సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద గుండవెల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. నెలరోజుల్లోనే గొర్రెల వరుస మరణంతో మనస్థాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
వారం రోజుల్లో పెళ్లి
పెద్ద గుండవెల్లి గ్రామానికి చెందిన రాజు తన ఇంటి పక్కనే ఉన్న గొర్రెల షెడ్డులో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. నెలరోజులుగా అరవై గొర్రెలు మృత్యువాత పడడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడని బంధువులు తెలిపారు. ఈనెల 18న రాజు వివాహం జరగాల్సి ఉండగా... ఇంతలోనే ఈ ఘటన జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఇదీ చదవండి: వైద్యసిబ్బంది నిర్లక్ష్యం... పురిట్లోనే పసికందు మృతి