ETV Bharat / jagte-raho

అధికారుల హామీతో ఆందోళన విరమించిన యువతి బంధువులు - సూర్యాపేట జిల్లా తాజా సమాచారం

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలానికి చెందిన యువతిపై హత్యాచారం చేశారంటూ బంధువులు ఆందోళన దిగారు. తమ కూతురికి న్యాయం చేయాలంటూ కోదాడ ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట బైఠాయించటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యేలు హామీ ఇచ్చిన వారు వినకుండా నిరసన కొనసాగించారు. చివరికి ఆర్డీవో రాతపూర్వకంగా హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించుకున్నారు.

young women death in suryapeta district  relatives stop their alligation against death
అధికారుల హామీతో ఆందోళన విరమించిన యువతి బంధువులు
author img

By

Published : Nov 3, 2020, 5:43 PM IST

సూర్యాపేట జిల్లా చింతలపాలెం గ్రామానికి చెందిన యువతిపై హత్యాచారం జరిగిందంటూ పెద్దఎత్తున ఆందోళన చేపట్టిన బంధువులు ఎట్టకేలకు విరమించుకున్నారు. తమ కూతురికి న్యాయం చేయాలంటూ యువతి తల్లిదండ్రులు, బంధువులు కోదాడ ఆస్పత్రి ఎదుట రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. హుజూర్​నగర్, కోదాడ ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్​ హామీ ఇచ్చినా వారు వినలేదు. చివరికి ఆర్డీవో రాతపూర్వక హామీతో యువతి మృతదేహాన్ని అధికారులు ఇంటికి తరలించారు.

అసలేమైందంటే...

చింతలపాలెం మండలానికి చెందిన యువతి నల్గొండలో డిగ్రీ చదువుతోంది. మూడురోజుల క్రితం స్నేహితునితో కలిసి ద్విచక్రవాహనంపై నల్గొండ నుంచి హైదరాబాద్​కు వెళ్లింది. ఇంతలో ఏమైందో తెలియదు గాని... మరుసటి రోజే యువతికి ఆరోగ్యం బాగాలేదని వసతిగృహం నుంచి ఇంటికి ఫోన్​ వచ్చింది.

తల్లిదండ్రులు యువతిని కోదాడ, ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. డాక్టర్లు యువతిపై అత్యాచారం జరిగినట్లు తెలిపారు. పరిస్థితి విషమించడం వల్ల అక్కడి నుంచి హైదరాబాద్​కు తీసుకొస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.

నిందితులను కఠినంగా శిక్షించాలి: యువతి బంధువులు

యువతిని ద్విచక్రవాహనంపై తీసుకెళ్లిన రాజశేఖర్ అనే యువకునిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను పట్టుకొని ఉరి తీయాల్సిందిగా ఆమె బంధువులు డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించేవరకు నిరసనలు తెలియజేస్తామని బంధువులు ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఇదీ చూడండి:మిస్టరీగా మారిన యువతి మరణం... అసలేమైంది?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.