వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ రైల్వే క్వార్టర్స్‌లో... రెండంతస్తుల భవనంపై నుంచి దూకి శ్రావణి అనే 23 సంవత్సరాల యువతి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు నాలుగేళ్లుగా కిడ్నీ, ఛాతీ, కడుపు నొప్పితో బాధపడుతున్నట్టు తల్లిదండ్రులు తెలిపారు. ఇవాళ కూడా తీవ్రమైన కడుపు నొప్పి వస్తోందని తెలిపిన యువతి... పక్కనే ఉన్న భవనం ఎక్కి దూకినట్టు చెప్పారు. తలపై తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందింది.
మృతురాలి తండ్రి జోసెఫ్ 30 సంవత్సరాలుగా రైల్వే యూనియన్ కార్యాలయంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. తల్లి కూడా అక్కడే ఇళ్లలో పనిచేస్తోంది. నలుగురిలో శ్రావణి రెండో సంతానం. గతంలో మృతురాలు ఏఎన్ఎంగా శిక్షణ పొందినట్టు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసుకొని, ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేయనున్నట్టు తెలిపారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో మరో 169 కరోనా పాజిటివ్ కేసులు.. నలుగురు మృతి