అదృశ్యమైన యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన... సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కునుకుంట్ల పావని(23)... ఆరు రోజుల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని సూర్యాపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి కుటుంబసభ్యులు, పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. గోపాల్‌రెడ్డి నగర్‌లోని పావని వాళ్ల వ్యవసాయ భూమిలో పత్తి తీయడానికి వెళ్లిన కూలీలకు... శవమై కనిపించింది. మృతదేహం పక్కన పురుగుల మందు డబ్బా ఉండటం వల్ల ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానిస్తున్నారు.
మృతురాలు హైదరాబాద్‌లో ఓ ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తోంది. పావని అంగీకారంతోనే తల్లిదండ్రులు కుంచెమర్తికి చెందిన అబ్బాయితో పెళ్లి కుదిర్చారు. ఇదిలా ఉండగా... అదే గ్రామానికి చెందిన బొడ్డుపల్లి వంశీ... పావనితో సన్నిహితంగా ఉన్న ఫొటోలను పెళ్లి కొడుకుకు పంపించాడు. దీంతో మనస్థాపం చెందిన ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఆత్మహత్య చేసుకుందని, దీనికి కారణం వంశీ అని గ్రామస్థులు ఆరోపించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా... నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: రెచ్చిపోయిన మానసిక రోగి.. ఇద్దరిపై కత్తి, సుత్తెతో దాడి