ETV Bharat / jagte-raho

ఏడేళ్లు ప్రేమించుకున్నారు... పెళ్లి అనగానే చితకబాదారు! - నిర్మల్ జిల్లా నేర వార్తలు

ఏడేళ్లుగా ప్రేమించుకున్న యువకుడిని పెళ్లి చేసుకోవాలని ఆ యువతి ఆరాటపడుతోంది. తనని పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రియుని ఇంటి ముందు భీష్మించుకు కూచుంది. కట్​ చేస్తే ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నిర్మల్​ జిల్లా మామడ మండల కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Young woman assaulted by lover family members at mamada mandal in nirmal district
ఏడేళ్ల ప్రేమ... పెళ్లి అనగానే చితకబాదారు!
author img

By

Published : Nov 22, 2020, 12:52 PM IST

ప్రేమించిన యువకుడు తనను పెళ్లిచేసుకోవాలని ప్రియుని ఇంటి ముందు పోరాటం చేస్తున్న యువతిని ప్రియుడి తరఫు బంధువులు చితకబాదారు. నిర్మల్ జిల్లా మామడ మండల కేంద్రంలో తనని పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రియుడు అడ్లూరి మనోజ్ ఇంటి ముందు యువతి భీష్మీంచుకుని కూచుంది. మనోజ్ కుటుంబ సభ్యులు ఆమెపై దాడి చేశారు. తీవ్ర గాయాలతో ఇంటి ముందు పడిపోయిన ఆమెను స్థానికులు నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఏడేళ్ల ప్రేమ... పెళ్లి అనగానే చితకబాదారు!

ఏడేళ్ల ప్రేమ...

ఏడు సంవత్సరాలుగా మనోజ్, తాను ప్రేమించుకుంటున్నామని... ఇప్పుడు పెళ్లిచేసుకోడానికి నిరాకరిస్తున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. మనోజ్​కు ఇష్టం ఉన్నా... కుటుంబ సభ్యులే అతన్ని మార్చేశారని ఆరోపిస్తోంది. ఇప్పుడు తననే కాదు ఎవరినీ పెళ్లి చేసుకోనని మనోజ్ చెబుతున్నట్లు తెలిపింది. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చదవండి: డ్రైవర్​ నిద్రమత్తు.. ఇద్దరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.