సంగారెడ్డి జిల్లా పటాన్చెరు గొల్లబస్తీకి చెందిన మహేశ్ గౌడ్ తరచూ మద్యం సేవించేవాడు. కొన్ని రోజుల క్రితం విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు సకాలంలో ఆస్పత్రిలో చేర్పించడం వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు. మరోసారి గుంతలో దూకి బలవన్మరణానికి పాల్పడుతుంటే స్థానికులు చూసి రక్షించారు.
గురువారం రాత్రి.. మద్యం సేవించిన మహేశ్.. సాకి చెరువులో దూకాడు. రెండు సార్లు బతికి బట్టకట్టిన మహేశ్.. ఈసారి మృతి చెందాడు. చెరువులో తేలుతున్న మహేశ్ మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: కారు నేర్చుకుంటూ.. కానరాని లోకాలకు..