పోలీసులు పెట్టిన కేసుకు భయపడి ఓ యువకుడి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కళ్లపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సాయికిరణ్ అనే యువకుడిని పేకాట కేసులో పోలీసులు అదుపులోకి తీసుకుని వదిలిపెట్టారు. అవమానం భరించలేకపోయిన ఆ యువకుడు.. కొద్దిసేపటికే అతని పొలం వద్దకు వెళ్లి ఉరి వేసుకున్నాడు. మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పేకాట ఆడుతుండగా పట్టుకున్న పోలీసులు.. ఇంట్లో ఉన్న డబ్బును కూడా బలవంతంగా తెప్పించి ఫొటోలు తీశారని.. పోలీసులు అమానపరచటంతోనే తన కొడుకు చనిపోయాడని మృతుడి తల్లి ఆరోపిస్తున్నారు.
ఇవీ చూడండి: వసతుల లేమే శాపం.. మిగిల్చింది గర్భశోకం