ఆపదలో ఆదుకున్నాడన్న అభిమానంతో స్నేహపూర్వకంగా ఉన్నందుకు ప్రేమించాలంటూ విద్యార్థినిని వేధింపులకు గురి చేస్తోన్న యువకుడిపై వరంగల్ అర్బన్ జిల్లా సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు.
హన్మకొండకు చెందిన ఓ విద్యార్థిని తండ్రి ఇటీవల గుండెపోటుతో మరణించాడు. ఆ సమయంలో ఆమె కుటుంబానికి యువకుడు సాయాన్ని అందించాడు.
తల్లీ కూతుళ్లపై దాడి
దీన్ని ఆసరాగా చేసుకుని ప్రేమించాలంటూ విద్యార్థిని కుటుంబాన్ని అతను వేధించసాగాడు. ప్రేమించకపోతే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ప్రేమను ఒప్పుకోకపోవడంతో ఇంటికి వెళ్లి తల్లీ కూతుళ్లపై ఆ ఉన్మాది దాడి చేశాడు. ఈ క్రమంలో యువకుడి ప్రవర్తనపై అతని తల్లిదండ్రులకు చెప్పింది. అయినా మార్పు రాకపోవడంతో విసిగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: డ్రమ్ములో యాచకురాలి మృతదేహం