ఏపీ పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం పైడిపర్రు గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువకుడు అదృశ్యమయ్యాడు. గ్రామానికి చెందిన ఏనుగుల పవన్ కుమార్ బాబా (19) శనివారం రాత్రి ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. సాయంత్రం వంతెన వద్ద పవన్ కుమార్ను... అదే గ్రామానికి చెందిన యువకుడు సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీకి డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో కొట్టాడు. అక్కడి నుంచి ఇంటికి వచ్చిన పవన్ కుమార్... అనంతరం బయటకి వెళ్లి... తిరిగిరాలేదని అతని తండ్రి ఆదినారాయణ గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: వంద శాతం పన్ను వసూళ్లే లక్ష్యంగా ప్రభుత్వ కార్యాచరణ