కామారెడ్డి జిల్లా దేవునిపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. తల్లిదండ్రులు మందలించారని డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న నీలం రాహుల్(18) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
నిన్న రాత్రి తన స్నేహితుడి సోదరుడు పెళ్లి బరాత్‌కు రాహుల్ వెళ్లాడు. ఆలస్యం కావడంతో ఫొన్ చేసి రాహుల్‌ను తల్లిదండ్రులు మందలించారు. దీనితో మనస్తాపం చెందిన రాహుల్... ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
తన కుమారుడు కడుపునొప్పి తీవ్రం కావడంతో.. భరించలేక ఆత్మహత్య చేసుకున్నారని తల్లిదండ్రులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: 'ఆ భూములు మా నాన్న కొన్నవి.. ఇవ్వాల్సిందే'