho

పోలీసులు కొట్టారని గొంతు కోసుకున్న వ్యక్తి - Man suicide attempt in vizag bus stand

బహిరంగ మూత్రవిసర్జన కోసం వెళ్లినందుకు  పోలీసులు వేధించారని ఓ వ్యక్తి గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించి తన దగ్గర నగదు తీసుకున్నారని ఆరోపించాడు. బాధితుడు కేజీహెచ్​లో చికిత్స పొందుతున్నాడు.

suicide
author img

By

Published : Oct 21, 2019, 11:54 PM IST

శ్రీకాకుళం జిల్లా కొత్తూరు-పారాపురానికి చెందిన కిలుగు మన్మథరావు అనే వ్యక్తి రావులపాలెం ప్రయాణంలో ఉన్నాడు. విశాఖ బస్టాండ్​లో బస్సు ఆగినపుడు మూత్రశాలకు వెళ్లేందుకు దిగాడు. ఆ సమయంలో ఓ ఇద్దరు ప్రయాణికులు బహిరంగ మూత్రవిసర్జన బయటచేయటంతో ఈ యువకుడు కూడా అక్కడికే వెళ్లాడు. అటుగా వచ్చిన ఇద్దరు కానిస్టేబుళ్లు తనను ఆపి జేబులో ఉన్న నగదు తీసుకుని అందరి ముందు కొట్టారని మన్మథరావు ఆరోపించాడు. ఈ ఘటనతో తీవ్రమనస్తాపానికి గురై, బ్లేడ్​తో గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రరక్త స్రావంతో ఉన్న మన్మథరావును హుటాహుటిన కేజీహెచ్​కి తరలించారు. అత్యవసరవార్డులో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

పోలీసులు కొట్టారని గొంతు కోసుకున్న వ్యక్తి

ఇదీ చదవండి : ప్రగతిభవన్​ ముట్టడి... అరెస్టులు, నిర్బంధాలతో కట్టడి...

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.