ETV Bharat / jagte-raho

స్నేహితుడు టిక్​టాక్​ చేశాడని... యువకుడి ఆత్మహత్య! - రాజోలులో ప్రాణం తీసిన టిక్​టాక్ వీడియో న్యూస్

ఏదైనా వీడియో వైరల్ కావాలంటే.. ఇప్పుడు టిక్​టాక్​ పెద్ద వేదిక. ఆ దారినే నమ్మిన ఓ వ్యక్తి.. తన స్నేహితుడిపై వీడియో చేసి వైరల్ చేశాడు. చివరకు అదే ఆ మిత్రుని ప్రాణం తీసింది.

పరువు తీసిన టిక్​టాక్ వీడియో.. యువకుని ఆత్మహత్య
author img

By

Published : Nov 10, 2019, 11:34 PM IST

పరువు తీసిన టిక్​టాక్ వీడియో.. యువకుని ఆత్మహత్య

టిక్​టాక్ వీడియోలతో.. కొంతమంది ఫేమస్ అవుతుంటే.. మరి కొంతమంది బలైపోతున్నారు. తాజాగా తన స్నేహితుడే.. వీడియో చేసి పరువు తీశాడని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం శివకోటికి చెందిన పుచ్చకాయల మోహన కుమార్(30) ఉపాధి నిమిత్తం కువైట్ వెళ్లాడు.

అక్కడ పని చేసుకుంటూ ఇంటికి డబ్బులు పంపించేవాడు. 2 వేల రూపాయలు చీటి పాడుకుని కనిపించకుండా పరారీలో ఉన్నాడని కుమార్​పై తన స్నేహితుడు.. ఓ టిక్ టాక్ వీడియో చేశాడు. తనపై ఆరోపణలు చేస్తూ.. వీడియో చేయడం వల్ల తన పరువు పోయిందని మోహన కుమార్​ మనస్తాపం చెందాడు. కువైట్​లోనే ఈ నెల మూడో తేదీన ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కువైట్​ ఎంబసీ అధికారులతో భారత ఎంబసీ అధికారులు మాట్లాడి మృతదేహాన్ని తీసుకువచ్చారు. ఉపాధి కోసం వెళ్లిన తన కుమారుడు విగతజీవిగా తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

ఇదీ చదవండి: అయ్యో.. టిక్​టాక్​ ఎంత పని చేశావ్​!

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.